నిమ్మగడ్డి నూనె

(నిమ్మగడ్ది నూనె నుండి దారిమార్పు చెందింది)

నిమ్మగడ్డి నూనె ను లెమన్ గ్రాస్ ఆయిల్ అనికూడా అంటారు.నిమ్మగడ్డి నూనె ఒక ఆవశ్యకనూనె. తక్కువ ఉష్ణోగ్రతలో ఆవిరిగా మారు నూనెలను వోలటైల్ నూనెలు అంటారు.నిమ్మగడ్డి నూనె కూడా ఒక ఆవశ్యక నూనె. వృక్షశాస్త్రంలో గడ్డి జాతి కుటుంబానికి చెందిన లెమన్ గ్రాస్ అనే మొక్కల నుండి లెమన్ గ్రాస్ నూనెను తీయుదురు.ఈ మొక్క ఆకులు, నూనె నిమ్మ వాసన కల్గి వున్నందున ఈ మొక్కను నిమ్మగడ్డి లేదా లెమన్ గ్రాస్ అంటారు.నిమ్మగడ్డి నూనెను సబ్బుల తయారీలో, దోమలను పారదోలు మందులలో,, సౌందర్యద్రవ్యాలలో ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఉత్పత్తి అగు నిమ్మగడ్డి నూనెలో 40% భారతదేశంలో ఉత్పత్తి అవ్వగా,అందులో ఎక్కువ శాతం కేరళ రాష్ట్రంలోనే ఉత్పత్తి అగుచున్నది.

నిమ్మగడ్డి
నిమ్మగడ్డి మొక్కలు.
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
సింబోపోగాన్

జాతులు

About 55, see text

నిమ్మగడ్డి మొక్క

మార్చు

నిమ్మగడ్డి మొక్క వృక్ష శాస్త్ర పేరు Cymhopogan flexuosus.ఇది పోయేసి కుటుంబానికి చెందిన మొక్క.ఈ మొక్క ఎక్కువగా ఉష్ణ మండల అడవులు, ఉపౌష్ణ మండల ప్రాంతాలలో పెరుగును.ఇది బహు వార్షిక మొక్క. నిమ్మగడ్డి మొక్కల్లో 55 రకాలు ఉన్నాయి.నిమ్మగడ్డి పొడవుగా పెరిగే perennial మొక్క,ఇది పోయేసియే వృక్ష కుటుంబానికి చెందిన మొక్క. అయితే అందులో కొన్నిమాత్రమే ఆహారంలో,వైద్యంలో వాడుటకు పనికి వస్తాయి.ముఖ్యంగా వాడుటకు అనుకూలమైనవి సైంబోపోగన్ సిట్రాటస్ (Cymbopogon citrates),, సైంబోపోగన్ ఫ్లెక్షుసుస్ (Cymbo pogon flexuosus). సైంబోపోగన్ సిట్రాటస్ నుండి తీసిన నూనెను వంటలలో వాడగా, సైంబోపోగన్ ఫ్లెక్షుసుస్ నూనె సువాస ద్రవ్యాలు తయారీలో వాడుతారు.

ఆవాసం

మార్చు

ఈ మొక్క ఎక్కువగా ఉష్ణ మండల అడవులు, ఉపౌష్ణ మండల ప్రాంతాలైన భారతదేశం, శ్రీలంక, కంబోడియా, బర్మా,దక్షిణ ఆఫ్రికా,మెక్సికో,చైనా,, థాయ్‌లాండ్ దేశాలలో వ్యాప్తి చెందివున్నది[1].ప్రపంచంలో నిమ్మగడ్డి నూనె ఉత్పత్తి సంవత్సరానికి 870 టన్నులుకాగా భారతదేశంలో దాదాపు 350 టన్నులు ఉత్పత్తి అవుతుంది.[2]

భారతదేశంలో సాగు చేయు ప్రాంతాలు

మార్చు

భారతదేశంలో నిమ్మగడ్డిని కేరళ,మహారాష్ట్ర,తమిళనాడు,అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం,, జమ్ము (కాశ్మీర్) రాష్ట్రాలలో నిమ్మగడ్డి నూనెకై సాగు చేస్తున్నారు.భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న నిమ్మగడ్డి నూనెను అమెరికా, ఐరోపా దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి.[3]

