గోదావరి (సినిమా)

2006 సినిమా

గోదావరి 2006 సంవత్సరంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఈ సినిమాలో చాలా భాగం గోదావరి నది, పాపికొండల ప్రాంతంలో చిత్రీకరించారు. ఇంతకు మునుపు అక్కినేని నాగేశ్వరావు నటించిన అందాల రాముడులో కూడా చాలాభాగం గోదావరి నది మీద చిత్రీకరించారు.

గోదావరి
దర్శకత్వంశేఖర్ కమ్ముల
రచనశేఖర్ కమ్ముల (కథ, స్క్రీన్ ప్లే, మాటలు)
నిర్మాతజి.వి.జి.రాజు
తారాగణంసుమంత్,
కమలినీ ముఖర్జీ,
తనికెళ్ళ భరణి,
నీతూ చంద్ర
ఛాయాగ్రహణంవిజయ్ సి. కుమార్
కూర్పుమార్తాండ్ వెంకటేష్
సంగీతంకె. ఎం. రాధాకృష్ణన్
నిర్మాణ
సంస్థ
ఎస్ ఎస్ సి ఆర్ట్స్
పంపిణీదార్లుఅమిగోస్ క్రియేషన్స్
విడుదల తేదీ
మే 19, 2006 (2006-05-19)
సినిమా నిడివి
160 ని
భాషతెలుగు

సీతా మహాలక్ష్మి ఆత్మాభిమానం కలిగిన ఆడపిల్ల. సొంతంగా తన కాళ్ళమీద నిలబడాలని వ్యాపారం చేస్తుంటుంది కానీ అతి కష్టమ్మీద నెట్టుకొస్తుంటుంది. ఒక వైపు తల్లిదండ్రులు చూస్తున్న పెళ్ళి సంబంధాలు కూడా ఏదో ఒక కారణంతో తిరగ్గొడుతూ ఉంటుంది. రామ్ అమెరికాలో చదివి వచ్చి రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే అమ్మమ్మ, మామయ్య దగ్గర పెరుగుతాడు. మరదలు రాజీ అంటే రాముకి అభిమానం. కానీ మేనల్లుడు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడని అతనికి పిల్లనివ్వడానికి మేనమామ అంగీకరించడు.

నటీనటులు

మార్చు

నిర్మాణం

మార్చు

శేఖర్ కమ్ముల తన రెండో సినిమా ఆనంద్ చిత్రీకరిస్తున్న సమయంలోనే గోదావరి చిత్రానికి అంకురార్పణ జరిగింది. ఆ చిత్ర కథ విన్న కథానాయిక కమలినీ ముఖర్జీ ఆ సినిమాలో కూడా తానే ప్రధాన పాత్ర పోషిస్తానని అడిగింది. ఆనంద్ విడుదల తర్వాత చూద్దామని శేఖర్ బదులిచ్చాడు. ఆనంద్ విజయం సాధించిన తర్వాత గోదావరి స్క్రిప్టును సిద్ధం చేసుకున్నాడు శేఖర్. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, గోపీచంద్ లో ఎవరినైనా కథానాయకుడిగా అనుకున్నాడు కానీ ఆ సమయానికి వాళ్ళ తేదీలు అందుబాటులో లేకపోవడంతో సుమంత్ కి ఈ అవకాశం దక్కింది. వేరే కథానాయిక కోసం చూస్తుంటే శేఖర్ తో పరిచయం ఉన్నవారు కమలినీ అయితేనే బాగుంటుందని సూచించడంతో ఆమెకే ఈ అవకాశం దక్కింది.[1]

పురస్కారాలు

మార్చు
సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
2006 నంది పురస్కారాలు[2] ద్వితీయ ఉత్తమ చిత్రం జి.వి.జ్.రాజు గెలుపు
2006 నంది పురస్కారాలు ఉత్తమ దర్శకులు శేఖర్ కమ్ముల గెలుపు
2006 నంది పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రహణం విజయ్ సి. కుమార్ గెలుపు
2006 నంది పురస్కారాలు ఉత్తమ సంగీత దర్శకుడు కె. ఎం. రాధాకృష్ణన్ గెలుపు
2006 నంది పురస్కారాలు ఉత్తమ నేపథ్య గాయని ఉపద్రష్ట సునీత గెలుపు

పాటలు

మార్చు
  • ఉప్పొంగెలే గోదావరి, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, రచన: వేటూరి.
  • మనసా వాచా , చిత్ర, ఉన్ని కృష్ణన్ , రచన: వేటూరి
  • తిప్పల తప్పులు , శ్రేయా ఘోషల్ , రచన: వేటూరి
  • మనసా గెలుపు , శంకర మహదేవన్, చిత్ర, కె. ఎం.రాధా కృష్ణ , వేటూరి సుందర రామమూర్తి.
  • అందంగా లేనా , సునీత , రచన: వేటూరి.
  • రామ చక్కని సీతకు, గాయత్రి , రచన : వేటూరి సుందర రామమూర్తి .

మూలాలు

మార్చు
  1. "Godavari: 18 ఏళ్ల 'గోదావరి'.. సుమంత్‌కు ముందు అనుకున్న హీరోలెవరంటే?". EENADU. Retrieved 2024-05-19.
  2. "Nandi Awards 2006 Winners List". Archived from the original on 2018-02-04. Retrieved 2018-01-20.

బయటి లింకులు

మార్చు