నీలమ్ కొఠారి

మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, నగల డిజైనర్.
(నీలం కొఠారి నుండి దారిమార్పు చెందింది)

నీలమ్ కొఠారి, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, నగల డిజైనర్. 1984లో వచ్చిన జవానీ సినిమాలో కరణ్ షా సరసన తొలిసారిగా నటించింది. లవ్ 86 (1986), ఇల్జామ్ (1986), సిందూర్ (1986), ఖుద్గర్జ్ (1987), హత్య (1988), ఫర్జ్ కి జంగ్ (1989), తాఖత్వార్ (1989), దో ఖైదీ (1989), ఆగ్ హి ఆగ్ (1987), పాప్ కి దునియా (1988), ఖత్రోన్ కే ఖిలాడీ (1988), బిల్లూ బాద్షా (1989), ఘర్ కా చిరాగ్ (1989), మిట్టి ఔర్ సోనా (1989) సినిమాలలో కూడా నటించింది.

నీలమ్ కొఠారి
నీలమ్ కొఠారి (2012)
జననం
నీలమ్ కొఠారి

1969 నవంబరు 9
వృత్తిసినిమా నటి, నగల డిజైనర్
క్రియాశీల సంవత్సరాలు1984–2001
2020–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
రిషి సేథియా
(m. 2000, వి.)

కొఠారి 1969, నవంబరు 9న శిశిర్ కొఠారి- ఇరానియన్ తల్లి పర్వీన్ కొఠారీ దంపతులకు హాంకాంగ్‌లో జన్మించింది.[1][2][3][4] చిన్నతనంలోనే కీబోర్డ్ వాయించడం నేర్చుకోవడంతోపాటు జాజ్ బ్యాలెట్ నృత్యం కూడా చేసింది. ఐలాండ్ స్కూల్‌లో చదువుకుంది. తర్వాత, కొఠారి కుటుంబం బ్యాంకాక్‌కు వెళ్ళింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

2000 అక్టోబరులో యుకెకి చెందిన ఒక వ్యాపారవేత్త కుమారుడు రిషి సేథియాతో నీలమ్ వివాహం జరిగింది.[5] వారు విడాకులు తీసుకున్నారు.[6] నటుడు సమీర్ సోనీతో కొంతకాలం రిలేషన్ లో ఉండి,[7] 2011లో అతనిని వివాహం చేసుకుంది.[8] 2013లో, వారు ఒక కుమార్తెను దత్తత తీసుకొని అహానా అని పేరుపెట్టుకున్నారు.[9]

నటనారంగం

మార్చు

ముంబైలో ఉన్నప్పుడు సినిమాలో నటించడంకోసం దర్శకుడు రమేష్ బెహ్ల్ ఆమెను సంప్రదించగా,[10] 1984లో కరణ్ షాతో కలిసి నటించడానికి జవానీ సినిమాకు సంతకం చేసింది.[11] కానీ ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించలేదు.[11]

1998లో కుచ్ కుచ్ హోతా హై సినిమాలో నటించి గుర్తింపు పొందింది. 1999లో హమ్ సాథ్ సాథ్ హై సినిమాలో సహాయక పాత్రను పోషించింది. 2001లో విడుదలైన కసమ్ సినిమాలో కూడా నటించింది.[12] 2020లో, ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్‌ వెబ్ సిరీస్ 1,2లలో నటించింది, ఈ రెండూ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయబడ్డాయి.[13][14]

నగల డిజైనింగ్

మార్చు

జ్యువెలరీ డిజైనింగ్‌పై ఆసక్తితో ఉండడంతో తన కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ముంబైలో జ్యువెలరీ-డిజైనింగ్[15] లో శిక్షణ పొందింది. 2001లో సినిమాలో నటించడం మానేసిన తర్వాత నీలమ్ జ్యువెల్స్ పేరుతో స్వంత వ్యాపారాన్ని, 2004లో ముంబై నగరంలో ఒక షోరూమ్‌ను ప్రారంభించింది.[16] 2011 ఆగస్టు 25న నీలం కొఠారి ఫైన్ జ్యువెల్స్ పేరుతో ముంబైలో మరో షోరూమ్ ప్రారంభించింది.

ఇతర వివరాలు

మార్చు

1998లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ సమయంలో కంకణిలో రెండు కృష్ణజింకలను వేటాడినందుకు, సహనటులు సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, టబుతో కలిసి నీలమ్ పై వన్యప్రాణి చట్టం, ఐపిసి అభియోగాలు మోపబడ్డాయి. 2018 ఏప్రిల్ 5న జోధ్‌పూర్‌లోని సిజెఎం కోర్టు నీలమ్ ను నిర్దోషిగా తేల్చింది.[17]

