నిజామాబాదు (పట్టణ) శాసనసభ నియోజకవర్గం
నిజామాబాదు జిల్లా లోని 5 శాసనసభ నియోజకవర్గాలలో నిజామాబాదు (పట్టణ) శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1] నివాసితుల కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికను ఈ సంస్థ నిర్వహిస్తుంది.
నిజామాబాదు (పట్టణ) | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశము | భారత దేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు |
నియోజకవర్గాల పునర్వ్యవస్య్జీకరణలో భాగంగా ఈ నియోజకవర్గం పేరు మారింది. ఇదివరకు నిజామాబాదు శాసనసభ నియోజకవర్గంగా ఉన్న పేరు, పునర్విభజనలో దీనిని రెండుగా విభజించడంతో నిజామాబాదు (పట్టణ), నిజామాబాదు (గ్రామీణ) నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. నిజామాబాదు నగరపాలక సంస్థ పరిధిలోని 50 వార్డులు పట్టణ నియోజకవర్గం పరిధిలో ఉండగా, గ్రామీణ ప్రాంతాలను, ఇదివరకు ఉన్న డిచ్‌పల్లి శాసనసభ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలను కలిపి నిజామాబాదు (గ్రామీణ) నియోజకవర్గాన్ని ఏర్పర్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ 2009, 2010లలో వరుసగా రెండుసార్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చేతిలో పరాజయం పొందినాడు. 1952 నుండి ఇప్పటివరకు జరిగిన 14 ఎన్నికలలో (ఉప ఎన్నికతో కలిపి) కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, తెదేపా 3 సార్లు, భారతీయ జనతా పార్టీ 2 సార్లు విజయాలు సాధించగా 5 సార్లు ఇండిపెండెంట్లు గెలుపొందినారు.
ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు సవరించు
- నిజామాబాదు నగర పాలక సంస్థలోని 50 డివిజన్లు ఈ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. పునర్విభజనకు ముందు నిజామాబాదు మండలంలోని 22 గ్రామాలు కూడా ఈ నియోజకవర్గంలో ఉండేవి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా మండలంలోని గ్రామీణ ప్రాంతాలు ఈ నియోజకవర్గం నుండి విడదీయడంతో ప్రస్తుతం కేవలం పట్టణ ప్రాంతమే ఇందులో భాగంగా ఉంది.
నియోజకవర్గ భౌగోళిక స్వరూపము సవరించు
నిజామాబాదు జిల్లా మధ్యన నిజామాబాదు (పట్టణ_ నియోజకవర్గం ఉంది. ఇది జిల్లాలోని 5 నియోజకవర్గాలతో సరిహద్దులను కలిగి ఉంది. తూర్పున నిజామాబాదు (గ్రామీణ) నియోజకవర్గం ఉండగా, దక్షిణమున ఎల్లారెడ్డి నియోజకవర్గం, పడమరన బాన్సువాడ నియోజకవర్గం, వాయువ్యాన బోధన్ నియోజకవర్గం, ఈశాన్యాన ఆర్మూర్ నియోజకవర్గం సరిహద్దులుగా ఉన్నాయి. ఈ శాసనసభ నియోజకవర్గం నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
ఎన్నికైన శాసనసభ్యులు సవరించు
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 1952 మహమ్మద్ దవార్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ బి.ఆర్.జి.రెడ్డి సోషలిస్టు పార్టీ 1957 మహమ్మద్ దవార్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ కె.ఏ.రెడ్డి ఇండిపెండెంట్ 1962 హరినారాయణ ఇండిపెండెంట్ డి.హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ 1967 కె.వి.గంగాధర్ ఇండిపెండెంట్ ఎం.డబ్ల్యూ.బేగ్ కాంగ్రెస్ పార్టీ 1972 వి.చక్రధర్ రావు ఇండిపెండెంట్ పి.గంగాధర్ కాంగ్రెస్ పార్టీ 1978 ఎ.కిషన్ దాస్ ఇండిపెండెంట్ గంగారెడ్డి జనతాపార్టీ 1983 డి.సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ 1985 డి.సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ తహర్బిన్ అందన్ కాంగ్రెస్ పార్టీ 1989 ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ డి.సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ 1994 సతీష్ పవార్ తెలుగుదేశం పార్టీ ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ 1999 ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ యెండెల లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ 2004 ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సతీష్ పవార్ తెలుగుదేశం పార్టీ 2009 యెండెల లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ 2010 (ఉప ఎన్నిక) యెండెల లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ 2014 బిగాల గణేష్ గుప్తా తెలంగాణ రాష్ట్ర సమితి మీర్ మజాజ్ అలీ షేక్ ఏ.ఐ.ఎం.ఐ.ఎం 2018 బిగాల గణేష్ గుప్తా తెలంగాణ రాష్ట్ర సమితి
నియోజకవర్గ చరిత్ర సవరించు
1952లో నిజామాబాదు పేరుతో ఈ నియోజకవర్గం ఏర్పడినది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో గ్రామీణ ప్రాంతాలు విడదీని దానిని ప్రత్యేకంగా నిజామాబాదు (గ్రామీణ) నియోజకవర్గంగా ఏర్పాటుచేయడంతో 2009 ఎన్నికల నుంచి ఇది నిజామాబాదు (పట్టణ) నియోజకవర్గంగా పిలువబడుచున్నది. 1952 నుంచి ఒక ఉప ఎన్నికతో సహా మొత్తం 14 సార్లు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. తొలి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, ఆ తరువాత వరుసగా 5 సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయాలు నమోదుచేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం అనంతరం ఆ పార్టీకి చెందిన డి.సత్యనారాయణ వరుసగా 2 సార్లు ఇక్కడి నుంచి గెలుపొందినాడు. మూడున్నర దశాబ్దాల అనంతరం 1989లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపొందినాడు. 1994లో మళ్ళీ తెదేపా విజయం సాధించగా, 1999, 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.శ్రీనివాస్ విజయం సాధించాడు. 2009, 2010లలో డి.శ్రీనివాస్ పిసిసి అధ్యక్ష హోదాలో పోటీచేసినప్పటికీ పరాజయం పొందినాడు.
