నారిపెద్ది శివన్నారాయణ

నటుడు
(శివన్నారాయణ నుండి దారిమార్పు చెందింది)

నారిపెద్ది శివన్నారాయణ ఒక ప్రముఖ తెలుగు నటుడు. జెమిని టీవీలో ప్రసారమైన అమృతం ధారావాహిక లో ఆయన పోషించిన అప్పాజీ పాత్రతో బాగా ప్రాచుర్యం పొందాడు. వందకు పైగా సినిమాలలో నటించాడు. గ్రహణం సినిమాతో ఆయన సినిమా కెరీర్ ప్రారంభమైంది. 2007లో ఆయన అమ్మమ్మ.కామ్ అనే సీరియల్ లో ఆయన పాత్రకిగాను ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డుకు ఎంపికయ్యాడు [1]

నారిపెద్ది శివన్నారాయణ
శివన్నారాయణ
జననం
నారిపెద్ది శివన్నారాయణ

శివరామపురం, ప్రకాశం జిల్లా
క్రియాశీల సంవత్సరాలు2001 - ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
అమృతం లో అప్పాజీ పాత్ర
జీవిత భాగస్వామిఅనురాధ
పిల్లలుసాయి కృష్ణ
మురళీ కృష్ణ
తల్లిదండ్రులువెంకట సుబ్బయ్య, వైదేహి

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

ఆయన ప్రకాశం జిల్లా, తాళ్ళూరు మండలం, శివరామపురం గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, వైదేహి దంపతులకు ఐదో సంతానంగా జన్మించాడు. ఆయనకు ముగ్గురు అన్నలు. ఒక అక్క ఉన్నారు. వారిది వ్యవసాయాధారిత కుటుంబం. ప్రాథమిక విద్య తూళ్ళూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలోను, డిగ్రీ సికింద్రాబాదులోనూ, హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ నుంచి నాటకరంగంలో మాస్టర్స్ చేశాడు. పాఠశాల స్థాయి నుంచి కళాస్థాయి వరకు నాటకాలు వేసిన అనుభవం ఆయనకు ఉంది.

వృత్తి, ప్రవృత్తి మార్చు

చదువు పూర్తయిన తరువాత బి.ఎస్.ఎన్.ఎల్ లో కొద్దికాలం అధికారిగా పనిచేశాడు. ఉద్యోగరీత్యా తెలంగాణాలోని సంగారెడ్డి, సికింద్రాబాద్ లో పనిచేస్తున్నపుడు వివిధ రంగస్థల సమూహాలతో నాటకాలలో మంచి వేషాలు వేస్తూ వచ్చాడు. తరువాత నటన మీద ప్రేమతో ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందాడు. ఇప్పటికీ నాటకాల కోసం కొంత సమయం కేటాయిస్తూ వస్తున్నాడు.

ఆ నాటకాలలో నటించడం వలన ఆయనకు అమృతం సీరియల్ లో అప్పాజీ పాత్ర వేసే అవకాశం వచ్చింది. ఆ సీరియలో ఆయన జీవిత గమనాన్ని మార్చివేసింది. అప్పటి దాకా చేస్తున్న స్థిరమైన ఉద్యోగాన్ని వదిలేసి ప్రస్తుతం సినిమాలలో బిజీగా మారడానికి ఆ సీరియలే కారణం. దాని తరువాత నాన్న, అమ్మమ్మ డాట్ కామ్, మంగతాయారు ఆయనకు ఇష్టమైన ధారావాహికలు.

కుటుంబం మార్చు

ఆయన భార్య పేరు అనురాధ. ఆమె గృహిణి. వీరికి సాయికృష్ణ, మరళీకృష్ణ అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిద్దరూ గీతమ్స్ హైదరాబాదులో ఇంజనీరింగ్ చదువుతున్నారు.

సినిమా రంగం మార్చు

నాటకాల నుంచి సినిమా రంగంలో ప్రవేశించడానికి టీవీ సీరియల్ ఆయనకు మంచి విడిదిగా ఉపయోగపడింది. సినీరంగంలో బిజీ కావడంలో ప్రస్తుతం సీరియళ్ళలో నటించడం లేదు. వందకు పైగా సినిమాల్లో నటించాడు.

నటించిన సినిమాలు మార్చు

సీరియళ్ళు మార్చు

వ్యాపకాలు మార్చు

పుస్తకాలు చదవడం ఆయనకు చిన్నప్పటి నుంచి ఉన్న ఏకైక వ్యాపకం. సినిమాల్లో నటించడం మొదలు పెట్టిన తరువాత సినిమాలు చూడటం కూడా అలవాటైంది. ప్రపంచంలోని గొప్ప నటులు, వారు నటించిన పాత్రలు ఆయనకి ఇష్టమే.

పురస్కారాలు మార్చు

  1. అమ్మమ్మ డాట్ కామ్ ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం
  2. అమృతం సీరియల్ లో ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం.
  3. గ్రహణం సినిమాకు కొన్ని పురస్కారాలు, ప్రశంసలు అందుకున్నాడు.

మూలాలు మార్చు

  1. "Sivannarayana". MaaStars.
  2. సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 March 2020. Retrieved 2 April 2020.