నీలాయపాలెం
నీలాయపాలెం బాపట్ల జిల్లా చినగంజాం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
నీలాయపాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°39′31.284″N 80°11′4.704″E / 15.65869000°N 80.18464000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | చినగంజాం |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 523181 |
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు, దేవాలయాలు
మార్చుశ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- నీలాయపాలెం గ్రామ పొలిమేరలో వెలసిన ఈ ఆలయంలో, 2015, మే24వ తేదీ ఆదివారంనాడు, శ్రీ శ్రీనివాస కళ్యాణం, కన్నులపండువగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన వేదపండితుల ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలను చేపట్టినారు. తిరుమల నుండి తెచ్చిన దేవేరుల విగ్రహాలను ప్రత్యేకపూలమాలలతో అలంకరించారు. తిరుమలలో శ్రీవారికి చేసినట్లుగానే కళ్యాణ మహ్ఫోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. హోమపూజలు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం, తిరుమలనుండి తెచ్చిన ప్రత్యేక మాలలను, తలంబ్రాలను భక్తులకు అందజేసినారు. పొలాల మధ్య, పొలిమేర ప్రాంతములో ఉన్న ఆలయమైననూ, మండుటెండలను గూడా లెక్కచేయక, భక్తిశ్రద్ధలతో, భక్తులు ఎక్కువసంఖ్యలో, ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. చినగంజాము, ఇంకొల్లు, నీలాయపాలెం, ఉప్పుగుండూరు మదలైన గ్రామాలనుండి గూడా భక్తులు విచ్చేసి, శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి పులకించిపోయినారు. ఈ సందర్భంగా, ఆలయ కమిటీవారు భక్తుల దాహార్తి తీర్చడానికి చల్లని మజ్జిగ అందజేసినారు. కళ్యాణ మహోత్సవం అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ చేసారు. [1]
గ్రామంలో ప్రధాన పంటలు
మార్చువరి. అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు