రెండవ షా ఆలం
అలి గౌహర్ (జూన్ 19, 1728 - నవంబర్ 19, 1806) చారిత్రక నామం " రెండవ షా ఆలం " 18వ ముఘల్ చక్రవర్తి. ఆయన ఆలంఘీర్ కుమారుడు. రెండవ షా ఆలం పతనావస్థలో ఉన్న మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. ఆయన పాలన కాలంలోనే మొఘల్ చక్రవర్తి అధికారం పతనావస్థకు చేరుకుంది.[1][2] సుల్తాన్ షా ఆలం ఎమీర్ (ఆఫ్ఘనీస్థాన్), అహమ్మద్‌షా అబ్దలి నుండి పలుమార్లు దండయాత్రలను ఎదుర్కొన్నాడు. అది చివరకు మరాఠీలతో మూడవ పానిపట్టు యుద్ధం జరగడానికి దారితీసింది. 1760లో మరాఠీల నాయకత్వంలో అబ్దల్ సైన్యాలు సదాశివరావు భావ్ ఆధ్వర్యంలో ఢిల్లీ మీద దాడి చేసి మూడవ షాజహాన్‌ను సింహాసనం నుండి తొలగించాయి. తరువాత మరాఠీల ఆధ్వర్యంలో ఇమాద్- ఉల్- ముల్క్, రెండవ ఆలం నామమాత్రపు చక్రవర్తిగా నియమించబడ్డారు.[3][4] రెండవ షా ఆలం అసలైన వారసత్వం కలిగిన చక్రవర్తిగా భావించబడినప్పటికీ 1772 వరకు మరాఠీ సైన్యాధిపతి మహదాజీ సిండే రక్షణలో ఉన్న ఢిల్లీకి రావడానికి అవకాశం లభించలేదు. రెండవ షా ఆలం బక్సర్ యుద్ధంలో ఆగ్కేయులను ఎదిరిస్తూ యుద్ధం చేసాడు. రెండవ షా ఆలం " దివాన్ కవిత్వం " పేరిట కవుత్వరచన చేసాడు. ఆయన " అఫ్తాబ్ " కలం పేరుతో రచనలు చేసాడు. ఆయన కవిత్వాన్ని మిర్జా ఫకీర్ మకిన్ సరక్షించి సంకలనం చేసి బధ్రపరిచాడు.[5]
Shah Alam II | |||||
---|---|---|---|---|---|
15th Mughal Emperor | |||||
పరిపాలన | 10 October 1760 – 19 November 1806 | ||||
Coronation | 24 December 1759 | ||||
పూర్వాధికారి | Alamgir II | ||||
ఉత్తరాధికారి | Akbar Shah II | ||||
జననం | Shahjahanabad, Subah of Delhi, Mughal Empire | 1728 జూన్ 25||||
మరణం | 1806 నవంబరు 19 Shahjahanabad, Subah of Delhi, Mughal Empire | (వయసు 78)||||
Burial | |||||
Spouses | Piari Begum Taj Mahal Begum Jamil un-nisa Begum Qudsia Begum Mubaraq Mahal Murad Bakht Begum | ||||
వంశము | Over 16 sons and 2 daughters | ||||
| |||||
రాజవంశం | Timurid | ||||
తండ్రి | Alamgir II | ||||
తల్లి | Nawab Zinat Mahal Sahiba | ||||
మతం | Islam |
ఢిల్లి నుండి తప్పించుకొనుట
మార్చురాకుమారుడు అలి గౌహర్ (రెండవ షా ఆలం) రెండవ అలంఘీర్ రాజ్యాంగ వారసుడు. అలంఘీర్‌ను మూడవ విజియర్ ఘాజీ ఉద్- ద్దీన్- ఖాన్ ఫెరోజ్ జంగ్ (ఇమాద్- ఉల్- ముల్క్), మరాఠీ పేష్వా (సదాశివరావు భౌ సోదరుడు) ముఘల్ చక్రవర్తిగా సింహానాన్ని అధిష్ఠింపజేసారు.[6] తరువాత వారు చక్రవర్తి మీద ఆధిపత్యం చూపించి తరువాత రెండవ ఆలంఘీర్‌ను వధించి ఆయన కుమారుడు రాకుమారుడు గౌర్‌ను చక్రవర్తిగా నియమించారు. రాకుమారుడు అలి గౌర్ 1759లో ధైర్యంగా ఢిల్లీ నుండి తప్పించుకుని తూర్పు భూభాగానికి చేరాడు.అక్కడ ఆయన బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో తనశక్తిని కూడదీసుకోవచ్చని విశ్వసించాడు.
