నా పేరు శివ
నా పేరు శివ సుసీంద్రన్ దర్శకత్వంలో 2010లో విడుదలైన తమిళ అనువాద చిత్రం. ఇందులో కార్తిక్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కె. ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మాణసారథ్యంలో స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించబడింది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించాడు.[1]
నా పేరు శివ (2010 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సుసీంద్రన్ |
---|---|
నిర్మాణం | కె.ఈ.జ్ఞానవేల్ రాజా |
కథ | సుసీంద్రన్ |
చిత్రానువాదం | సుసీంద్రన్ |
తారాగణం | కార్తిక్ శివకుమార్, కాజల్ అగర్వాల్, జయప్రకాశ్, సూరి |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నేపథ్య గానం | హరిచరణ్, కార్తిక్, రోషిణి, మధు బాలకృష్ణన్ |
గీతరచన | సాహితి |
ఛాయాగ్రహణం | మది |
కూర్పు | కాశీ విశ్వనాథన్ |
నిర్మాణ సంస్థ | స్టూడియో గ్రీన్ |
భాష | తెలుగు |
కథ
మార్చుశివ ఒక మధ్యతరగతి యువకుడు. అతని తండ్రి ఒక టాక్సీ డ్రైవరు. కుటుంబానికంతటికీ ఆయనే జీవనాధారం. శివ తన స్నేహితుడి పెళ్ళిలో ప్రియ అనే ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. కానీ ప్రియ తండ్రి శివను ముందుగా ఒక ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడమనీ అప్పుడే తన కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తానని చెబుతాడు. శివ వెంటనే ఒక చిన్న ఉద్యోగం సంపాదిస్తాడు కానీ వెంటనే తనని ఆ ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఒకసారి శివ తండ్రి ఐదుమంది యువకులు కలిసి ఒక యువతిని అపహరించడం చూస్తాడు. వారిని అడ్డుకోబోగా వాళ్ళు ఆయన మీద దాడి చేస్తారు. ఆయన్ను ఆసుపత్రిలో చేరుస్తారు. అక్కడ కూడా ఆయన మీద వారు దాడి చేయబోగా శివ వచ్చి వారిని అడ్డుకుంటాడు. కుటుంబాన్ని పోషించడం కోసం శివ మళ్ళీ ఉద్యోగం సంపాదించి ఆసరాగా ఉంటాడు. కానీ తండ్రి మీద దాడి చేసిన వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటాడు. తండ్రి మరణించిన అమ్మాయి శవాన్ని చూసి హంతకులను గుర్తించడానికి కొన్ని ఆధారాలు పోలీసులకు చెబుతాడు. హంతకులు శివ తండ్రిని చంపేస్తారు. పోలీసులు వచ్చి ఆ కేసును పరిశీలిస్తామని చెప్పగా శివ వద్దని చెబుతాడు కానీ తానే స్వయంగా హంతకులను వేటాడాలని నిర్ణయించుకుంటాడు. పోలీసులకు తెలియకుండా అతను వారిని ఎలా అంతమొందించాడనేది మిగతా కథ.
తారాగణం
మార్చు- శివగా కార్తిక్ శివకుమార్
- కాజల్ అగర్వాల్
- జయప్రకాశ్
- సూరి
- లక్ష్మి రామకృష్ణన్
- రవిప్రకాష్
- నీలిమ రాణి
- రామచంద్రన్ దురైరాజ్
- అరుల్ దాస్
- వినోద్ కిషన్
- రాజీవన్
సంగీతం
మార్చుఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వం వహించాడు.
మూలాలు
మార్చు- ↑ "Naa Peru Shiva Movie Review - Karthi, Kajal Agarwal others - 123telugu.com". www.123telugu.com. Retrieved 2020-09-15.