నిజాం రాష్ట్ర రైల్వే - రోడ్డు రవాణా శాఖ

హైదరాబాదు రాష్ట్రంలోని నిజాం గ్యారంటీడ్ రాష్ట్ర రైల్వే కు చెందిన ఒక విభాగం

నిజాం రాష్ట్ర రైల్వే - రోడ్డు రవాణా శాఖ అనేది హైదరాబాదు రాష్ట్రంలోని నిజాం గ్యారంటీడ్ రాష్ట్ర రైల్వే కు చెందిన ఒక విభాగం. ఇది 1932వ సంవత్సరంలో రోడ్డు రవాణా శాఖకు సంబంధించి ప్రయాణీకుల రోడ్డు రవాణా సేవలను జాతీయం చేసిన మొదటి రవాణా శాఖ.

నిజాం రాష్ట్ర రైల్వే - రోడ్డు రవాణా శాఖ
పరిశ్రమబస్సు
స్థాపన1932; 92 సంవత్సరాల క్రితం (1932)
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
Areas served
హైదరాబాదు రాష్ట్రం
Key people
నిజాం
Servicesప్రజా రోడ్డు రావాణా సేవ
Number of employees
166 (1932)
Parentనిజాం గ్యారంటీడ్ రాష్ట్ర రైల్వే

చరిత్ర మార్చు

 
1932లో నిజాం సర్కారు ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆర్టీసి బస్సు

ప్రజా రవాణా కోసం నిజాం రాజు 1932 జూన్‍లో మూడులక్షల తొంబైమూడువేల రూపాయల పెట్టుబడితో, మూడు డిపోలు, 27 బస్సులు, 166 మంది కార్మికులతో ఈ రవాణా శాఖను ప్రారంభించాడు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి రోడ్డు రవాణా సంస్థ. రైల్వే పరిపాలన ఆధ్వర్యంలో షెడ్యూల్ చేసిన బస్సు సర్వీసులు 450 కిలోమీటర్ల పరిధిలో నడిచాయి. 1936 నాటికే హైదరాబాదు నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాలకు బస్సులు నడపటం ప్రారంభమైంది.[1] ఒక దశాబ్దకాలంలో మొత్తం 7½ మిలియన్ హెచ్‌ఆర్‌ల ఖర్చుతో దాదాపు 500 వాహనాలు, 7200 కి.మీ. పరిధికి విస్తరించింది.[2]

ఏ.పి.యస్.ఆర్.టి.సి. గా మార్పు మార్చు

నిజాం చివరి రాజైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ సంస్థను భారత ప్రభుత్వంకు అప్పగించాడు. నంబర్ ప్లేట్‌లోని జెడ్ అక్షరం తన తల్లి జహ్రా బేగంను సూచిస్తున్నందున, ప్రతి బస్సు నంబర్‌లో జెడ్ అక్షరాన్ని చేర్చాలని ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు.[3] 1951, నవంబరు 1వ తేదీన ఈ సంస్థ హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వ శాఖగా మార్చబడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1958లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది.[4] తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దీనినుండి 2015లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వేరుపడింది.[5]

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. సాక్షి, విద్య (28 November 2015). "రవాణా సౌకర్యాలు". www.sakshieducation.com. Archived from the original on 7 December 2019. Retrieved 7 December 2019.
  2. Nayeem, M. A.; The Splendour of Hyderabad; Hyderabad ²2002 [Orig.: Bombay ¹1987]; ISBN 81-85492-20-4; S. 221
  3. "Nizam's wife gifted first bus service to Secunderabad". The Hans India.
  4. "APSRTC - Profile". apsrtc.gov.in. Archived from the original on 2018-09-30. Retrieved 2019-12-07.
  5. Krishnamoorthy, Suresh (16 May 2014). "It will be TGSRTC from June 2". The Hindu. Hyderabad. Retrieved 7 December 2019.