నిమ్మకాయల శ్రీరంగనాథ్

నిమ్మకాయల శ్రీరంగనాథ్‌ (1942 జనవరి 7 - 2022 ఫిబ్రవరి 8) సీనియర్‌ జర్నలిస్టు, నీటిపారుదల రంగ నిపుణుడు.[1]

1942లో జనవరి 7న తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం మునిపల్లెలో నిమ్మకాయల శ్రీరంగనాథ్‌ జన్మించారు. అమలాపురంలోని శ్రీ కోనసీమ భానోజీ కామర్స్‌ కళాశాలలో డిగ్రీ చదివారు. ఉదయం, వార్త, ఆంధ్రప్రభ, సాక్షి, ఆంధ్రప్రదేశ్‌ టైమ్స్‌ తదితర తెలుగు, ఆంగ్ల పత్రికల్లో నాలుగు దశాబ్దాల పాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. కమ్యూనిస్ట్‌ నేత తరిమెల నాగిరెడ్డి ఆంగ్లంలో రాసిన ఇండియా మార్ట్‌గేజ్డ్‌ పుస్తకాన్ని తెలుగులో శ్రీరంగనాథ్‌ తాకట్టులో భారతదేశం పేరుతో అనువదించారు.[2]

78 ఏళ్ల వయసులో శ్రీరంగనాథ్‌ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ 2022 ఫిబ్రవరి 8న మృతి చెందారు. ఆయనకు భార్య లక్ష్మీకాంతం, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు.

ఇవీ చదవండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "సీనియర్‌ జర్నలిస్టు నిమ్మకాయల శ్రీరంగనాథ్‌ ఇకలేరు". andhrajyothy. Retrieved 2022-02-20.
  2. correspondent, dc (2022-02-09). "Veteran journalist Nimmakayala Sriranganath passes away". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2022-02-20.