నజీబ్- ఉద్- దుల్లా పెద్ద సైన్యాన్ని కూడదీసుకుని ఢిల్లీకి వెలుపల విడిది చేసి దురాక్రమణ చేసిన మూడవ ఘజీ- ఉద్- దీన్ ఫెరోజ్ జంగ్ (ఇమాద్ -ఉల్- ముల్కి) ని రాజధానిని వదిలివెళ్ళమని వత్తిడి చేసి మూడవషాజహాన్‌ను పదవి నుండి తొలగించారు. నవాబ్- ఉద్- దుల్లా ముస్లిం ప్రముఖులతో కలిసి మరాఠీలను ఓడించడానికి ప్రణాళిక వేసారు. మరాఠీలను ఓడించడానికి నవాబ్- ఉద్- దుల్లా శక్తివంతుడైన అహమ్మద్ షా దుర్రానీతో చేతులు కలిపాడు. అహమ్మద్ షా దుర్రానీ ప్రణాళికా బద్దంగా మరాఠీలను ఓడించి అలి గౌర్‌ను (రెండవ షా ఆలం)ను సింహానాధిష్ఠుని చేసాడు. [7]
తూర్పు భూభాగ కలహాలు
మార్చు1760లో బెంగాల్, బీహార్, ఒరిస్సాలో కొంత భాగం, మొఘల్ యువరాజు అలి గౌహర్ మొఘల్ సైన్యం 30,000 తో మీర్ జఫర్, మూడవ ఘజి ఉద్- దిన్- ఖాన్ ఫెరోజ్ జంగ్ (ఇమాద్ - ఉల్- ముల్కి) లను త్రోసి వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ 1759 నాటికి అవధ్, పాట్నా వైపు సాగారు. అయినప్పటికీ ఈ కలహంలో మధ్యలో ఈస్టిండియా కంపెనీ జోక్యం చేసుకుంది. అయినప్పటికీ మొఘల్ సైన్యం తూర్పు సుభాహ్‌లను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి తీవ్రత చూపింది. రాకుమారుడు అలీ గౌహర్ ముహమ్మద్ కులీ ఖాన్, కాదిం హుసైన్, కాంగర్ ఖాన్, హిదయత్ అలి, మీర్ అఫ్జల్, ఘులాం హుసైన్ తబతబలిలతో ముందుకు సాగాడు. మొఘల్ సైన్యాలకు బలం కలిగిస్తూ షుజా-ఉద్-దౌలా, నజీబ్ - ఉద్- దౌలా, అహ్మద్ షా బంగష్ సైన్యాలు చేరాయి. వారికి మరింత బలం కలిగిస్తూ జీన్ లా డీ లౌరిస్టన్, 200 మంది ఫ్రెంచ్ వారు కలిసి బ్రిటిష్ సైన్యాలతో యుద్ధం చేసారు. ఈ యుద్ధం ఏడు సంవత్సరాల యుద్ధంగా వర్ణించబడింది.[8]
విజయం
మార్చురాకుమారుడు అలీ గౌహర్ విజయవంతంగా పాట్నా వైపు ముందుకు కదిలాడు. తరువాత 40,000 సైన్యాలతో పాట్నాను స్వాధీనం చేసుకున్నాడు.తరువాత రాకుమారుడు అలీ గౌహర్ రామనారాయణను ప్రాణాలతో పట్టుకోవడం కాని లేక చంపడం కానీ చేయమని ఆదేశాలు జారీ చేసాడు. మీర్ జాఫర్ రౌద్రంగా పోరాడి మరణం అచులను తాకి రామనారాయణుని విడిపించడానికి తన కుమారుడు మిర్ సాదిక్ అలీ ఖాన్‌ను యుద్ధానికి పంపాడు. మీర్ జాఫర్ కూడా రాబర్ట్ క్లైవ్ సహాయం కోరాడు. మేజర్ జాన్ కైలౌడ్ దానిని నివారించి 1761 రాకుమారుడు ఆలి గౌర్‌తో చేతులు కలిపాడు. తరువాత వారు సమైక్యంగా పాట్నా యుద్ధం, సిర్పూర్ యుద్ధం, బీర్పూర్ యుద్ధం, సివాన్ యుద్ధం చేసారు.
