ఉప్పుగుండూరు
ఉప్పుగుండూరు ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నాగులుప్పలపాడు నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఒంగోలు నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2459 ఇళ్లతో, 9060 జనాభాతో 1197 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4584, ఆడవారి సంఖ్య 4476. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2512 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1276. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 591045[2].ఈ గ్రామం విజయవాడ-చెన్నై రైలు మార్గంలోని ఒక రైల్వే స్టేషన్.
ఈ గ్రామం ఒంగోలు నుంచి సుమారు 27 కిలోమీటర్ల దూరంలో 216 జాతీయ రహదారిలో కలదు.
ఉప్పుగుండూరు | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 15°40′22.800″N 80°10′1.200″E / 15.67300000°N 80.16700000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | నాగులుప్పలపాడు |
విస్తీర్ణం | 11.97 కి.మీ2 (4.62 చ. మై) |
జనాభా (2011)[1] | 9,060 |
• జనసాంద్రత | 760/కి.మీ2 (2,000/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 4,584 |
• స్త్రీలు | 4,476 |
• లింగ నిష్పత్తి | 976 |
• నివాసాలు | 2,459 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08592 ) |
పిన్‌కోడ్ | 523186 |
2011 జనగణన కోడ్ | 591045 |
గ్రామ చరిత్ర
మార్చుఉప్పుగుండూరుకు, చిన్నగంజాం గ్రామాల సరిహద్దులో 1960లో ఒక బౌద్ధక్షేత్రాన్ని త్రవ్వకాలలో కనుగొన్నారు.[3] ఇక్కడ మూడవ శతాబ్దానికి చెందిన ఇక్ష్వాకు వంశపు రాజు పురుషదత్తుని బ్రాహ్మీ లిపిలో వ్రాసిన ప్రాకృత శాసనం కూడా ఒకటి లభించింది.[4] ఈ శాసనం ఒక వణిజ సంఘం ఇక్కడ మహా విహారాన్ని నిర్మింపజేయటం ప్రస్తావించబడింది. ఉప్పుగుండూరు బౌద్ధ క్షేత్రం నాగార్జున కొండ శైలిలో నిర్మించబడి ఉంది.[5]
సమీప గ్రామాలు
మార్చురాచపూడి 5 కి.మీ, ఈదుమూడి 6 కి.మీ, కండ్లగుంట 6 కి.మీ, పోతవరం 6 కి.మీ, మాచవరం 6 కి.మీ.
గ్రామ పంచాయతీ
మార్చు2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ మసిముక్కు పెద్దబ్బాయి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ మక్కెన బాబూరావు ఎన్నికైనారు. [4]
దర్శనీయ ప్రదేశాలు/దేవాయాలయాలు
మార్చుశ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం
మార్చుఈ ఆలయంలో ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్టి వైభవంగా నిర్వహించెదరు. ఆ రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు స్వామివారికి అభిషేకాలు, కళ్యాణం, గ్రామోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహించెదరు.
శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆళ్వారుల ఆలయం
మార్చుఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, వైశాఖ శుక్ల త్రయోదశి నుండి నిర్వహించెదరు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించెదరు. స్వామివారి రథోత్సవం, గ్రామోత్సవం గూడా నిర్వహించెదరు. తరువాత వసంతసేవ, చక్రతీర్ధం, పవళింపుసేవ తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించెదరు. [9]
ఈ ఆలయనికి 45.45 ఎకరాల మాన్యం భూమి ఉంది.
శ్రీ గంగా గౌరీశ్వరీ దేవాలయం
మార్చుకేవలం పంచారామములో మాత్రం కనిపించే తెల్లని శివలింగం ఈ ఆలయంలో ఉంది. ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏమిటనగా, ఆలయం లోపల స్వామివారి లింగస్వరూపానికి ముందు ఒక చిన్న నంది ఉంటే, ఆలయం వెలుపల, మరొక పెద్ద నందీశ్వరుడు కదలటానికి సిద్ధంగా ఉన్నట్లు మనల్ని పిలుస్తుంటాడు.
