నిహారిక ఖాన్

భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్

నిహారిక భాసిన్ భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్. హిందీ సినిమా (బాలీవుడ్) లకు పనిచేసింది. 2011లో వచ్చిన ది డర్టీ పిక్చర్ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా జాతీయ చలనచిత్ర అవార్డుతోపాటు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్‌కి ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకుంది.

నిహారిక ఖాన్
నిహారిక ఖాన్ (2012)
జననం (1969-11-21) 1969 నవంబరు 21 (వయసు 55)
వృత్తికాస్ట్యూమ్ డిజైనర్
క్రియాశీల సంవత్సరాలు2007-ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ (ది డర్టీ పిక్చర్)
జీవిత భాగస్వామిఆయుబ్ ఖాన్
పిల్లలు2
బంధువులుఅర్జున్ భాసిన్ (సోదరుడు)

నిహారిక 1969 నవంబరు 21న పంజాబీ తండ్రి, పార్సీ తల్లికి జన్మించింది. యునైటెడ్ స్టేట్స్ లోని సీటెల్‌లో పబ్లిక్ రిలేషన్స్, హెచ్‌ఆర్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసింది.[1]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఉత్తరాన్ (2008) అనే టీవీ సిరీస్‌తో పేరుగాంచిన సినిమా, టీవి నటుడు అయూబ్ ఖాన్‌తో నిహారిక వివాహం జరిగింది. అయూబ్ ఖాన్‌ సినీ నటులు దిలీప్ కుమార్, సైరా బానోల మేనల్లుడు.[2][3]

నిహారిక సోదరుడు అర్జున్ భాసిన్ దిల్ చాహ్తా హై (2001), రంగ్ దే బసంతి (2006), జిందగీ నా మిలేగీ దొబారా (2011) సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశాడు.[4][5]

సినిమారంగం

మార్చు

2007లో వచ్చిన ఖోయా ఖోయా చంద్ సినిమాతో తన కెరీర్‌ని ప్రారంభించింది. 2008లో వచ్చిన రాక్ ఆన్‌ సినిమాతో గుర్తింపు పొందింది. యష్ రాజ్ ఫిల్మ్స్ వారి బ్యాండ్ బాజా బారాత్ (2010) తో ప్రశంసలు అందుకుంది.[6]

సినిమాలు 

మార్చు
  • ఖోయా ఖోయా చంద్ (2007)
  • రాక్ ఆన్!! (2008)
  • భూత్‌నాథ్ (2008)
  • రాకెట్ సింగ్: సేల్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్ (2009)
  • కార్తీక్ కాలింగ్ కార్తీక్ (2010)
  • బ్యాండ్ బాజా బారాత్ (2010)
  • ఢిల్లీ బెల్లీ (2011)
  • తృష్ణ (2011)
  • ది డర్టీ పిక్చర్ (2011)
  • ఎఫ్.ఎ.ఎల్.టి.యు (2011)
  • అజబ్ గజబ్ లవ్ (2012)
  • రౌడీ రాథోడ్ (2012)
  • హీరోయిన్ (2012)
  • ఇంకార్ (2013)
  • కై పో చే! (2013)
  • చష్మే బద్దూర్ (2013)
  • ది లంచ్ బాక్స్ (2013)
  • టైగర్స్ (2014)
  • రాయ్ (2015)
  • బాంబే వెల్వెట్ (2015)
  • ఉంగ్లీ (2014)
  • రంగ్ రసియా (2014)
  • మార్గరీట విత్ ఎ స్ట్రా (2014)
  • ఫితూర్ (2016)
  • ఫాన్ (2016)
  • మిర్జియా (2016)
  • శివాయ్ (2016)
  • పెట్ట (2019)
  • దే దే ప్యార్ దే (2019)
  • పతి పత్నీ ఔర్ వో (2019)
  • దర్బార్ (2020)
  • శకుంతలా దేవి (2019)

అవార్డులు

మార్చు
సంవత్సరం అవార్డు విభాగం సినిమా ఫలితం
2011 జాతీయ చలనచిత్ర అవార్డులు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ ది డర్టీ పిక్చర్[7] విజేత
2012 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విజేత
2011 ఐఫా అవార్డులు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ బ్యాండ్ బాజా బారాత్[8] విజేత
2012 ది డర్టీ పిక్చర్ విజేత
2020 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ ఫోటోగ్రాఫ్ నామినేట్

మూలాలు

మార్చు
  1. "Brunch Date with costume designer Niharika Khan Bhasin". Hindustan Times. 5 April 2013. Archived from the original on 2013-04-07. Retrieved 8 April 2013.
  2. "Destiny's couple: Niharika & Ayub Khan". Archived from the original on 23 July 2015. Retrieved 14 March 2013.
  3. "Ayub has always been my first love: wife Niharika Khan". DNA. 15 March 2010.
  4. "Characters can't afford designer labels: Niharika". The Times of India. 18 August 2009. Archived from the original on 11 April 2013.
  5. "Keep it stylish". Indian Express. 17 August 2011. Zindagi Na Milegi Dobara 's unsung hero is its stylist, the tour de force that is Arjun Bhasin
  6. "Dressing up with Niharika Khan and Arjun Bhasin". The Times of India. 10 November 2012. Archived from the original on 11 April 2013. Retrieved 14 March 2013.
  7. "59th National Film Awards for the Year 2011 Announced". Press Information Bureau (PIB), India.
  8. "Dabangg, Band Baaja Baaraat win big at IIFA technical awards". Indian Express. 26 June 2011. Retrieved 14 March 2013.

బయటి లింకులు

మార్చు