1983 ఎన్నికలు సవరించు
1983 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి.సత్యనారాయణ సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ పై సుమారు 13వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. సత్యానారాయణకు 32653 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ 19708 ఓట్లు పొందినాడు.
1985 ఎన్నికలు సవరించు
1985 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సిటింగ్ శాసన సభ్యులు డి.సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాహెర్ బిన్ అందన్‌పై 9321 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. సత్యనారాయణకు 42082 ఓట్లు రాగా, అందన్‌కు 32761 ఓట్లు లభించాయి.
- 1985 ఎన్నికల గణాంకాలు
- మొత్తం పోలైన ఓట్లు: 79,346.
- చెల్లిన ఓట్లు: 78, 021.
- పోటీచేసిన అభ్యర్థులు: 4.
- పోలింగ్ కేంద్రంల సంఖ్య: 148.
- మెజారిటీ: 9,321 (పోలైన ఓట్లలో 11.95% ).
1989 ఎన్నికలు సవరించు
1989, నవంబరు 22న జరిగిన ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 6 గురు అభ్యర్థులు పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ధర్మపురు శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి.సత్యనారాయణపై 14009 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. శ్రీనివాస్‌కు 45558 ఓట్లు రాగా, సత్యనారాయణకు 31549 ఓట్లు లభించాయి. బిఎస్పీ అభ్యర్థితో సహా మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు ముగ్గురు డిపాజిట్లు కోల్పోయారు.
- 1989 ఎన్నికల గణాంకాలు
- మొత్తం ఓటర్ల సంఖ్య: 160531.
- పోలైన ఓట్ల సంఖ్య: 99970.
- పోటీచేసిన అభ్యర్థుల సంఖ: 6.
- పోలింగ్ కేంద్రంల సంఖ్య: 183.
1994 ఎన్నికలు సవరించు
1994లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సతీష్ పవార్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిటింగ్ శాసన సభ్యులు అయిన ధర్మపురి శ్రీనివాస్‌పై 17416 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. సతోష్ పవార్ 53639 ఓట్లు సాధించగా, శ్రీనివాస్‌కు 36223 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికలలో మొత్తం 13 అభ్యర్థులు పోటీచేయగా 11 అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.
- 1994 ఎన్నికల గణాంకాలు
- మొత్తం ఓటర్ల సంఖ్య: 134859.
- పోలైన ఓట్లు: 99704.
- చెల్లిన ఓట్ల సంఖ్య: 97787.
- పోటీచేసిన అభ్యర్థుల సంఖ్య: 13.
2004 ఎన్నికలు సవరించు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్జర్మపురి శ్రీనివాస్ సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సతీష్ పవార్ పై సుమారు 18వేల మెజారిటీతో గెలుపొందినాడు. శ్రీనివాస్‌కు 69వేలకుపైగా ఓట్లు రాగా, పవార్ 40వేలకుపైగా ఓట్లు పొందినాడు.
2009 ఎన్నికలు సవరించు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున వై.లక్ష్మీసత్యనారాయణ పోటీ చేయగా, [2] కాంగ్రెస్ పార్టీ తరఫున పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పోటీచేశాడు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెండల లక్ష్మీ సత్యనారాయణ డి.శ్రీనివాస్‌పై 11వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఈ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఏ.ఎస్.పోశెట్టి, ప్రజారాజ్యం పార్టీ టికెట్టుపై రహీంసైఫీ పోటీచేశారు. యెండల లక్ష్మీనారాయణ 40475 ఓట్లు సాధించగా, ధర్మపురి శ్రీనివాస్ 29460 ఓట్లు పొందినాడు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి రహీంసైఫ్ 15887 ఓట్లతో మూడవ స్థానం పొందగా, తెరాస అభ్యర్థి ఏ.ఎస్.పోశెట్టి 5902 ఓట్లతో నాలుగవ స్థానంలో నిలిచాడు. లోక్‌సత్తా అభ్యర్థి డి.శేఖర్ 1003 ఓట్లు పొందినాడు.