నిమ్మగడ్డి నూనె ఉత్పత్తి

మార్చు

ఉపయోగించిన నూనె సంగ్రహణ పద్ధతిని బట్టి నిమ్మగడ్డినుండి 0.25 నుండి I 1.4% వరకు నూనె దిగుబడి వస్తుంది.తగిన ఎక్కువ శాతం నూనెను పొందుటకు గడ్డిని కోసిన తరువాత దానిని ఆరబెట్టిన పద్ధతి పై ఆధారపడి ఉంది.ఎండలో అయినచో 36 గంటలు,నీడలో అయినచో 48 గంటలు ఆర/ఎండ బెట్టాలి.లేదా విద్యుత్తులో పనిచేయు ఓవెన్/oven అను పరికరం అయినచో 45 °C వద్ద 7 గంటలు ఆర బెట్టాలి.ఎండలో, నీడలో ఆరబెట్టినగడ్డి నుండి వచ్చు నూనె పరిమాణంలో మార్పు లేకున్నను, ఓవన్ లో పొడి పర్చిన గడ్డినుండి నూనె ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవ్వుతుంది. మిగతా పద్ధతుల్లో ఆర బెట్టిన/ ఎండ బెట్టిన గడ్డిలోకన్న నీడలో ఎండబెట్టిన గడ్డి నుండి తీసిన నూనెలో లిమోనేన్ (limonene), సిట్రాల్ ఎక్కువ వుండును.నిమ్మగడ్డి నూనెను సాధారణంగా రెండు పద్ధతుల్లో సంగ్రహిస్తారు.ఒకటి డిస్టిలేసన్/స్వేదన క్రియ,మరొకటి సాల్వెంట్ ఎక్సుట్రాక్సను/ద్రావణి సంగ్రహణ విధానం.డిస్టిలేసన్ విధానాన్ని హైడ్రోడిస్టిలేసన్ అనికూడా అంటారు.

హైడ్రోడిస్టిలేసన్

మార్చు

ఇందులో నీటిని స్టీముగా/నీటి ఆవిరిగా మార్చి ఆ ఆవిరుతో గడ్డిలోని నూనెను వాయురూపంలోకి మార్చి, తరువాత దాన్ని కండెన్సరులో ద్రవీకరించి ఒక పాత్రలో సేకరించెదరు. గడ్దిని స్టీముతో వేడి చెయ్యడం వలన గడ్డిలోని నూనె ఆవిరిగా మారును. తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిగా మారు ద్రవాలను వోలట్రైల్ ద్రవాలు అంటారు. సేకరణ పాత్రలో, గడ్డినూనెతో పాటు స్టీము కూడా ద్రవీకరణ చెంది నూనెతో కలసి వుండుటవలన,రెండింటి మిశ్రమాన్ని అలాగే కొంత సమయం నిలకడ వదలి వేస్తారు.రెండు ఒకదానితో మరొకటి కలిసే స్వభావం లేనందున సేకరణ పాత్ర అడుగున నీరు,దాని పై మట్టాన గడ్డి నూనె జమ అగును. స్టీము డిస్టిలేసను పద్ధతిలో అయినచో నూనె సంగ్రహణకు 2.5 నుండి 5 గంటల సమయం పట్టవచ్చు. గడ్డిలోని 90% నూనె మొదటి 2.5 గంటల్లోనే ఆవిరిగా మారి వేరు పడును. హైడ్రోడిస్టిలేసను విధానంలో దాదాపు 0.45%నూనె ఉత్పత్తి అగును. మామూలు వాతావరణ ఉష్ణోగ్రత కన్న కొద్దిగా ఎక్కువ ఉష్ణోగ్రతలో 100 C మించి వేడిచేసిన ఉత్పత్తి 0.8 నుండి 1.5% వరకు వుండును.

స్టీము డిస్టిలేసన్

మార్చు

ఈ పద్ధతిలో పాత్రలోని నిమ్మగడ్దిని,చిన్న బాయిలరులో ఉత్పత్తి చేసిన నీటిఆవిరి/స్టీము ద్వారా వేడి చేసి నూనెను సంగ్రహించెదరు.హైడ్రో డిస్టిలేసన్ లో గడ్ది మునిగే వరకునీరు తీసుకుని ఆనీటీని వేడీ చెయ్యగా,ఈ విధానంలో స్టీము ద్వారా గడ్దిని వేడీ చేస్తారు.