రెండవ షా ఆలం తరువాత జరిగిన రాజీప్రయత్నాల తరువాత బెంగాల్ కొత్త నవాబు మీర్ కాసింను (మీర్ సాదిక్ అలీ ఖాన్ మరణం తరువాత బెంగాల్ నవాబుగా నియమించబడ్డాడు) కలిసి సంప్రదించాడు. తరువాత మీర్ కాసిం బెంగాల్, బీహార్, ఒరిస్సా సుబేదార్‌గా నియమించబడ్డాడు. అందుకు ప్రతిఫలంగా 2.4 మిలియన్ల వార్షిక కప్పం చెల్లించడానికి అంగీకరించాడు. రెండవ ఆలం తరువాత అలహాబాదుకు వెళ్ళాడు. 1761 -1764 వరకు అలహాబాదు అవధ్ నవాబ్ " షుజా- ఉద్ - దౌలా " సంరక్షణలో ఉంది. అదేసమయం మీర్ కాస్ం, బ్రిటిష్ మద్య సంబంధాలు క్షీణించాయి. ఫలితంగా బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి కలిగించిన పలు విశేషాధికాలను రద్దు చేసాడు. అలాగే మీర్ కాసిం మొఘల్ సామ్రాజ్యానికి బద్ధశత్రువైన రాం నారాయణను కూడా అధికారం నుండి తొలగించాడు. తరువాత ఆయన మొఘల్ సామ్రాజ్యానికి మరింత బలం కలిగించడానికి పాట్నాలో ఫిరంగి తయారీ కంపెనీ ఆరంభించాడు.
అభివృద్ధి పనులకు ఆగ్రహించిన ఈస్టిండియా కంపెనీ ఆయనను పదివీచ్యుతుని చేయాలని నిశ్చయించుంది. మీర్ కాసిం బెంగాల్, బీహార్, ఒరిస్సా సుబేదార్ పదవి నుండి తొలగించబడ్డాడు. మీర్ కాసిం అవధ్ నవాబుకు " సుజా - ఉద్- దౌలా "కు ప్రోత్సాహం అందించగా బ్రిటిష్ ప్ప్రభుత్వం రెండవ షా ఆలానికి ప్రోత్సాహం అందించింది. .
బక్సర్ యుద్ధం
మార్చుబక్సర్ యుద్ధం 1764 అక్టోబరు 22న జరిగింది. యుద్ధంలో బ్రిటిష్ సైన్యాలకు హెక్టర్ మున్రో నాయకత్వం వహించగా, సమైక్య సైన్యాలకు మీర్ కాసిం (బెంగాల్ నవాబు షుజా-ఉద్ దౌలా), అవధ్ నవాబు, మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం నాయకత్వం వహించారు..[9] ఈ యుద్ధం బక్సర్ వద్ద జరిగింది. బక్సర్ అప్పుడు గంగాతీరంలో బెంగాల్ భూభాగంలో ఉంది. బక్సర్ యుద్ధంలో ఈస్టిండియా కంపెనీ విజయం సాధించింది.