- 2009 ఎన్నికల గణాంకాలు
- మొత్తం ఓటర్ల సంఖ్య: 2,28,865 [3]
- పోలైన ఓట్లు: 1,95,160
- మెజారిటీ: 11,015.
2010 ఉప ఎన్నికలు సవరించు
2009లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ తెలంగాణ వాదానికి మద్దతుగా రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల తరఫున మళ్ళీ పాత అభ్యర్థిలే పోటీపడ్డారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లక్ష్మీనారాయణ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పిసిసి అధ్యక్షుడు అయిన డి.శ్రీనివాస్‌పై వరుసగా రెండవ సారి విజయం సాధించాడు. ఈ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, తెలంగాణ కార్యాచరణ సంఘము, తెలంగాణ న్యాయవాదులు తదితర ప్రత్యేక తెలంగాణ అనుకూలవాదులు భారతీయ జనతా పార్టీకు మద్దతు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లక్ష్మీనారాయణ 64వేలకు పైగా ఓట్లు సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి డిశ్రీనివాస్ 52వేలకుపైగా ఓట్లు పొందినాడు. తెదేపా అభ్యర్థి అరికెల నర్సారెడ్డి కేవలం 1793 ఓట్లు మాత్రమే పొంది డిపాజిట్టు కోల్పోయాడు.[4] లక్ష్మీనారాయణకు ఈ ఉప ఎన్నికలలో పోస్టల్ ఓట్లతో కలిపి 11981 ఓట్ల మెజారిటీ లభించింది[5]
- 2010 ఉప ఎన్నికల గణాంకాలు
- మొత్తం ఓట్లు:
- పోలైన ఓట్లు: 120636.
- పోటీ చేసిన అభ్యర్థులు: 12.
నియోజకవర్గ ప్రముఖులు సవరించు
- ధర్మపురి శ్రీనివాస్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన ధర్మపురి శ్రీనివాస్ తొలిసారిగా 1989లో ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. అదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా పొందినాడు. 1998లో తొలిసారిగా పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. 1999లో మరోసారి నిజామాబాదు నియోజకవర్గం నుంచి ఎన్నికై కాంగ్రెస్ శాసనసభ ఉప నాయకుడిగా వ్యవహరించాడు. 2004లో రెండవసారి పిసిసి అధ్యక్షుడిగా పీఠమెక్కినాడు. 2004లో ఈ నియోజకవర్గం నుంచే మూడవసారి శాసనసభకు ఎన్నికై వైఎస్సార్ మంత్రివర్గంలో పనిచేశాడు. 2009 ఎన్నికలలో నిజామాబాదు నుంచే పోటీచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెండెల లక్ష్మీనారాయణ చేతిలో పరాజయం పొందినాడు. తెలంగాణా నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించిన లక్ష్మీనారాయణ రాజీనామా చేయగా 2010లో జరిగిన ఉప ఎన్నికలలో డి.శ్రీనివాస్ మరోసారి లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోయాడు.
- యెండెల లక్ష్మీనారాయణ:లక్ష్మీనారాయణ తొలిసారిగా 1999లో ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి డిశ్రీనివాస్ చేతిలో పరాజయం పొందినాడు. 2004 ఎన్నికల సమయంలో తెదేపాతో పొత్తు కారణంగా భాజాపాకు పోటీచేసే అవకాశం రాలేదు. 2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీచేసి పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌పై సంచలన విజయం నమోదుచేశాడు. తెలంగాణాకు మద్దుతుగా తన శాసనసభ్యత్వానికి తాజీనామా చేసి ఉప ఎన్నికలలో మళ్ళీ పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి డి.శ్రీనివాస్‌పై రెండోపర్యాయం విజయం సాధించాడు.
ఇవి కూడా చూడండి సవరించు
మూలాలు సవరించు
- ↑ Telangana Today, Telangana (30 September 2018). "Nizamabad (Urban) Assembly constituency profile". Archived from the original on 24 March 2019. Retrieved 15 January 2020.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, నిజామాబాదు జిల్లా టాబ్లాయిడ్, తేది 03.04.2010
- ↑ ఈనాడు దినపత్రిక, నిజామాబాదు జిల్లా టాబ్లాయిడ్, తేది 31.07.2010
- ↑ సూర్య దినపత్రిక. తేది 31.07.2010