నా లవ్ స్టోరీ 2018లో విడుదలైన తెలుగు సినిమా. అశ్విని క్రియేషన్స్ బ్యానర్ పై గుత్తికొండ లక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు శివ గంగాధర్ దర్శకత్వం వహించాడు. మహీధర్ , సోనాక్షి సింగ్ రావత్, సోనాక్షి, తోటపల్లి మధు, శ్రీమన్నారాయణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 29 జూన్ 2018న విడుదలైంది.[1]

నా లవ్ స్టోరీ
దర్శకత్వంశివ గంగాధర్
రచనశివ గంగాధర్
నిర్మాతగుత్తికొండ లక్ష్మి
తారాగణం
ఛాయాగ్రహణంకిరోన్
సంగీతంవేద నివాస్
నిర్మాణ
సంస్థ
 • అశ్విని క్రియేషన్స్
విడుదల తేదీ
29 జూన్ 2018
సినిమా నిడివి
133 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

ప్రశాంత్ ( మహీధర్ ) జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసే అబ్బాయి, వారు ఉండే అపార్టుమెంటులో నివసించే నందిని(సోనాక్షి సింగ్ రావత్) ని చూసి ప్రేమలో పడతాడు. నందిని కూడా ప్రశాంత్ ని ప్రేమిస్తుంది అయితే అనుకోని కారణాల వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి వాటిని దాటుకొని పెళ్లి కోసం పెద్దలను ఆశ్రయించగా ఇరు కుటుంబాల పెద్దలు కూడా అంగీకరించరు . దాంతో ప్రశాంత్ – నందిని లు తీవ్ర నిర్ణయం తీసుకుంటారు . ప్రశాంత్ – నందిని లు తీసుకున్న తీవ్ర నిర్ణయం ఏంటి ? ఆ నిర్ణయంతో పెద్దలు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నారా ? ఈ ఇద్దరు ఎలా ఒక్కటయ్యారు? అనేది మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: అశ్విని క్రియేషన్స్
 • నిర్మాత : లక్ష్మి
 • దర్శకత్వం : శివ గంగాధర్
 • సంగీతం : వేద నివాస్
 • ఎడిటర్: నందమూరి హరి
 • సినిమాటోగ్రఫీ: కిరోన్
 • పాటలు: శివశక్తి దత్తా, భువనచంద్ర
 • సహా నిర్మాత: కే.శేషగిరి రావు

మూలాలు

మార్చు
 1. The Times of India (2018). "7 Telugu films gearing up for release on June 29". Archived from the original on 21 August 2021. Retrieved 21 August 2021.
 2. 123 Telugu (30 June 2018). "Naa Love Story Telugu Movie Review |Mahidhar Naa Love Story Movie Review" (in ఇంగ్లీష్). Archived from the original on 4 December 2020. Retrieved 21 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)