సాల్వెంట్ సంగ్రహణ విధానం

మార్చు

నిమ్మగడ్డిని పలురకాల సాల్వెంట్ లను ఉపయోగించి కూడా ఉత్పత్తి చెయ్యవచ్చు.. ద్రవ సూపర్ క్రిటికల్ కార్బన్ డయాక్సైడ్ ను (కార్బన్ డయాక్సైడ్ ను అధిక వత్తిడి/పీడనంకు లోను కావించినపుడు,అది ద్రవ స్థితిలోవుండును) ఉపయోగించి నిమ్మగడ్డి నుండి ఆవశ్యక నూనెను సంగ్రహించుటకు పలు ప్రయోగాలు జరిగాయి. అధిక పీడనం (85–120 బార్) వద్ద అధిక ఉష్ణోగ్రతలో (23-50 °C) వద్ద నూనెను సంగ్రహించు ప్రయోగం కార్ల్సన్ (Carlson ) తదితరులు చేశారు. ఈ విధానంలో దాదాపు1.8% వరకు నూనెను పొందవచ్చును. కార్ల్సన్ అభిప్రాయం ప్రకారం 120 బార్ పీడనం వద్ద 40 °C వద్ద సూపర్ క్రిటికల్ కార్బన్ డయాక్సైడ్ సాల్వెంట్ ఎక్సుట్రాక్సను పద్ధతిలో నూనె తీయడం అనుకూలం. కానీ 110-120 బార్ వత్తిడిలో సాల్వెంట్ ను (లిక్విడు కార్బన్ డయాక్సైడ్)ఉపయోగించ వలసి వున్నందున, డిస్టీలరు పాత్ర చాలా మందంగా దృఢంగా వుండాలి. సంగ్రహణ తరువాత,పీడనం తొలగించడం వలన తక్కువ ఉష్ణోగ్రత వద్ద సూపర్ క్రిటికల్ కార్బన్ డయాక్సైడ్ వాయువుగా మారి, నిమ్మ గడ్డి నూనె ద్రవ స్థితిలోడిస్టిలేటరులో మిగిలి పోవును.ఈ రకామ్ విధానం ప్రస్తుతం (2018 నాటికి)ప్రయోగ స్థాయిలో మాత్రమే ఉంది.

బ్రియాన్,,ఇఖ్లస్ (Brian, Ikhlas)లు హెక్సేను, డైక్లోరో మీథేన్, ఆసిటోన్,, ఇథనాల్ లను సాల్వెంట్ గా ఉపయోగించి నిమ్మగడ్డినుండి తీసిన వ్యత్యాసాన్ని గమనించగా, హెక్సేను ద్వారా ఎక్కువ నూనె దిగుబడి వచ్చినట్లు గమనించారు.

నిమ్మగడ్డి నూనెలోని రసాయన పదార్థాలు

మార్చు

నిమ్మగడ్డి నూనె పలు హైడ్రోకార్బను రసాయనాల సమ్మేళనాల సమాహారం. ఎక్కువగా 10కార్బనులు వున్న హైడ్రోకార్బను సమ్మేళనాలను కల్గి ఉంది.ఇందులో ప్రధానంగా జెరానైల్ ఆసిటేట్ (geranyl acetate), జెరానిఒల్ (geraniol), మైర్సేన్ (myrcene) సిట్రోనెల్లాల్ (citronellal), నేరోల్, టెర్పినియోల్ మిథైల్ హెప్టెనోన్ ( methyl heptenone),డై పెంటెన్, ఫార్నెసోల్, లిమోనేన్ (limonene), సిట్రాల్ (citral)కలవు. ఈ రసాయనాలు యాంటీ ఫంగల్,యాంటీ సెప్టిక్,, క్రిమి,కీటక నిరోధక లక్షణాలు కలిగి ఉన్నాయి.

వరుస సంఖ్య రసాయన పదార్థం పేరు ఫార్ములా 25C వద్ద సాంద్రత kg/m3
1 β-myrcene C10H16 794
2 limonene C10H16 841
3 సిట్రానెల్లాల్ C10H18O 855
4 నేరాల్ (సిట్రాల్) C10H16O 893
5 జెరానియోల్ C10H18O 889

నిమ్మగడ్డి నూనె వినియోగం ఉపయోగాలు

మార్చు

భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న నిమ్మగడ్డి నూనెను అమెరికా, ఐరోపా దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. నిమ్మగడ్డి నూనెను ముఖ్యంగా సబ్బులు,షవరు జెల్, సువాసన ద్రవ్యాల తయారీ లో,అలాగే విటమీనుల తయారీ, దోమలను పారదోలు ద్రవాలలో ఉపయోగిస్తారు. నూనెలోని సిట్రాల్ యాంటీ మైక్రో బియాల్ ప్రభావశీలి కావున ఇది బాక్టీరియా,, శిలీంద్ర నాశినిగా పనిచేయును.అలాగే నూనెలో వున్న లిమోనెన్ కూడా ఇన్ఫ్లమేసన్ తగ్గించి,బాక్టీరియాను చంపును.

బయటి వీడియో లింకులు

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

ఆధారాలు

మార్చు
  1. Department of Agriculture Forestry and Fisheries Lemongrass Production Dir. Commun. Serv., pp. 1-26, 2012.
  2. D. of Agriculture Cultivation and Processing of Lemongrass, 2014.
  3. V.D. Zheljazkov, C.L. Cantrell, T. Astatkie, J.B. Cannon, "Lemongrass Productivity Oil Content and Composition as a Function of Nitrogen Sulfur and Harvest time", Agron. J., vol. 103, pp. 805-812, 2011.