దివానీ హక్కులు
మార్చుబక్సర్ యుద్ధం తరువాత బ్రిటిష్ ప్రభుత్వంచేత ఓడించబడిన రెండవ షా ఆలం చక్రవర్తి 1765లో అలహాబాదు వద్ద జరిగిన ఒప్పందం మీద సంతకంచేసి బ్రిటిష్ ప్రభుత్వ రక్షణ కోరాడు. బదులుగా రెండవ షా ఆలం బెంగాల్, బీహార్, ఒరిస్సా భూభాగాలతో కలసిన దివానీ హక్కును (పన్ను వసూలు చేసుకునే అధికారం) బ్రిటిష్ వారికి ఇచ్చాడు. బదులుగా బ్రిటిష్ ప్రభుత్వం 2.6 మిలియన్ల వార్షిక కప్పం చెల్లించింది. ఒప్పందం బ్రిటిష్ వారికి 20వేల ప్రజల నుండి పన్ను వసూలు చేసే హక్కును ఇచ్చింది. డెప్యూటీ నవాబు ముహమ్మద్ రేజా ఖాన్ పన్ను వసూలు చేసే బాధ్యత వహించాడు.
ఢిల్లీని వదలుట
మార్చురెండవ షా ఆలం ఢిల్లీలో లేని సమయంలో ఆయన కుమారుడు యువరాజు మిర్జా జవాన్ బక్త్, నజీబ్ - ఉల్- దౌలాలు తరువాత 12 సంవత్సరాలు ఢిల్లీ రాజప్రతినిధిగా బాధ్యత వహించాడు.
Return to Delhi
మార్చుచక్రవర్తి అలహాబాదు కోటలో 6 సంవత్సరాల కాలం నివసించాడు. 1774లో వారన్ హేస్టింగ్స్ మొదటి బెంగాల్ గవర్నరుగా నియమించబడిన తరువాత 2.6మిలియన్ల కప్పం చెల్లించడం ఆపివేవేసి అలహాబాదు, కర (ఉత్తరప్రదేశ్) జిల్లాలను అవధ్ నవాబుకు స్వాధీనం చేసాడు. 1793లో ఈస్టిండియా కంపెనీ బెంగాల్‌ను విలీనం చేసుకుంది. రెండవ షా ఆలానికి ఈస్టిండియా కంపెనీ మరాఠీలను విశ్వసించవద్దని సలహా ఇచ్చింది.
1771 లో మరాఠీలు మహాద్జీ సింధియా ఉత్తర భారతదేశానికి తిరిగి వచ్చి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారు. రెండవ షా ఆలం 1771 మే మాసంలో అలహాబాదును విడిచి 1772లో యురోపియన్ శైలిలో శిక్షణ పొందిన సైన్యంతో యుద్ధానికి సన్నద్ధమై ఢిక్లీకి చేరుకున్నాడు. మొఘల్ సైన్యాలకు మిర్జా నజాఫ్ ఖాన్ అధ్యక్షత వహించాడు. వారు మొఘల్ సామ్రాజ్యానికి పూర్వవైభవం తీసుకురావాలని కోరుకున్నారు. మరాఠీలతో వారు రోహిల్ ఖండ్ భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత జబితా ఖాన్‌ను ఓడించి పాథర్ కోటను నిధినిక్షాపాలతో స్వాధీనం చేసుకున్నారు. సుంహాసనం స్వాధీనం చేదుకున్న తతువాత రెండవ షా ఆలం మిర్జా నజీఫ్ ఖాన్ మీద ఆధారపడడం మొదలైంది. 1773 లో పూనాలో నారాయణరావు పేష్వా హత్యచేయబడిన తరువాత మరాఠీ సైన్యాలు ఉత్తరభరతాన్ని వదిలి పెట్టారు.
1787లో బిజయ సింగ్ (జోధ్పూర్ రాజు) రెండవ షా ఆలానికి మర్యాదపూర్వకంగా బంగారు తాళంతో అజ్మీర్ కోటను కానుకగా ఇచ్చాడు. [10] బిజయ సింగ్ మరొయు ప్రతాప్ సింగ్ ఆదేశంతో బంగారు తాళపుచెవిని అందించానని దూత తెలియజేసాడు. రెండవ షా ఆలం తిరిగి మొఘల్ సామ్రాజ్యపు వైభవం పునఃస్థాపించాడు.