సినిమాలు

మార్చు
సంవత్సరం శీర్షిక పాత్ర ఇతర వివరాలు
1984 జవానీ సనం
1986 ఇల్జామ్ ఆర్తి
అందాజ్ ప్యార్ కా
ప్రేమ 86 ఈషా
1987 ఆగ్ హాయ్ ఆగ్ ఆర్తి
ఖుద్గర్జ్ జ్యోతి
1988 తాఖత్వార్ బిజిలీ
హత్య సప్నా
వక్త్ కి ఆవాజ్ నర్తకి, గాయకురాలు
ఘర్ మే రామ్ గలీ మే శ్యామ్ జయ
ఖత్రోన్ కే ఖిలాడీ సునీత
పాప్ కి దునియా ఆర్తి
సిందూర్ లలితా కపూర్
1989 ఘరానా లలితా
డూ ఖైదీ నీలు
ఘర్ కా చిరాగ్ కిరణ్
హమ్ భీ ఇన్సాన్ హై రేఖ
మిట్టి ఔర్ సోనా అనుపమ
1990 విష్ణు దేవా
మందిర బెంగాలీ సినిమా
బద్నాం కాజోల్ బెంగాలీ సినిమా
శంకర సీమ
దూద్ కా కర్జ్ రేష్మా
ఉపకార్ ధూధాచే రేష్మా మరాఠీ సినిమా
చోర్ పే మోర్ రీతు
అమిరి గరీబీ జ్యోతి
అగ్నిపథ్ శిక్షా చవాన్
జఖం ఆర్తి
బిల్లూ బాద్షా జ్యోతి
ఫర్జ్ కి జంగ్ కవిత
దోస్త్ గారిబోన్ కా రేఖ
1991 కసక్ దివ్య
మీట్ మేరే మన్ కే
రణభూమి నీలమ్
ఇంద్రజీత్ నీలమ్
అఫ్సానా ప్యార్ కా నికితా
1992 ఏక్ లడ్కా ఏక్ లడ్కీ రేణు/రాణి
ఖులే-ఆమ్ ప్రియా
సాహెబ్జాదే చినార్
లాత్ సాబ్ అంజు/మోనా
1993 పరంపర సప్నా
1995 సంతాన్ ఆశా
అంతిమ్ న్యాయ్ రేఖ
1996 ఏక్ థా రాజా శిల్పా
సౌదా జ్యోతి
ఆదిత్య కన్నడ సినిమా
1997 మొహబ్బత్ ఔర్ జంగ్ ప్రియా
1998 కుచ్ కుచ్ హోతా హై విజే నీలమ్ ప్రత్యేక ప్రదర్శన
1999 హమ్ సాథ్-సాథ్ హై: వి స్టాండ్ యునైటెడ్ సంగీత
2000 పత్తర్ ఔర్ పాయల్
2001 కసం బిండియా
2020–ప్రస్తుతం ఫాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ నీలమ్ రియాలిటీ సిరీస్

మూలాలు

మార్చు
  1. "Neelam Interview 1987" – via YouTube.
  2. "This Fabulous Mother of Throwbacks, Shared by Neelam Kothari".
  3. "Neelam Kothari's father passes away: 'You were my guiding light, my strength'". 14 November 2021.
  4. Tahseen, Ismat (10 January 2011). "Neelam Kothari and Samir Soni get candid about their upcoming wedding". Daily News and Analysis.
  5. Vetticad, Anna M M (6 November 2000). "Actor Neelam Kothari and beau Rishi Sethia get married in Bangkok". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-09-11.
  6. "Neelam Kothari splits with beau". Hindustan Times (in ఇంగ్లీష్). 6 November 2009. Retrieved 17 May 2018.
  7. Khera, Japleen (26 November 2020). "Neelam Kothari and Samir Soni: Marriage, Family, Kids, How Did They Meet?". The Cinemaholic. Retrieved 2022-09-11.
  8. "Samir Soni weds Neelam". Rediff. 24 January 2011.
  9. Maheshwri, Neha (2 September 2013). "Neelam and Samir Soni adopt a baby girl". The Times of India. Retrieved 2022-09-11.
  10. "NRI beauties making it big in Bollywood". window2india.com. Archived from the original on 18 January 2009. Retrieved 2022-09-11.
  11. 11.0 11.1 "Screen the Business of Entertainment-Films-Cover Story". Archived from the original on 22 October 2008. Retrieved 2022-09-11.
  12. "We had loads to sort out before marriage: Neelam". The Times of India.
  13. "Fabulous Lives of Bollywood Wives review: All bark no bite, this desi Netflix show fails to get even trash TV right". Hindustan Times (in ఇంగ్లీష్). 28 November 2020. Retrieved 2022-09-11.
  14. Bureau, ABP News (3 March 2021). "'Fabulous Lives of Bollywood Wives' To Return With Second Season On Netflix, Fans Wish To See SRK-Gauri Again On Show". ABP Live (in ఇంగ్లీష్). Retrieved 2022-09-11.
  15. "Top 15 Jewellery Designers In India You Must Know". Jewellery Craze. 11 July 2017. Archived from the original on 2021-06-10. Retrieved 2022-09-11.
  16. "Spotlight - Neelam Jewels". verveonline.com. Archived from the original on 1 March 2009.
  17. "Blackbuck case: Jodhpur HC adjourns hearing against Saif, Sonali, Tabu, Neelam after issuing fresh notice in May". The Economic Times.

బయటి లింకులు

మార్చు