కాజల్ అగర్వాల్

సినీ నటి

కాజల్ అగర్వాల్ భారతీయ చలనచిత్ర నటీమణి. తేజ నిర్మించిన లక్ష్మీ కల్యాణం చిత్రం ద్వారా తెలుగులో 2007లో ఆరంగేట్రం చేసింది.[4][5][6]

కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్
జననం
కాజల్ అగర్వాల్

(1985-06-19) 1985 జూన్ 19 (వయసు 39)[1]
వృత్తిమోడల్, నటీమణి
క్రియాశీల సంవత్సరాలు2005-ప్రస్తుతం
జీవిత భాగస్వామిగౌతమ్ కిచ్లు (30 అక్టోబరు 2020)

సినిమా ప్రస్థానం

మార్చు

ఈమె 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం సినిమాలో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయింది. ఈమె 2009లో హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజతో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే. మళ్ళీ అదే సంవత్సరం హీరో రామ్ పోతినేనితో కలిసి గణేష్,అల్లు అర్జున్తో ఆర్య-2 లో నటించింది. తర్వాత 2010లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ లో హీరోయిన్ గా మెప్పించింది. తర్వాత జూనియర్ ఎంటీయార్ తో బృందావనంలో సమంతతో పాటుగా నటించింది. తరువాత ప్రభాస్ హీరోగా వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించారు. 2010లో ఈమె తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీ సరసన నా పేరు శివ చిత్రంలో నటించి తమిళ చిత్రరంగ ప్రవేశం చేసింది. 2012లో పూరీజగన్నాథ్ దర్శకత్వంలో బిజినెస్ మాన్ సినిమాలో నటించారు. సూర్య సరసన మాట్రన్ అనే తమిళ సినిమాలో నటించింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

కాజల్ అగర్వాల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని 2020లో కరోనా లాక్ డౌన్ సమయంలో పెళ్లాడింది. వీరికి 2022 ఏప్రిల్ 19న మ‌గ‌బిడ్డ కలిగాడు.[7]