.
Reformation of the Mughal Army
మార్చురెండవ షా ఆలం ముందుగా మిర్జా నజాఫ్ ఖాన్ ఆధ్వర్యంలో ముఘల్ సైన్యాలను బలోపేతం చేయడానికి ప్రయత్నించాడు. కొత్త సైన్యంలో తుపాకులు, తలవారులను విజయవంతంగా ప్రయోగించగలిగిన కాల్బలం,[11] ఉంది. వారు ప్రయాణానికి ఏనుగులను ఉపయోగించేవారు. ఫిరంగులు, ఆశ్వికదళాలు తక్కువగా ఉన్నాయి.మిర్జా నజాఫ్ ఖాన్ బెంగాల్ నవాబు మీర్ కాసిం సహకారంతో ఫైర్లాక్ తుపాకులను సైన్యంలో పరిచయం చేసాడు.[11]
Jat invasions
మార్చు18వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం క్షీణదశకు చేరుకుంటున్న సమయంలో భరత్పూర్ రాజాస్థానికి చెందున హిందూ జాట్లు మొఘల్ సంరాజ్యం మీద అనేకమార్లు దాడి చేసారు. ప్రత్యేకంగా ఢిల్లీ మీద దాడిచేసి మొఘల్ రాజ్యానికి చెందిన పలు ప్రాంతాలను హస్థగతం చేసుకున్నారు.[12] ఆగ్రా మీద జాట్లు చేసిన దాడిలో వారు నగరాన్ని దోచుకున్నారు. తాజ్ మహల్ ముఖద్వారంలో ఉన్న రెండు వెండి ద్వారాలు కూడా దీపిడీ చేయబడ్డాయి. 1764లో వెండి ద్వారాలు సూరజ్ మాల్‌లో కరిగించబడ్డాయి.[13] సూరజ్ మాల్ కుమారుడు జవహర్ సింగ్ ఉత్తరభారతంలో జాట్ శక్తిని మరింతగా విస్తరిస్తూ డోయాబ్, బల్లబ్ఘర్, ఆగ్రా లను స్వాధీనం చేసుకున్నాడు.[14]
Sikh raids
మార్చుసిక్కులతో తరచూ కలహాలు ఎదురౌతూ ఉండేవి. 1764లో సిక్కులు క్రమంగా బలంపుంజుకున్నారు. వారు సిర్హండ్ నుండి మొఘల్ సైన్యాలను వెళ్ళగొట్టారు. జియాన్ ఖాన్ సిర్హండి నాయకత్వంలో సిక్కులు ఢిల్లి ప్రాంతాలమీద దాడిచేసి దాదాపు ప్రతిసంవత్సరం దోచుకున్నారు. వారు ఢిల్లీని 11 సంవత్సరాలలో మూడు మార్లు (1772,1778, 1783) లూటీ చేసారు. సిక్కులకు రెండవ షా ఆలం వజీర్ల గురించిన సమాచారం అందుతూ ఉండేదని భావించారు. వారు మరికొంత ముందుకు సాగి తూర్పు పంజాబు, రొహిల్లా, మేవార్, జాట్ భూములను కూడా దోచుకున్నారు. రెండవ షా ఆలం పాలనలో సిక్కులు మొఘల్ సామ్రాజ్యంతో యుద్ధం చేయలేదు కాని మరాఠీలు, రాజపుత్రులు, రోహిల్లాలతో పలుమార్లు యుద్ధం చేసారు.
1772లో రెండవ షా ఆలం ఢిల్లీ చేరక ముందు మరాఠీలు ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారు. మిర్జా నజాఫ్ ఖాన్ మొఘల్ ఆర్థికస్థితిని, రాజ్యాంగ నిర్వహణను క్రమపద్ధతికి తీసుకువచ్చాడు. అలాగే సైన్యంలో సంస్కరణలు చేపట్టాడు. 1777 లో మిర్జా ఖాన్ జబితా ఖాన్‌ను ఓడించి సిక్కుల దాడులకు అడ్డుకట్ట వేసాడు.
