నీతూ చంద్ర ప్రముఖ రంగస్థల, సినీనటి, నిర్మాత[1]. నృత్యకారిణి, క్రీడాకారిణి కూడా.

నీతూ చంద్ర
Neetu chandra at Dabboo Ratnani Calendar Launch, 2011 (cropped).jpg
నీతూ చంద్ర
జననం (1984-06-20) 1984 జూన్ 20 (వయస్సు: 36  సంవత్సరాలు)
పాట్నా, బీహార్, భారతదేశం
వృత్తిరంగస్థల, సినీనటి, నిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు2005 – ప్రస్తుతం

జననం - విద్యాభ్యాసంసవరించు

నీతూ చంద్ర 1984, జూన్ 20న బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జన్మించింది. మాతృభాష భోజ్ పురి. ఢిల్లీలో డిగ్రీ పూర్తిచేసింది.

సినీరంగ ప్రస్థానంసవరించు

సినిరంగ ప్రవేశానికి ముందు ఢిల్లీలో ఉంటూ వ్యాపార ప్రకటనలో నటించింది. సినిమాలలో నటించడంకోసం ముంబై వచ్చి, 2005 లో వచ్చిన గరం మసాలా అనే హిందీ సినిమాలో తొలిసారిగా నటించింది. 2006లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి సినిమా ద్వారా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.

నిర్మాతగా మారి తమ్ముడు నితిన్ చంద్ర దర్శకత్వంలో దేశ్వా సినిమాను నిర్మించింది.[2]

నటించిన చిత్రాల జాబితాసవరించు

నటిగాసవరించు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2003 విష్ణు హీరో ఫ్రెండ్ తెలుగు
2005 గరం మసాలా స్వీటీ హిందీ
2006 గోదావరి రాజి తెలుగు
2007 ట్రాఫిక్ సిగ్నల్ రాణి హిందీ
2008 వన్ టూ త్రీ ఇన్స్ పెక్టర్ మాయావతి చౌతలా హిందీ
2008 సమ్మర్ 2007 దిగంబర్ భార్య హిందీ
2008 ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్! సొనాల్ హిందీ
2009 సత్యమేవ జయతే బాసర పాప తెలుగు
2009 యవరన్ నాలం ప్రియా మనోహర్ తమిళం
2009 13బి హిందీ
2010 ముంబాయ్ కటింగ్ హిందీ
2010 రన్ యాస్మిన్ హుస్సేన్ హిందీ
2010 తీరద విలైయాట్టు పిల్లై తేజస్వినీ తమిళం
2010 అపార్టుమెంట్ నేహ భార్గవ్ హిందీ
2010 నో ప్రాబ్లం సోఫియా హిందీ ప్రత్యేక పాత్ర
2010 సాదియాన్ హిందీ
2011 యుద్ధం సెయ్ తమిళం ప్రత్యేక పాట
2011 కుచ్చ్ లవ్ జైసా రియా హిందీ
2013 ఆది భగవాన్ రాణి సంపత/ కరిష్మా తమిళం ఉత్తమ నెగిటవ్ నటి (సైమా అవార్డు)
2013 సెట్టై తమిళం ప్రత్యేక పాట
2014 మనం తెలుగు ప్రత్యేక పాత్ర[3]
2014 పవర్ కన్నడ ప్రత్యేక పాత్ర
2015 తిలగర్ తమిళం ప్రత్యేక పాత్ర
2016 బ్లాక్ 9 గ్రీకు
2017 సింగం 3 తమిళం ప్రత్యేక పాత్ర
2017 వైగై ఎక్స్ ప్రెస్ రాధిక/జ్యోతిక తమిళం ద్విపాత్రాభినయం
2018 అంబనవన్ అసరదవన్ అదంగదా To Be Announced తమిళం చిత్రీకరణ

నిర్మాతగాసవరించు

సంవత్సరం చిత్రంపేరు భాష ఇతర వివరాలు
2011 దేశ్వా భోజ్‌పురి
2016 మిథిలా మక్హాన్ మైథిలి 2016

మూలాలుసవరించు

  1. ఏపి7ఏఎం. "నీతూ చంద్ర నిలదొక్కుకున్నట్టే!". www.ap7am.com. Retrieved 12 May 2017.
  2. తెలుగు వెబ్ దునియా. "సినిమా బిజినెస్ చేస్తున్న నీతూ చంద్ర". telugu.webdunia.com. Retrieved 12 May 2017.
  3. ఏపీ7ఏఎం. "'మనం'లో మరో హీరోయిన్". www.ap7am.com. Retrieved 12 May 2017.

ఇతర లంకెలుసవరించు