నీరజ్ శర్మ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో ఫరీదాబాద్ నిట్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

నీరజ్ శర్మ

పదవీ కాలం
2019 – 2024
ముందు నాగేందర్ భదన
తరువాత సతీష్ కుమార్ ఫగ్నా
నియోజకవర్గం ఫరీదాబాద్ నిట్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

నీరజ్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 శాసనసభ ఎన్నికలలో ఫరీదాబాద్ నిట్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నాగేందర్ భదనపై 3,242 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ ఫగ్నా చేతిలో 33,217 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2][3]

మూలాలు

మార్చు
  1. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Faridabad NIT". Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.
  3. The Tribune (8 October 2024). "BJP dominates Faridabad and Palwal, wins 7 out of 9 seats" (in ఇంగ్లీష్). Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.