1778 లో సిక్కులు ఢిల్లో మీద దాడి చేసినప్పుడు రెండవ షా ఆలం వారిని ఓడించడానికి 20,000 సైన్యాలతో ప్రధాన సైనికాధికారి మజద్ - ఉద్ - దౌలాకు ఆదేశం జారీ చేసాడు. ఈ చర్యలో ముజాఫర్ ఘర్ తరువాత ఘనౌర్ వద్ద మొఘల్ సైన్యాలు ఓటమికి గురైయ్యాయి. తరువాత రెండవ షా ఆలం మీర్ నజాఫ్ ఖాన్‌ను నియమించాడు. మిర్జా నజాఫ్ ఖాన్ మరజ్నాం తరువాత మొఘల్ సామ్రాజ్యం బలహీన స్థితికి చేరుకుంది.
1779లో మిర్జా నజాఫ్ ఖాన్ తన సైన్యాలను జాగ్రత్తగా నడిపి జబితా ఖాన్ భూభాగంలో ప్రవేశించి ఒకే యుద్ధంలో 5,000 మంది సిక్కు తిరుగుబాటుదారులను వధించారు. మిర్జా నజాఫ్ ఖాన్ జీవించి ఉన్న కాలంలో సిక్కులు ఢిల్లీలో తిరిగి ప్రవేశించలేదు.
1783 లో బేగం సంరు (ఫర్జా జెబ్ ఉన్ - నిసా డిల్లీని 30,000 మంది సిక్కు తిరుగుబాటు దారుల (బఘేల్ సింగ్, జస్సా సింగ్ రాంగర్హియా, జస్సా సింగ్ అహ్లూవాలియా) దాడి నుండి రక్షించింది.
క్షీణదశ
మార్చుముజాఫర్ఘర్ అపజయం తరువాత ఘనౌర్, మజీద్-ఉద్-దౌలాను ఖైదు చేయమని రెండవ షా ఆలం ఆదేశాలు జారీచేసాడు. తరువాత ఆయన మిర్జా నజాఫ్ ఖాన్‌ను తిరిగి పిలిపించాడు. తరువాత ప్రధాన వజీర్ తప్పుగా అంచనా వేసాడని, చక్రవర్తి శత్రువులకు సహకరించాడని ఖైదుచేయబడ్డాడు. దేశద్రోహిగా గుర్తించి ఖైదుచేసి అతడు అపహరించిన 2 మిలియన్ల దాములను స్వాధీనం చేసుకున్నారు. మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం ఈ విషయంలో పొరపాటున తీర్పు ఇచ్చాడని విశ్వసించినందున తరువాత ఆయన పతనం ఆరంభం అయింది. మిర్జా నజాఫ్ ఖాన్ మొఘల్ సైన్యాలలో బలోపేతంచేసి మొఘల్ సామ్రాజ్యం మరొకసారి పూర్వస్థితికి రావడానికి కృషిచేసాడు. 1779 లో కొత్తగా సంస్కరించబడిన మొఘల్ సామ్రాజ్యసైన్యం జబితా ఖాన్‌ను ఓడించడం ఆయన సిక్కు కూటమిని ఓడించింది. సిక్కు కూటమి వారి నాయకుడిని, 5,000 మంది తిరుగుబాటు దారులను కోల్పోయింది. మిర్జా నజాత్ ఖాన్ జీవించి ఉన్నతవరకు సిక్కు తిరుగుబాటుదారులు ఢిల్లీ మీద దాడి చేయలేదు. దురదృష్టకరంగా రెండవ షా ఆలం తప్పుగా తీర్పు ఇచ్చి సౌనికాధికారిని చంపించడం వెలుగులోకి వచ్చింది. పలు సందర్భాలలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన మరక్షిశిక్షకు గురైన ప్రధాన వజీర్ మేనల్లుడు ప్రధాన వజీరుగా నియమించబడలేదు. బదులుగా చక్రవర్తి విశ్వసించ తగని శక్తి సామర్ధ్యాలు లేని ఇతరవ్యక్తులను వజీరుగా నియమించాడు. వారు తరచుగా వారిలో వారు కలహించుకున్నారు. లచం తీసుకుని రాజ్యాంగ ద్రోహిగా గుర్తించబడిన ప్రధాన వజీరును తిరిగి పదవిలో నియమించాడు. అతడు తరువాత సిక్కులతో చేతులు కలిపి మొఘల్ సైన్యాలను 20,000 నుండి 5,000 వరకు తగ్గించి రెండవ షా ఆలం పతనానికి కారణం అయ్యాడు.[15]
The respect toward the house of Timur is so strong that even though the whole subcontinent has been withdrawn from its authority, that no ordinary prince ever intends to take the title of sovereign...and Shah Alam II is still seated on the Mughal throne, and everything is still done in his name.
