రవితేజ (జననం: జనవరి 26, 1968) తెలుగు సినిమా నటుడు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజా గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.

రవితేజ
జననం భూపతిరాజు రవిశంకర్ రాజు
1968, జనవరి 26
భారతదేశం జగ్గంపేట , ఆంధ్రప్రదేశ్
బిరుదు(లు) ఆంధ్ర అమితాబ్, మాస్ మహారాజ్
వృత్తి సినిమా నటుడు
ముఖ్య_కాలం 1990 నుండి
భార్య / భర్త(లు) కళ్యాణి

వ్యక్తిగత సమాచారంసవరించు

రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట ఆయన జన్మస్థలం. ముగ్గరు కొడుకుల్లో రవితేజ పెద్దవాడు. ఆయన తండ్రి భూపతిరాజు రాజగోపాల్ రాజు ఫార్మసిస్టు. తల్లి రాజ్యలక్ష్మి గృహిణి. ఆయన ఇద్దరు తమ్ముళ్ళు రఘు, భరత్ లు కూడా నటులే. రవితేజ తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించక ముందు ఉత్తర భారతదేశంలో జైపూర్, ఢిల్లీ, ముంబై, భోపాల్ మొదలైన ప్రదేశాలన్నీ తిరిగాడు. తరువాత కుటుంబంతో సహా విజయవాడకు వెళ్ళారు. అక్కడ ఆయన సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో బి.ఎ కోర్సులో చేరాడు. రవితేజ నాయనమ్మ, తాతగారి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఖండవల్లి గ్రామం.

ప్రస్థానంసవరించు

మొదట్లో అనేక చిత్రాలలో చిన్న చిన్న వేషాలు వేసినా గుర్తింపు రాలేదు, దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసాడు. 1997 లో కృష్ణవంశీ తీసిన సింధూరంలో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా చేసాడు. కాని జనాల్లోకి రవితేజ పాత్ర విపరీతంగా వెళ్లిపోయింది, ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది .తరువాత అనేక సినిమాల్లో గుర్తింపు వున్న వేషాలు వేసాడు కానీ బ్రేక్ రాలేదు.1999 లో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా నీ కోసం సినిమాలో రవితేజ హీరోగా చేసాడు ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది. తరువాత,

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో హీరోగా చేయగా సూపర్ హిట్ అయి హీరోగా గుర్తింపు వచ్చి ఇడియట్ తో సెటిల్ అయ్యాడు తరువాత అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, డాన్ సీను, కిక్, విక్రమార్కుడు, కృష్ణ, వెంకీ, భద్ర, బలాదూర్,బలుపు,పవర్, దరువు, దుబాయ్ శీను, నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఇట్లు శ్రావణి సుభ్రమణ్యం, లాంటి పెద్ద పెద్ద విజయాలతో తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలో రవితేజ ముఖ్య స్థానంలో ఉన్నారు.2017 లో రాజా ధి గ్రేట్ తో మరొక విజయాన్ని అందుకున్నారు.

