నిజామాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ
నిజామాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (నుడా) తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాదు పట్టణ అభివృద్ధి ప్రణాళిక సంస్థ. వారసత్వ నిర్మాణాలు, పట్టణం, దాని పరిధి ప్రాంతంలో నిర్ధిష్టమైన అభివృద్ధికి ఈ సంస్థ మార్గనిర్దేశం చేస్తుంది.
నిజామాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (నుడా) | |
---|---|
సంస్థ వివరాలు | |
స్థాపన | జూలై 10, 2017 |
Preceding agency | నిజామాబాదు నగరపాలక సంస్థ |
అధికార పరిధి | తెలంగాణ ప్రభుత్వం |
ప్రధానకార్యాలయం | నిజామాబాదు 18°40′19″N 78°05′38″E / 18.672°N 78.094°E |
సంబంధిత మంత్రులు | కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, (ముఖ్యమంత్రి) కల్వకుంట్ల తారక రామారావు, (పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి) |
కార్యనిర్వాహకులు | ప్రభాకర్ రెడ్డి[1], చైర్మన్ |
చరిత్ర
మార్చు2017, జూలై 10న తెలంగాణ ప్రభుత్వంచే నిజామాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ ఏర్పాటుచేయబడింది. దీని ప్రధాన కార్యాలయం నిజామాబాదు పట్టణంలో ఉంది.[2]
విధులు - బాధ్యతలు
మార్చురాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లోని మౌలిక సదుపాయాల ప్రణాళికను, అభివృద్ధిని వివరించడానికి ఆయా అభివృద్ధి పనులకోసం పట్టణ అభివృద్ధి సంస్థలకు అధికారాలు ఇవ్వబడ్డాయి.
అధికార పరిధి
మార్చు169.37 చదరపు కిలోమీటర్ల (65.39 చదరపు మైళ్ళు)[3][4] పరిధిలోని నిజామాబాదు ఉత్తర, దక్షిణ, గ్రామీణ మండలాల్లో విస్తరించి ఉన్న 6,33,933[5][6] నివాసితుల కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికను ఈ సంస్థ నిర్వహిస్తుంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు 61 గ్రామాలను కలిపి ఈ సంస్థను ఏర్పాటుచేశారు.[7][8]
చైర్మన్
మార్చు2018, సెప్టెంబరు 15న నిజామాబాద్ పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాడు.[9]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ ఆంధ్రభూమి, తెలంగాణ (8 November 2019). "భావి అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్లు". www.andhrabhoomi.net. Archived from the original on 8 November 2019. Retrieved 17 January 2020.
- ↑ Telangana Today, Telangana (24 October 2017). "GO released to set up Nizamabad Urban Development Authority". Archived from the original on 26 November 2018. Retrieved 15 January 2020.
- ↑ Deccan Chronicle, Telangana (24 January 2018). "Merger of 13 Nizamabad villages on the cards". Narender Pulloor. Archived from the original on 26 November 2018. Retrieved 15 జనవరి 2020.
- ↑ Telangana Today, Telangana (30 September 2018). "Nizamabad (Urban) Assembly constituency profile". Archived from the original on 24 March 2019. Retrieved 15 January 2020.
- ↑ Telangana Today, Telangana (30 September 2018). "Nizamabad Rural Assembly constituency profile". Archived from the original on 24 March 2019. Retrieved 15 January 2020.
- ↑ నమస్తే తెలంగాణ, వార్తలు (25 October 2017). "పట్టణ శివార్ల కు పండుగ". www.ntnews.com. Archived from the original on 17 January 2020. Retrieved 17 January 2020.
- ↑ Sakshi (27 February 2022). "73 గ్రామాలు.. 568 కిలో మీటర్లతో 'నుడా' మాస్టర్ ప్లాన్." Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.
- ↑ నమస్తే తెలంగాణ, వార్తలు (15 September 2018). "నూడా చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరణ". Archived from the original on 13 ఏప్రిల్ 2019. Retrieved 15 January 2020.