నిజాం పాలనలో భూమి పన్ను విధానాలు
నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలపై అనేక దారుణాలు ఉండేవి. అందులో భూమి పన్ను విధానం ఒకటి. ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని రాబట్టుకోవడంకోసం భూమి పన్నును నిర్ణయిస్తారు. ఈ పన్నులకు సంబంధించి అనేక సమస్యలు ఉండడంవల్ల పటేల్, పట్వారీ, అధికారుల దయాదాక్షిణ్యాలతో రైతులు ఈ పన్నులు చెల్లించేవారు.[1]
ఈ పన్నుల వసూలు బాధ్యతను పెత్తందార్లు, భూస్వాములకు అప్పగించబడింది. వీళ్ళు తమ కింది రైతుల నుంచి నిర్దాక్షిణ్యంగా పెద్ద మొత్తాల్లో పన్నులు వసూలు చేసేవారు. తమకు ఏటా రావాల్సిన కప్పం వస్తే చాలనుకున్న నిజాం నవాబులు ఈ వసూళ్లను ఏమాత్రం పట్టించుకుకోలేదు.[2] జాగీరుదార్లు బొంబాయిలో ఉంటూ విలాస జీవితం గడిపేవారు. తమ విలాసాల కోసం రైతులను దోపిడీ చేస్తూ, అధిక పన్నులు వసూలు చేసేవారు.[3]
మెట్టభూమి
మార్చుఈ మెట్టభూమికి పన్ను దాదాపు ఒకే విధంగా ఉంటుంది. సారవంతమైన నేలకు ఎక్కువగా, సారహీనమైన నేలకు తక్కువగా పన్నులు నిర్ణయిస్తారు. నల్లరేగడి భూములకు ఎక్కువ పన్ను వసూలుచేయడమే కాకుండా కొన్నిసార్లు సారహీనమైన నేలను సారవంతమైన నేలగా లెక్కగట్టి కూడా ఎక్కువ పన్నులను వసూలు చేస్తారు.
మాగాణి భూమి
మార్చు- చెరువులకింది మాగాణి భూమి: ఈ చెరువుల కింద ఉండే మాగాణిపై వచ్చే రెండు పంటలకు రెండు రకాల పన్నులు నిర్ణయించారు.
- బావుల కింది మాగాణి భూమి:
- సాగు చేయకున్నా పన్నుల వసూలు:
- చెరువునీరు అందకున్నా పన్నుల వసూలు:
- పర్రె కాలువలు, యాతాలు:
- భూస్వాములు- పన్నుల భారం:
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర (1946-51), మొదటి భాగము, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ప్రొలిటేరియన్ లైన్ ప్రచురణలు, హైదరాబాద్, ప్రథమ ముద్రణ, జూలై 1988, పుట.20
- ↑ నమస్తే తెలంగాణ, నిపుణ విద్యా వార్తలు (9 January 2019). "నిజాం రాజ్యం భూ యాజమాన్యం". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
- ↑ ఈనాడు, ప్రతిభ. "తెలంగాణలో భూసంబంధాలు". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.