Benoît de Boigne, (1790).
నవాబు మజీద్- ఉద్- దౌలా మొఘల్ సామ్రాజ్యానికి శత్రువుగా మారాడు. నజీబ్ ఖాన్ మనుమడు గులాం ఖాదిర్ సిక్కుల కూటమితో కలిసి మజీద్- ఉద్- దౌలాను మొఘల్ సామ్రాజ్యానికి ప్రధాన వజీరుగా నియమించమని రెండవ షా ఆలం మీద వత్తిడి చేసాడు. గులాం ఖాదిర్ మొఘల్ రాజభవలాలో సంపదదోచుకోవడానికి ప్రయత్నించాడు. రాజ్భవనాలలో దాచబడిన సంపద 250 మిలియన్లు ఉండవచ్చని భావిస్తున్నారు. గులాం ఖాదిర్ చర్యలకు ఆగ్రహించిన రెండవ షా ఆలం 1978 ఆగస్టు 10న అతడి కళ్ళు పొడిపించి అంధుడిని చేసాడు. .[15] గులాం ఖాదిర్ ప్రతీకారం తీర్చుకోవడానికి మొఘల్ రాజకుటుంబం మీద దాడి చేసాడు. మహదాజీ సిండే కలగజేసుకుని గులాం ఖాదిర్‌ను చంపి చక్రవర్తిని రక్షించాడు.[16] మొఘల్ చక్రవర్తి మహాద్జీ సింధియాను ఒకిల్- ఉల్- ముత్లాగ్ (రాజప్రతినిధి), అమీర్- ఉల్- అమరాగా గౌరవించాడు. చివరికి చక్రవర్తి రెండవ షా ఆలం మహాద్జీ సింధియా ముందు నామమాత్ర చక్రవర్తిగా మిగిలాడు.
Arrival of British troops
మార్చుఐరోపాలో ఫ్రెంచి ఆధిక్యత భారతదేశంలో కూడా కొనసాగగలదని బ్రిటిష్ భావించింది. వారు రెండవ షా ఆలాన్ని తమ స్వాధీనంలో తీసుకురావడానికి నిర్ణయించారు. లేకుంటే ఫ్రెంఛి సైనికదళం మరాఠీలను పడగొట్టి వారి ఆధీనంలో ఉన్న మొఘల్ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటారని భావించారు.
రెండవ షా ఆలం హైదర్ ఆలీతో సత్సబంధాలు పెట్టుకున్నాడు. తరువాత ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ తో కూడా సత్సంబంధం కొనసాగింది. టిప్పు సుల్తాన్ మీద ఆగ్లేయులు సాగించిన " ఆంగ్లో మైసూర్ యుద్ధాలు " ఆంగ్లేయుల సామ్రాజ్యవాదాన్ని ౠజువుగా నిలిచాయి.
