కంటేశ్వర్, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ నార్త్ మండలంలోని గ్రామం.[1]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నిజామాబాదు జిల్లా లోని నిజామాబాద్ సౌత్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన నిజామాబాద్ నార్త్ మండలం లోకి చేర్చారు. [2]

కంటేశ్వర్
—  నిజామాబాద్ పట్టణ ప్రాంతం  —
కంటేశ్వర్ is located in తెలంగాణ
కంటేశ్వర్
కంటేశ్వర్
అక్షాంశరేఖాంశాలు: 18°41′01″N 78°06′50″E / 18.683712°N 78.113967°E / 18.683712; 78.113967
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు
మండలం నిజామాబాదు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 503002
ఎస్.టి.డి కోడ్

ఇది నిజామాబాద్ నగరంలో కంటేశ్వర్ కాలనీ అనే పేరుతో కలసి ఉన్న ప్రాంతం. ఈ ప్రదేశంలో ఒక అందమైన కొండపై శివుడికి అంకితం చేయబడిన నీలకంటేశ్వర ఆలయం ఉంది. ఇది 16 వశతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది.[3] ఈ ఆలయాన్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు దర్శిస్తుంటారు. ఈ ఆలయాన్ని జైనుల కోసం శాతవాహన రాజు శాతకర్ణి -2 నిర్మించాడు. ఈ నిర్మాణం ఉత్తర భారతీయ నిర్మాణ శైలితో దగ్గరి పోలిక ఉంది. రథ సప్తమి పండుగ ఈ ఆలయంలో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే వార్షిక కార్యక్రమం. మహారాష్ట్రలోని నాందేడ్ నుండి రహదారి ద్వారా ఇక్కడకి చేరుకోవచ్చు.[4] ఇది నిజామాబాదు నగర పరిధిలో ఉన్నందున ఇక్కడ నుండి రవాణా సౌకర్యం, విద్యా వసతులు, వైద్య వసతులు అందుబాటులో ఉన్నాయి.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-07-24.
  2. "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "SRI NEELAKANTESHWARA TEMPLE - TRAVEL INFO". Trawell.in. Retrieved 2020-01-19.
  4. "శ్రీ నీలకంటేశ్వర టెంపుల్, Nizamabad". telugu.nativeplanet.com. Retrieved 2020-01-19.

వెలుపలి లంకెలు

మార్చు