నటించిన చిత్రాలు

మార్చు
 
కాజల్ అగర్వాల్ తో శ్రియా సరన్, తమన్నా, రవితేజ
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాష గమనికలు
2004 క్యూ....హో గయా నా దియా స్నేహితురాలు హిందీ
2007 లక్ష్మీ కళ్యాణం లక్ష్మి తెలుగు
చందమామ మహాలక్ష్మి తెలుగు
2008 పౌరుడు సంయుక్త తెలుగు
పళని దీప్తి తమిళ్ భైరవ అనే పేరుతో తెలుగులో విడుదలైంది
ఆటాడిస్తా సునంద తెలుగు
సరోజ పూజ తమిళ్ అతిథి పాత్ర,
అదే పేరుతో తెలుగులో విడుదలైంది
బొమ్మలాట్టం అనిత తమిళ్
2009 మొధి విళయాదు ఈశ్వరి తమిళ్ బినామీ వేల కోట్లు అనే పేరుతో తెలుగులో విడుదలైంది
మగధీర యువరాణి మిత్రవిందా దేవి,
ఇందిర
తెలుగు ద్విపాత్రాభినయం,
పేర్కొనబడింది, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి (2009)
గణేష్ దివ్య తెలుగు
ఆర్య 2 గీత తెలుగు
2010 ఓం శాంతి మేఘన తెలుగు
డార్లింగ్ నందిని తెలుగు పేర్కొనబడింది, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి (2010)
నాన్ మహాన్ అల్లా ప్రియ తమిళ్ నా పేరు శివ అనే పేరుతో తెలుగులో విడుదలైంది
బృందావనం భూమి తెలుగు
2011 మిస్టర్ పర్ఫెక్ట్ ప్రియ తెలుగు పేర్కొనబడింది, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి (2011)
వీర చిట్టి తెలుగు
సింగం కావ్య హిందీ పేర్కొనబడింది, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన నటి (2011)
దడ రియా తెలుగు
2012 బిజినెస్ మేన్ చిత్ర తెలుగు
మాట్రాన్ అంజలి తమిళ్ బ్రదర్స్ అనే పేరుతో తెలుగులో విడుదలైంది
తుపాకీ నిషా తమిళ్ అదే పేరుతో తెలుగులో విడుదలైంది
సారొచ్చారు సంధ్య తెలుగు
2013 నాయక్ మధు తెలుగు
స్పెషల్ 26 ప్రియ హిందీ
బాద్‍షా జానకి తెలుగు
ఆల్ ఇన్ ఆల్ అళగు రాజా చిత్ర దేవి ప్రియ తమిళ్
2014 జిల్లా శాంతి తమిళ్ అదే పేరుతో తెలుగులో విడుదల అయ్యింది
ఎవడు దీప్తి తెలుగు అతిథి పాత్ర
గోవిందుడు అందరివాడేలే తెలుగు
2015 టెంపర్ తెలుగు
2016 సర్దార్ గబ్బర్ సింగ్ తెలుగు
కావలై వెండం \ ఎంతవరకు ఈ ప్రేమ తమిళం \ తెలుగు
2017 ఖైదీ నెంబర్ 150 తెలుగు
నేనే రాజు నేనే మంత్రి రాధ తెలుగు
2018 అ! కాళీ తెలుగు
కవచం సంయుక్త చాగంటి తెలుగు
2021 మోసగాళ్ళు అను తెలుగు
2022 హే సినామికా పరమేశ్వరి తమిళ్ \ తెలుగు
2023 ఘోస్టీ \ కోస్టి ఆర్తి తమిళ్\ తెలుగు [8]
కారుంగాపియం \ కార్తీక కార్తీక తమిళ్ \ తెలుగు [9]
భగవంత్ కేసరి తెలుగు నిర్మాణంలో ఉంది [10]
2024 ఇండియన్ 2 తమిళ్ నిర్మాణంలో ఉంది [11]
ఉమా హిందీ నిర్మాణంలో ఉంది [12]
సత్యభామ ఏసిపి సత్యభామ తెలుగు నిర్మాణంలో ఉంది

పురస్కారాలు

మార్చు

సైమా అవార్డులు

మూలాలు

మార్చు
  1. "Kajal Agarwal takes a break on her birthday". Times of India. 19 June 2012. Archived from the original on 12 August 2019. Retrieved 31 August 2012.
  2. Mauli Singh. "Kajal Agarwal: I am here to stay..." Mid-Day. Retrieved 2011-06-02.
  3. "I don't cross the border with my co-stars: Kajal Aggarwal". The Times of India. Retrieved Feb 6, 2013.
  4. T.S. SUDHIR. "If You're Willing, She's Reddy". OutlookIndia.com. Archived from the original on 2011-07-11. Retrieved Jul 18, 2011.
  5. Sunayana Suresh. "South's top earning heroines". The Times of India. Archived from the original on 2013-07-12. Retrieved April 16, 2012.
  6. "Kajal: Most wanted". Sify. Archived from the original on 2015-01-16. Retrieved 2014-08-24.
  7. https://www.news18.com/news/movies/kajal-aggarwal-and-her-husband-gautam-kitchlu-welcome-a-baby-boy-reports-5014171.html
  8. "Kajal Aggarwal's Ghosty wrapped up with a promo song". Times of India. 9 July 2021. Archived from the original on 3 May 2022. Retrieved 2021-07-09.
  9. "Kajal, Regina, Janani and Raiza team up for Karungaapiyam". Cinema Express. Archived from the original on 16 July 2021. Retrieved 16 July 2021.
  10. "Confirmed! Kajal Aggarwal roped in to play female lead in Nandamuri Balakrishna's NBK 108". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-05-16.
  11. "Kajal Aggarwal Reveals Why Indian 2 Shoot Has Been Delayed Indefinitely". News18 (in ఇంగ్లీష్). 2021-03-18. Retrieved 2021-07-13.
  12. "Kajal Aggarwal wraps up shooting of her film 'Uma'". The Hans India. 8 August 2021. Archived from the original on 14 August 2021. Retrieved 2021-08-14.

ఇతర లింకులు

మార్చు