పెత్తందార్లు 1970 లో వచ్చిన విప్లవాత్మక చిత్రం, దీనిని జ్యోతి సినీ సిండికేట్ పతాకంపై యు. విశ్వేశ్వర రావు నిర్మించాడు.[1] సిఎస్ రావు దర్శకత్వం వహించాడు.[2] ఈ చిత్రంలో కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. ఎన్.టి.రామారావు, సావిత్రి, శోభన్ బాబు, విజయ నిర్మల ముఖ్య పాత్రధారులు[3][4][5]

పెత్తందార్లు
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.ఎస్.రావు
తారాగణం నందమూరి తారక రామారావు,
సావిత్రి
శోభనబాబు
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ జగపతి స్టాఫ్ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

ఈ చిత్రం పెత్తనాలపాలెం అనే గ్రామంలో ప్రారంభమవుతుంది. అక్కడ దాని ప్రెసిడెంటు జగన్నాధం (నాగభూషణం) నియంతలా ప్రవర్తిస్తాడు. సర్పంచ్ బుచ్చయ్య (ముక్కమల), ముంసబు అచ్చయ్య (రావు గోపాలరావు), లక్ష్మీపతి (అల్లు రామలింగయ్య) పంచాయితీ గుమాస్తా గోవిందయ్య (ధూళిపాళ) లతో కలిసి గ్రామంలో దురాగతాలు చేస్తూంటాడు. భూషయ్య, (చిత్తూరు వి. నాగయ్య) గ్రామంలో మంచి మర్యాదస్తుడు, దయగల వ్యక్తి. తన మొదటి భార్య మరణించిన తరువాత, జగనాధం సోదరి రంగనాయకమ్మ (హేమలత) ను పెళ్ళి చేసుకుంటాడు. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దవాడు సూర్యం (ప్రభాకర రెడ్డి) పెడదార్లు పట్టాడు. ఇతడు మొదటి భార్య కుమారుడు. చిన్నవాడు చంద్రం (ఎన్.టి.రామారావు), భూషయ్య చేస్తున్న క్రూరమైన పనుల నుండి గ్రామాన్ని రక్షించడానికి ప్రయత్నించే మంచి భావజాలం ఉన్న వ్యక్తి. సూర్యం జగనాధం కుమార్తె లక్ష్మి (సావిత్రి) ని పెళ్ళి చేసుకుంటాడు. వారికి రాజా అనే కుమారుడు ఉన్నాడు. అక్షరాభ్యాసం రోజున, చంద్రం భూషయ్య చేత అక్షరాలు దిద్దించినపుడు రెండు కుటుంబాల మధ్య గొడవ తలెత్తుతుంది. కోపంతో, చంద్రం‌ను చంపడానికి జగనాధం తన అనుచరుడు కోటయ్య (సత్యనారాయణ) ను పంపుతాడు. కొత్తగా వచ్చిన గ్రామ వైద్యురాలు రోహిణి (విజయ నిర్మల) అతన్ని రక్షిస్తుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు.

అడుక్కునేటపుడు నీతులు నేర్పే బిచ్చగాడు (రేలంగి) గ్రామంలో కనిపిస్తాడు. భూషయ్య మరదలు జానకమ్మకు శారద (సాధన రాణి) అనే కుమార్తె ఉంది. జగన్నాథం శారదతో తన వివాహ ప్రతిపాదనను పంపుతాడు, దీన్ని జానకమ్మ నిరాకరించి వేరే సంబంధం కుదుర్చుకుంటుంది. కానీ జగన్నాధం దాన్ని పాడుచేస్తాడు. ఆ కోపంలో భూషయ్య అతని ముఖం మీద ఉమ్మి వేస్తాడు. ఇప్పుడు జగన్నాధం భూషయ్యపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. కాబట్టి, ఆస్తిలో తన వాటా కోసం అడగమని సూర్యాన్ని రెచ్చగొడతాడు. సూర్యం కోర్టులో కేసు దాఖలు చేస్తాడు. ఇది భూషయ్య మరణానికి దారి తీస్తుంది. ఆ తరువాత, చంద్రం మొత్తం ఆస్తిని తన సోదరుడికి ఇచ్చి, తన తల్లితో కలిసి ఇంటి నుండి బయలుదేరతాడు. చంద్రం గ్రామస్తులందరినీ ఏకం చేసి, జగన్నాథం, అతని ముఠాను వ్యతిరేకించేలా చేస్తాడు. అదే సమయంలో, రోహిణి సోదరుడు మోహన్ (శోభన్ బాబు) శారదను ప్రేమించి పెళ్ళి చేసుకుని గ్రామానికి విజిలెన్స్ ఆఫీసర్‌గా వస్తాడు. చంద్రం సహాయంతో, అతను జగన్నాథానికి వ్యతిరేకంగా అన్ని రుజువులను సేకరించి వారి చట్టవిరుద్ధ కార్యకలాపాలన్నింటినీ మూసివేస్తాడు. నిస్పృహతో జగన్నాథం మోహన్, రోహిణిలను కిడ్నాప్ చేయాలని, గ్రామస్తుల మొత్తం పంటను కూడా తగలబెట్టాలని కోటయ్యను ఆదేశిస్తాడు. అది తెలుసుకున్న సూర్యం కూడా జగన్నాథానికి వ్యతిరేకంగా తిరుగుతూ వారి క్రూరమైన చర్యను ఆపడానికి కదులుతాడు. చంద్రం మోహన్, రోహిణి లను రక్షిస్తాడు. గ్రామం మొత్తం మంటలు కమ్మేసినపుడు బిచ్చగాడు, గ్రామంలోని నేర కార్యకలాపాలను తెలుసుకోవడానికి ప్రభుత్వం నియమించిన పోలీసు అధికారిగా మారతాడు. దుష్టులందరినీ అరెస్టు చేస్తాడు. చంద్రం రోహిణిల పెళ్ళితో సినిమా ముగుస్తుంది.