1803లో ఢిల్లీ యుద్ధం తరువాత సెప్టెంబరు 14న బ్రిటిష్ సైన్యాలు ఢిల్లీలో ప్రవేశించాయి. తరువాత రెండవ షా ఆలం ఆగ్లేయుల స్వాధీనం అయ్యాడు. తరువాత మొఘల్ చక్రవర్తి సైన్యం మీద ఆధిక్యత కోల్పోయాడు. మొఘల్ చక్రవర్తి కేవలం అలంకార ప్రాయుడుగా మాత్రమే మిగిలాడు. సుబేదార్లు, నవాబులు ఇంకా మొఘల్ ప్రభుత్వాన్ని గౌరవిస్తూనే ఉన్నారు. వారు చక్రవర్తి పేరుతో నాణ్యాలను ముద్రిస్తూ చక్రవర్తి పేరుతో కుత్బా (శుక్రవార ఉత్సవం) నిర్వహించారు. 1804లో యశ్వంతరావు హోల్కర్ నాయకత్వంలో మరాఠీలు ఢిల్లీని స్వాధీనం చేసుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం మీద సాగించిన దాడి అపజయం పాలైంది.
మరణం
మార్చురెండవ షా ఆలం సహజ మరణం పొందాడు. 13వ శతాబ్ధానికి చెందిన సూఫీ సన్యాసి " కుతుబుద్దీన్ భక్తియార్ కాకి " సమాధి సమీపంలో రెండవ షా ఆలం చక్రవర్తి భౌతిక కాయం సమాధి చేయబడింది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Delhi, Past and Present, p. 4, గూగుల్ బుక్స్ వద్ద
- ↑ History of Islam, p. 512, గూగుల్ బుక్స్ వద్ద
- ↑ Advanced Study in the History of Modern India 1707–1813, p. 140, గూగుల్ బుక్స్ వద్ద
- ↑ S. M. Ikram (1964). "XIX. A Century of Political Decline: 1707–1803". In Ainslie T. Embree (ed.). Muslim Civilization in India. New York: Columbia University Press. Retrieved 5 నవంబరు 2011.
- ↑ Dictionary of Indo-Persian Literature, p. 40, గూగుల్ బుక్స్ వద్ద
- ↑ Mughal Empire in India: A Systematic Study Including Source Material, Volume 3, p. 767, గూగుల్ బుక్స్ వద్ద
- ↑ S.R. Sharma (1 జనవరి 1999). Mughal empire in India: a systematic study including source material. Atlantic Publishers & Dist. pp. 769–. ISBN 978-81-7156-819-2. Retrieved 30 మార్చి 2012.
- ↑ L.S.S. O`malley. Bihar and Orissa District Gazetteers Patna. Concept Publishing Company. pp. 32–. ISBN 978-81-7268-121-0. Retrieved 30 మార్చి 2012.
- ↑ A Dictionary of Modern Indian History (1707–1947), Parshotam Mehra, ISBN 0-19-561552-2, 1985 ed., Oxford University Press
- ↑ The Fall of the Moghul Empire of Hindustan, p. 6, గూగుల్ బుక్స్ వద్ద
- ↑ 11.0 11.1 Kaushik Roy. War, Culture, Society in Early Modern South Asia, 1740–1849. Taylor & Francis. pp. 29–. ISBN 978-1-136-79087-4. Retrieved 30 మార్చి 2012. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "Roy" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ The Gazetteer of India: History and culture. Publications Division, Ministry of Information and Broadcasting, India. 1973. p. 348. OCLC 186583361.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 13 మే 2015. Retrieved 10 ఏప్రిల్ 2015.
- ↑ The Province of Agra: Its History and Administration, p. 9, గూగుల్ బుక్స్ వద్ద
- ↑ 15.0 15.1 Misbah Islam (30 జూన్ 2008). Decline of Muslim States and Societies. Xlibris Corporation. pp. 392–. ISBN 978-1-4363-1012-3. Retrieved 30 మార్చి 2012.
- ↑ Marathas and the Marathas Country: The Marathas, p. 159, గూగుల్ బుక్స్ వద్ద
అదనపు సమాచారం
మార్చు- Shah Alam Namah: text vol.41 (Persian). Digital Library of India. Archived from the original on 8 ఏప్రిల్ 2015. Retrieved 14 జనవరి 2020.
రెండవ షా ఆలం Born: 1728 Died: 1806
| ||
Regnal titles | ||
---|---|---|
అంతకు ముందువారు Alamgir II |
Mughal Emperor 1759–1806 |
తరువాత వారు Akbar Shah II |