నిమిషా వేదాంతి

నిమిషా వేదాంతి భూగర్భ చమురు నిల్వల పరిశోధకురాలు.

నిమిషా వేదాంతి

ఆమె మహారాష్ట్ర లోని యావత్కాల్ లో 1977 జనవరి 14 న జన్మించింది. ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా ఆమె విద్యాభ్యాసం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోనే జరిగింది. వారణాసిలో ఉన్న విశ్వవిద్యాలయం నుండి 1997 లో బి.ఎస్.సి (ఆనర్స్) భౌతిక శాస్త ప్రత్యేక విషయాంశంగా పూర్తిచేశారు. 2000 లో ఎక్స్‌ప్లోరేసహ్న్ జియోఫిజిక్స్ విషయాంశంగా ఎం.ఎస్సీ (టెక్నాలజీ) పూర్తిచేశారు. ఆ తర్వాత పి.హెచ్.డి కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరారు. అందులో భగంగా జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థలో రీసెర్చ్ ఫెలోగా అవకాశం లభించింది. 2007 లో పరిశోధనా పత్రం సమర్పించి అమెరికా వెళ్ళారు. అక్కడ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో "ఎన్‌హాన్స్‌డ్ ఆయిల్ రికవరీ" అంశం మీద డాక్టరేట్ చేశారు.

మరాఠీ మాతృభాషగా ఉన్న ఈమె పి.హెచ్.డి కోసం హైదరాబాద్ చేరుకొని అక్కడే స్థిరపడ్డారు. విద్యార్జనలో, పరిశోధనా రంగంలో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత సోపానాలనధిరోహించిన ఈమెకు సామాజిక స్పృహ, దేశావసరాల అవగాహనలున్నాయి. భూగర్భ చమురు నిక్షేపాల విషయమై మన దేశం కూడా బాగా వెనకబడి ఉన్న నేపథ్యంలో నిమిషా వేదాంతి అందుకోసం కృషిచేశారు.

పరిశోధనలుసవరించు

పరిశోధనలో భాగంగా ఈమె గుజరాత్, రాజస్థాన్ సరిహద్దుల్లో చమురు క్షేత్రాల్లో రేయింబవళ్ళు కృషిచేశారు. మానవాళి ప్రగతి పయనానికి ఎటువంటి అవరోధాలు ఎదురుకాకుండా వుండాలంటే, కనుగొనవలసిన పరిష్కారాల కోసమే ఈమె కీలక పరిశోధనలు జరిపారు. చమురు నిల్వలు మనదేశంలో ఎంత హీనంగా ఉన్నాయో ఈమెకు తెలుసు. చమురు ఉత్పత్తి పెంపుదలకు కావలసిన శాస్త్రీయ పరమైన చర్యలు కూడా తగినంతగా లేకపోవడంతో ఈమె మరింత పట్టుదలతో, అంకిత భావంతో అకుంఠిత దీక్షతో పరిశోధనా కృషి చేశారు.

తన పరిశోధనలో భాగంగా ఈమె నార్వేయిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (నార్వే) వెళ్ళీ 4డి సీస్మిక్ ఫర్ ఎన్‌హాన్స్‌డ్ ఆయిల్ రికవరీలో ప్రత్యేక శిక్షణ పొందారు. 4డి సీస్మిక్ డాటా ఇన్‌వెర్షన్ ను పయోగించి "ఎన్‌హాన్స్‌డ్ ఆయిల్ రికవరీ" అంశం మీదనే పోష్ట్ డాక్టరేట్ వర్క్ ను టెక్సాస్ విశ్వవిద్యాలయంలో చేసి అపార అనుభవాన్ని పొందారు.

ఈమె 4డి సీస్మిక్ డాటా ఇన్‌వెర్షన్, వివిధ భూగర్భ ఆయిల్ నిక్షేపాల తీరుతెన్నుల మీద ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ పరిశోధనలు చేశారు. దేశం లోని అతి పెద్ద చమురు క్షేత్రమైన గుజరాత్-రాజస్థాన్ క్షేత్రంలో చమురు ఉత్పత్తిని మరింతగా పెంచే చర్యలు బాధ్యతలలో కీలక పాత్ర పోషించారు.

చమురు నిల్వల ఉత్పత్తిని పెంచేందుకు చేపట్టవలసిన మార్పులు, ప్రయోగాలు తదితర అంశాలమీద చేసిన ప్రయోగాలకు గాను ఆమెకు "యువ శాస్త్రవేత్త" అవార్డును అందుకున్నారు.

అవార్డులు,పురస్కారాలుసవరించు

రచనలుసవరించు

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు