నీల్జా వాంగ్మో (జననం: 1979)[1] భారతీయ రెస్టారెంట్ యజమాని. ఉత్తర భారతదేశంలోని లడఖ్ ప్రాంతంలో, స్థానిక ఆహారం పట్ల ఆసక్తి గల ఔత్సాహికురాలు.[2] 2019 లో ఆమె కృషికి గాను, భారతదేశంలో మహిళల అత్యున్నత పురస్కారమైన నారీ శక్తి పురస్కారంతో గుర్తించబడింది. [3]

నిల్జా వాంగ్మో
2020లో
జననం1979
అల్చి
జాతీయతభారతీయురాలు
విద్యమిషనరీ పాఠశాల
వృత్తిరెస్టారెంట్ యజమాని
ప్రసిద్ధి నారీ శక్తి పురస్కారం అందుకోవడం

జీవితం మార్చు

వాంగ్మో తన తండ్రి మరణించిన తరువాత 1979 లో అల్చిలో జన్మించింది. ఆమె తాతయ్య, అమ్మమ్మలు ఆమెను "స్టోక్" అనే గ్రామంలో పెంచారు. ఆ గ్రామం కొండల్లో ఉంది. ఆమె మిషనరీ పాఠశాలకు వెళ్లగా, ఆమె తల్లి ఒక స్వచ్ఛంద సంస్థలో తక్కువ వేతనానికి పనిచేసింది. [4] డబ్బుకు కటకటగా ఉండేది. ఆమె కళాశాలలో చేరినప్పటికీ ఆమె అక్కడ ఉండడానికి తగినంత డబ్బు లేదు. తండ్రి తరఫున కుటుంబం ఆమె పట్ల ఆదరణ చూపలేదు. తన తండ్రి ఇంటిలో ఉండడానికి వాళ్ళు అనుమతించలేదు. అల్చీలో ఇల్లు కట్టుకోడానికి ఆమెకు, ఆమె తల్లికీ ఆమె తాతయ్య ధనసహాయం చెయ్యకపోతే వారు నిరాశ్రయులు అయ్యేవారు.[5] ఆమె తాతయ్య 2014 లో చనిపోయారు.

 
నిల్జా వాంగ్మోకు నారీ శక్తి పురస్కారాన్ని అందజేస్తున్న రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్

వాంగ్మో 2016 లో వ్యాపార రుణం తీసుకుని, "అల్చి కిచెన్" అనే వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ రెస్టారెంట్ వారి ఇంటికి పైనే ఉండేది. ట్రెక్కింగ్ చేస్తూ, ఆమె రెస్టారెంట్ను తెలుసుకోవడం పర్యాటకులకు ఆసక్తిగా ఉండేది. ప్రకటనల కోసం పెద్దగా డబ్బు ఖర్చు చేయకపోయినా మూడేళ్ల తర్వాత నోటిమాటపై వచ్చిన ప్రచారంతో వ్యాపారం బాగానే సాగింది.[4] ప్రజాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ, తమ స్థానిక రుచులే సందర్శకులను ఎక్కువగా ఆకట్టుకుంటాయని ఆమె నమ్మింది. ఇతర రెస్టారెంట్లలో స్థానిక ఆహార సంప్రదాయం మరీ మృదువుగా కనిపిస్తుందనే భయంతో ఇతర సాంప్రదాయిక వంటకాలను వడ్డించేవారు.[5] ఆమె, తల్లితో కలిసి చుటాగి అనే పాస్తా వంటి వంటకాన్ని, మోమో లనూ అభివృద్ధి చేశారు. నేరేడు పండు కెర్నల్స్, వాటి స్వంత ప్రత్యేక మిశ్రమం ఆధారంగా టీలు తయరుచేసేవారు. కస్టమర్లను కట్టెల పొయ్యి చుట్టూ కూర్చోబెట్టగా, వంటవారు భోజనం తయారుచెయ్యడం చూస్తూ వారు భోంచేసేవారు.[5]

ఏదేమైనా ఆమె ఆహారానికి ప్రశంసలు వచ్చాయి. 2019 లో ఆమె "తన" వంటకాలను ఎలా వండాలో ఇతరులకు నేర్పుతూ తన వ్యాపారాన్ని విస్తరించింది. తమ ప్రాంతంలో మగ వంటగాళ్ళ సంప్రదాయం లేనందున తాను అమ్మాయిలు లేదా మహిళలను మాత్రమే నియమించుకుంటానని ఆమె చెప్పింది. [4]

అవార్డులు మార్చు

2019లో ఆమె చేసిన కృషికి భారతదేశంలోని మహిళల అత్యున్నత పురస్కారం లభించింది.[5] 2020 లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ నారీ శక్తి పురస్కార్ ను ఆమెకు అందించారు. ఆ పుస్రకారం అందుకున్న పదిహేను మంది మహిళల్లో ఆమె ఒకరు. [6] [7] మహిళా సాధికారతకు కృషి చేసిన మహిళలను ఇది గుర్తిస్తుంది. [8] సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం 2030 ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంతో పాటు మహిళల హక్కులను పరిరక్షించడానికి ఆమె కృషి చేసినందున ఆమెను ఎంపిక చేశారు. 2020 కోసం ఎంపిక చేసిన మహిళలు తమ ఆశయసాధనలో అడ్డుగా ఉన్న తమ స్థానాన్ని, వయస్సును, లింగాన్ని, వనరుల లేమినీ అధిగమించారు. [6]

మూలాలు మార్చు

  1. "Nari Shakti awardees must contribute to eradicate malnutrition & save water: PM Modi". The Economic Times.
  2. "Leh'd on a rustic platter: Ladakhi cuisine gets a modern makeover". The Financial Express. 14 November 2021.
  3. "Promoting Ladakhi cuisine earns Nari Shakti Puraskar for Nilza Wangmo". The Asian Age. 8 March 2020.
  4. 4.0 4.1 4.2 Shali, Pooja (November 2, 2019). "Meet a woman chef who beat all odds to spread the taste of Ladakh". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-04-03.
  5. 5.0 5.1 5.2 5.3 "Lost Her Dad, Had to Leave College: Today, She Is Taking Ladakh's Food to the World". The Better India (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-12-03. Archived from the original on 2019-12-04. Retrieved 2020-04-03.
  6. 6.0 6.1 "President of India Confers Nari Shakti Puraskar for 2019". ddnews.gov.in. Retrieved 2019-03-08.
  7. "President gives Nari Shakti Puraskar". ddnews.gov.in. Retrieved 2019-03-08.
  8. "Nilza Wangmo to get Nari Shakti Puraskar for promoting Ladakhi cuisines". Business Standard India. 2020-03-08. Retrieved 2020-04-03.