చిత్రాలుసవరించు

సంవత్సరం చిత్రం పాత్ర ఇతర విశేషాలు
1991 కర్తవ్యం
చైతన్య
1992 ఆజ్ కా గూండా రాజ్ గ్యాంగ్ లీడర్ చిత్రం యొక్క హిందీ పునఃనిర్మాణం
1993 అల్లరి ప్రియుడు
1994 క్రిమినల్
1996 నిన్నే పెళ్ళాడుతా అతిథి పాత్ర
1998 సింధూరం చంటి
పాడుతా తీయగా
1999 మనసిచ్చి చూడు
ప్రేమకు వేళాయెరా రవి
నీ కోసం రవి విజేత,నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం
సముద్రం చేపల నాని
ఓ పనై పోతుంది బాబు
ప్రేమించేమనసు
2000 క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అతిథి పాత్ర
తిరుమల తిరుపతి వెంకటేశ తిరుపతి
సకుటుంబ సపరివార సమేతం అతిథి పాత్ర
అన్నయ్య రవి
2001 చిరంజీవులు చందు
అమ్మాయి కోసం రవి
బడ్జెట్ పద్మనాభం రవి
ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం
2002 వందేమాతరం రవి
అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అనీల్
ఇడియట్ చంటి
అన్వేషణ'' అవినాష్
ఖడ్గం కోటి విజేత, నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం
2003 ఈ అబ్బాయి చాలా మంచోడు వివేకానంద
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చందు
ఒక రాజు ఒక రాణి రవి
దొంగోడు మాధవ
వీడే ఏడుకొండలు
2004 వెంకీ వెంకీ
నా ఆటోగ్రాఫ్ శీను
చంటి చంటి
2005 భద్ర భద్ర
భగీరథ చందు
2006 షాక్ శేఖర్
విక్రమార్కుడు అత్తిలి సత్తిబాబు,
విక్రమ్ సింగ్ రాథోడ్ IPS
ద్విపాత్రాభినయం
ఖతర్నాక్ దాసు
2007 దుబాయ్ శీను శీను
శంకర్‌దాదా జిందాబాద్ అతిథి పాత్ర
2008 కృష్ణ కృష్ణ పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు
బలాదూర్ శీను
నేనింతే రవి విజేత, నంది ఉత్తమ నటుడు పురస్కారం
2009 కిక్ కళ్యాణ్ పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు
ఆంజనేయులు ఆంజనేయులు
2010 శంభో శివ శంభో కర్ణ
మర్యాద రామన్న వ్యాఖ్యాత
డాన్ శీను డాన్ శీను
2011 మిరపకాయ్ రిషీ
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు అతిథి పాత్ర
దొంగల ముఠా సుధీర్
వీర వీర
2012 నిప్పు సూర్య
దరువు బుల్లెట్ రాజా,
రవీంద్ర
ద్విపాత్రాభినయం
దేవుడు చేసిన మనుషులు రవితేజ
సారొచ్చారు కార్తీక్ నారాయణ
2013 బలుపు శంకర్
దూసుకెళ్తా వాయిస్
2014 పవర్ ద్విపాత్రాభినయం
రోమియో (2014)[1][2] అతిథి పాత్ర
2015 కిక్ 2 కిక్ సినిమా యొక్క తరువాయి భాగం
బెంగాల్ టైగర్ ఆకాష్ నారాయణ్
2017 రాజా ది గ్రేట్ రాజా
2018 టచ్ చేసి చూడు కార్తికేయ
నేల టిక్కెట్టు
అమర్ అక్బర్ ఆంటోని
2020 డిస్కో రాజా[3][4] డిస్కో రాజా
2020 క్రాక్[5] వీర శంకర్ చిత్రీకరణ జరుగుతున్నది.

సోద‌రుడు భరత్సవరించు

ర‌వితేజ తమ్ముడు భరత్ పలు చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఒక్కడే, అతడే ఒక సైన్యం, పెదబాబు, దోచెయ్, జంప్ జిలాని (2014)[6] లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. భరత్ (52) 2017, జూలై 24 రాత్రి హైద్రాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్ మీద శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడ దగ్గర త‌న కారులో అతివేగంగా ప్ర‌యాణిస్తున్న భ‌ర‌త్ ఆగివున్న లారీని ఢీ కొట్టాడు. ఈ ఘోర ప్రమాదంలో భ‌ర‌త్ అక్క‌డిక్క‌డే మృతిచెందాడు. శంషాబాద్ లోని నోవాటెల్ నుంచి సిటికి వస్తుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

మూలాలుసవరించు

  1. సాక్షి, సినిమా (10 October 2014). "సినిమా రివ్యూ: రోమియో". రాజబాబు అనుముల. Archived from the original on 22 May 2019. Retrieved 22 May 2019.
  2. సాక్షి, సినిమా (9 October 2014). "రవితేజ నటించడంతో రోమియో స్థాయి పెరిగింది". Archived from the original on 22 May 2019. Retrieved 22 May 2019.
  3. సాక్షి, సినిమా (24 January 2020). "'డిస్కో రాజా' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 25 January 2020. Retrieved 24 January 2020.
  4. ఈనాడు, సినిమా (24 January 2020). "రివ్యూ: డిస్కోరాజా". Archived from the original on 24 జనవరి 2020. Retrieved 24 January 2020. Check date values in: |archivedate= (help)
  5. "Krack movie update: Ravi Teja's film shooting resumes". Moviezupp (in ఆంగ్లం). 2020-10-07. Retrieved 2020-10-11.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-26. Retrieved 2020-08-04.

బయటి లింకులుసవరించు