చినగంజాము

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మండలం


చినగంజాము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామం.[1]., మండలం.

చినగంజాము
రెవిన్యూ గ్రామం
చినగంజాము is located in Andhra Pradesh
చినగంజాము
చినగంజాము
నిర్దేశాంకాలు: 15°41′35″N 80°14′26″E / 15.693°N 80.2405°E / 15.693; 80.2405Coordinates: 15°41′35″N 80°14′26″E / 15.693°N 80.2405°E / 15.693; 80.2405 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంచినగంజాము మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం4,308 హె. (10,645 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం19,060
 • సాంద్రత440/కి.మీ2 (1,100/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08594 Edit this at Wikidata)
పిన్(PIN)523135 Edit this at Wikidata

గ్రామ చరిత్రసవరించు

ఈ గ్రామ సమీపంలోని కొమ్మమూరు కాలువ వద్ద అనేక బౌద్ధ ఆనవాళ్ళు కనబడినవి. ఇటీవల రెండు ఎకరాలస్థలంలో త్రవ్వకాలు కొనసాగినవి. బొద్ధభిక్షువులకోసం పలకరాళ్ళతో నిర్మించిన విహారాలు ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ మూడు చిన్న చిన్న స్థూపాలు వెలికి తీసినారు. వీటి నిర్మాణానికి పూర్తిగా ఇటుకలే వాడినారు. బుద్ధ విగ్రహం, మట్టికుండలు, పాళీభాషలో వ్రాసిన శాసనాలు లభించినవి. ఇంకా త్రవ్వకాలు జరపవలసి ఉంది. [4]

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

దీనికి గంధపురి అనే పేరు కూడా ఉంది.

గ్రామ భౌగోళికంసవరించు

 

  1. చీరాల - ఒంగోలు రాష్ట్ర రహదారిలోని ఈ సముద్ర తీర గ్రామం, ముఖ్యంగా ఉప్పు తయారీకి ప్రసిద్ధి.
  2. గుండ్లకమ్మ నది ఇక్కడే బంగాళా ఖాతములో కలుస్తుంది. చారిత్రకమైన మోటుపల్లె రేవు ఇక్కడికి 12 కి.మీ.ల దూరములో ఉంది.

సమీప గ్రామాలుసవరించు

కడవకుదురు 3.7 కి.మీ, పెదగంజాం 5.2 కి.మీ, సంతరావూరు 7.1 కి.మీ, గొనసపూడి 7.5 కి.మీ, పుల్లరిపాలెం 7.5 కి.మీ.

సమీప పట్టణాలుసవరించు

వేటపాలెం 11.6 కి.మీ, నాగులుప్పలపాడు 16.8 కి.మీ, ఇంకొల్లు 17.3 కి.మీ.

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

ఇది విజయవాడ-చెన్నై రైలుమార్గంలోని ఒక రైల్వే స్టేషన్.

గ్రామంలోని మౌలిక వసతులుసవరించు

బ్యాంకులుసవరించు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో స్వామివారి తిరునాళ్ళు, ఫాల్గుణ పౌర్ణమి, గురువారం రాత్రి వైభవంగా నిర్వహించారు. తిరునాళ్ళ సoదర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందముగా అలంకరించారు. భక్తులు ప్రత్యేక ఆకుపూజా కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్తు ప్రభ కట్టినారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. తెల్లవారుఝాము వరకు సాగిన వీరబ్రహ్మేంద్రస్వామి నాటకాన్ని భక్తులు ఉత్సాహంగా తిలకించారు. ఈ తిరునాళ్ళకు చినగంజాం, కొత్తపాలెం గ్రామాల నుండి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఆలయ కమిటీ వారు త్రాగునీరు, తదితర సౌకర్యాలు కలుగజేసినారు.

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 18,358.[2] ఇందులో పురుషుల సంఖ్య 9,099, మహిళల సంఖ్య 9,259, గ్రామంలో నివాస గృహాలు 4,356 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 4,308 హెక్టారులు.

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
"https://te.wikipedia.org/w/index.php?title=చినగంజాము&oldid=3063374" నుండి వెలికితీశారు