నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు (న్యాయమూర్తి)
నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా 31 జనవరి 2022న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా[1],2022 ఫిబ్రవరి 14న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశాడు.[2]
నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు | |||
పదవీ కాలం 2022 ఫిబ్రవరి 14 – ప్రస్తుతం | |||
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1 జూలై 1967 ఫణిదం గ్రామం, సత్తెనపల్లి మండలం, గుంటూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
తల్లిదండ్రులు | రామకృష్ణారావు, అంజమ్మ | ||
పూర్వ విద్యార్థి | శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం |
జననం, విద్యాభాస్యం
మార్చునిమ్మగడ్డ వెంకటేశ్వర్లు 1 జూలై 1967లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా , సత్తెనపల్లి మండలం, ఫణిదం గ్రామంలో రామకృష్ణారావు, అంజమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన నాగార్జున యూనివర్సిటీ నుంచి బీకాం, అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకొని, విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఎల్ పూర్తి చేసి 1992 జూన్ 30న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.
వృత్తి జీవితం
మార్చునిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఎంఎల్ పూర్తి చేశాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి హైకోర్టులో న్యాయవాదిగా మొత్తం 26 ఏళ్ల అనుభవంలో సివిల్, క్రిమినల్, సర్వీసు సంబంధ తదితర విభాగాలకు సంబంధించిన కేసుల్లో వాదించాడు. ఆయన 2014 డిసెంబర్ నుంచి 2019 జూన్ వరకు ఆంధ్రా ప్రాంత మున్సిపాలిటీలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా, 2015 - 2016లో భారత వైద్య మండలికి స్టాండింగ్ కౌన్సిల్‌గా పని చేశాడు. ఆయనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ ఉమేశ్ ఉదయ్ లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్‌లతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కు న్యాయమూర్తిగా 31 జనవరి 2022న కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[3][4]
మూలాలు
మార్చు- ↑ Eenadu (31 January 2022). "ఏపీ హైకోర్టు జడ్జిలుగా ఏడుగురు న్యాయవాదులు". Archived from the original on 3 February 2022. Retrieved 3 February 2022.
- ↑ Andhra Jyothy (14 February 2022). "ఏడుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
- ↑ Sakshi (1 February 2022). "హైకోర్టుకు ఏడుగురు జడ్జీలు!". Archived from the original on 3 February 2022. Retrieved 3 February 2022.
- ↑ Andhra Jyothy (1 February 2022). "హైకోర్టుకు మరో ఏడుగురు జడ్జీలు". Archived from the original on 3 February 2022. Retrieved 3 February 2022.