నీటి తేలు (ఆంగ్లం Water Scorpion) నెపిడే (Nepidae) కుటుంబానికి చెందిన కీటకాలు.[1] Archived 2021-03-03 at the Wayback Machine ఇవి చూడడానికి తేలు (Scorpion) లాగా కనిపిస్తాయి. వీటిలో 8 ప్రజాతులకు చెందిన జీవులు రెండు ఉపకుటుంబాలలో నెపినే (Nepinae), రానాట్రినే (Ranatrinae) ఉన్నాయి. రానాట్రా (Ranatra) ప్రజాతికి చెందిన జీవులు సూదుల్లాగా సన్నగా పొడవుగా ఉంటాయి. సాధారణమైన బ్రిటిష్ జాతి (Nepa cinerea) చెరువులు, నిలవ నీటిలో జీవిస్తాయి. ఇవి నీటిలోని చిన్న చిన్న కీటకాలను తింటాయి.

నీటి తేలు
Nepa cinerea
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder:
Infraorder:
Family:
నెపిడే
Subfamilies, Genera

8 genera in 2 subfamilies; see text

నెపా (Nepa) జీవులలో శరీరం వెడల్పుగా, బల్లపరుపుగా ఉంటాయి. రానాట్రా (Ranatra) జీవులు, వాటి కాళ్ళు సన్నగా పొడవుగా ఉంటాయి. తేలు వలె ఇది విష కీటకము కాదు.

Ranatra elongata

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=నీటి_తేలు&oldid=4023798" నుండి వెలికితీశారు