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • కళ: ఎస్.కృష్ణారావు
  • నృత్యాలు: తంగప్ప
  • స్టిల్స్: డి. రాధాకృష్ణ మూర్తి
  • పోరాటాలు: సంబశివరావు
  • కథ - సంభాషణలు: త్రిపురనేని మహారాధి
  • సాహిత్యం: శ్రీ శ్రీ, దాశరథి కృష్ణమాచార్య ,ఆరుద్ర, కొసరాజు రాఘవయ్య చౌదరి, వీటూరీ వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి, కె అప్పారావు.
  • నేపథ్య గానం: ఘంటసాలా, పి. సుశీల, ఎస్పీ బాలు, ఎల్ఆర్ ఈశ్వరి
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • కూర్పు: ఆర్.హనుమంత రావు
  • ఛాయాగ్రహణం: జికె రాము
  • నిర్మాత: యు.విశ్వేశ్వరరావు
  • చిత్రానువాదం - దర్శకుడు: సి.ఎస్.రావు
  • బ్యానర్: జ్యోతి సినీ సిండికేట్
  • విడుదల తేదీ: 1970 ఏప్రిల్ 30

పాటలు

మార్చు
ఎస్. పాట పేరు సాహిత్యం గాయకులు పొడవు
1 "ఏకాంత సేవకు" వీటూరి ఎల్.ఆర్ ఈశ్వరి 3:57
2 "నా దేశం కోసం" కోసరాజు ఘంటసాల 5:15
3 "మైమారపో తొలివలపో" ఆరుద్ర పి. సుశీల 3:30
4 "మా పాడిపంటలు" కె. అప్పారావు పి. సుశీల, రఘురామ్ 4:05
5 "మానవుడా ఓ మానవుడా" శ్రీ శ్రీ ఘంటసాల 4:26
6 "దగ్గరగా ఇంకా దగ్గరగా" దాశరథి ఎస్పీ బాలు, పి.సుశీల 3:24
7 "రామకృష్ణులు కన్న దేశం" కోసరాజు ఘంటసాల 4:30
  • మైమరపో తొలివలపో ఇది మమతల మగతను కలగలుపో - పి.సుశీల.
  • వ్యర్థమౌ నీటికి ఆనకట్టలు (పద్యం) ఘంటసాల, రచన: కొసరాజు.
  • త్యాగజీవి సహనశీలి , రచన: శ్రీరంగం శ్రీనివాసరావు, గానం. రఘురాం
  • ఉప్పు కప్పురంబు,(పద్యం), రచన: వేమన, గానం.రేలంగి
  • కనకపు సింహాసనమున,(పద్యం), రచన: వేమన, గానం. రేలంగి వెంకట్రామయ్య
  • రాతికంటే హెచ్చువరమీను దైవము ,(పద్యం), రచన: వేమన, గానం.రేలంగి.

మూలాలు

మార్చు
  1. "Pettandarulu (Banner)". Chitr.com.[permanent dead link]
  2. "Pettandarulu (Direction)". Fimiclub. Archived from the original on 2020-09-24. Retrieved 2020-08-25.
  3. "Pettandarulu (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-13. Retrieved 2020-08-25.
  4. "Pettandarulu (Preview)". Know Your Films.
  5. "Pettandarulu (Review)". Spicy Onion. Archived from the original on 2021-10-19. Retrieved 2020-08-25.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతమ్ , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండిపాటలు, పద్యాలు.