నిజామాబాద్ నార్త్ మండలం

నిజామాబాద్ నార్త్ మండలం తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండల కేంద్రం. [1]

కొత్త మండల కేంద్రంగా గుర్తింపుసవరించు

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా నిజామాబాద్ నార్త్ అనే పేరుతో నూతన మండలం (0+2) (రెండు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇవి రెండు నిజామాబాదు నగర పరిధిలో చేరిన పట్టణ ప్రాంతాలు.

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. అర్సపల్లి (పాక్షికం)
  2. కంటేశ్వర్

మండలంలో దర్శించదగిన ఆలయాలుసవరించు

నీల కంటేశ్వరాలయం: మండలంలోని కంటేశ్వర్ లో కొండపై నీలకంటేశ్వర ఆలయం ఉంది.ఇది 16 వశతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది.[2] ఈ ఆలయాన్ని రాష్ట్రంలోని  వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు దర్శిస్తుంటారు. ఈ ఆలయాన్ని జైనుల కోసం శాతవాహన రాజు శాతకర్ణి -2 నిర్మించాడు. ఈ నిర్మాణాం ఉత్తర భారతీయ నిర్మాణ శైలితో దగ్గరి పోలిక ఉంది. రథ సప్తమి పండుగ ఈ ఆలయంలో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే వార్షిక కార్యక్రమం.మహారాష్ట్రలోని నాందేడ్ నుండి రహదారి ద్వారా ఇక్కడకి చేరుకోవచ్చు.[3]

మూలాలుసవరించు

  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/229.-Nizamabad-Final.pdf
  2. "SRI NEELAKANTESHWARA TEMPLE - TRAVEL INFO". Trawell.in. Retrieved 2020-01-19.
  3. "శ్రీ నీలకంటేశ్వర టెంపుల్, Nizamabad". telugu.nativeplanet.com. Retrieved 2020-01-19.

వెలుపలి లంకెలుసవరించు