ఐదు అడుగుల లింగం
మార్చుప్రస్తుతం మనకు సుమారు ఐదు అదుగుల ఎత్తయిన తెల్లటి లింగరూపం దర్శనమిస్తుంది. స్థానికుల కథనం ప్రకారం, భూమిలో 8 అడుగుల లోతులో మరియొక లింగమూరి ఉన్నట్లు, ఈయన స్వయంభూగా వెలిశాడని చెబుతారు. మరియొక విశేషంగా, గంగాదేవి, పార్వతీదేవి స్వామివారికి చెరియొక వైపునా ఉన్న లఘు ఆలయాలలో వెలసియుండటం. ఈ విధంగా గంగాదేవికి గూడా విగ్రహం కల్పించటం ఇక్కడి విశిష్టత.
శ్రీరామ మందిరం
మార్చుఉప్పుగుండూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ సీతా, లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామివారల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2017, మార్చి-13వతేదీ సోమావారంనాడు ప్రత్యేకపూజలు నిర్వహించారు. 14వతేదీ మంగళవారం ప్రతిష్ఠా విగ్రహాల గ్రామోత్సవం, ప్రతిష్ఠా విగ్రహాల గ్రామోత్సవం, ప్రత్యేకపూజలు, 15వతేదీ బుధవారం ఉదయం 10-12 కి తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆగమ పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ, అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
శ్రీ అంకమ్మ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయం
మార్చుఈ ఆలయంలో 2014, ఆగస్టు-8, రెండవ శ్రావణ శుక్రవారం నాడు, 108 మంది ముత్తయిదువులతో, వరలక్ష్మీ వ్రతం నిర్వహించెదరు.
శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం
మార్చుఈ ఆలయం ప్రసిద్ధి గావించింది. ఈ ఆలయ 31వ వార్షికోత్సవం 2017, మార్చి-12వతేదీ ఆదివారం, (హోలీ రోజున) వైభవంగా నిర్వహించుచున్నారు.
శ్రీ కొండపాటి పోలేరమ్మ తల్లి ఆలయం
మార్చుఈ అమ్మవారి ఆలయంలో వార్షిక తిరునాళ్ళ పొంగళ్ళను, 2017, ఏప్రిల్-19వతేదీ, శ్రీ హేవళంబినామ సంవత్సరం, చైత్ర బహుళ అష్టమి, బుధవారంనాడు వైభవంగా నిర్వహించారు. రాత్రికి విద్యుత్తు ప్రభను ఏర్పాటుచేసి, అమ్మవారికిగ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం
మార్చుఈ గ్రామంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాలు, ప్రతి సంవత్సరం, వైశాఖ శుక్ల దశమి నాడు వైభవంగా నిర్వహించెదరు.
శ్రీ షిర్డీ సాయి సేవాశ్రమం
మార్చుఈ ఆశ్రమప్రాంగణంలో 100 అడుగుల సాయికోటి మహాస్తూపం నిర్మాణానికి, 2015, జూన్-11వ తేదీ గురువారంనాడు, భూమిపూజ నిర్వహించారు. ఒకటిన్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ స్తూపంలో 50 అడుగుల స్తూపం, 50 అడుగుల విగ్రహం ఏర్పాటుచేసెదరు. 70 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సాయి సేవాశ్రమానికి, ఈ సాయికోటి మహాస్తూపంతో మరింత విశిష్టత ఏర్పడగలదు.
శ్రీ రామకృష్ణ ధ్యానమందిరం
మార్చుగ్రామంలోని వివేకానంద సేవా సమితి 22వ వార్షికోత్సవం సందర్భంగా, గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ భవనాన్ని, 2016, ఫిబ్రవరి-2న ప్రారంభించారు.
గ్రామ విశేషాలు
మార్చు- ఇటీవల Khammam Photo Arts Oraganisation ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో జరిగిన ఫొటోగ్రఫీ పోటీలలో, ఉప్పుగుండూరుకి చెందిన ఫొటో జర్నలిష్టు శ్రీ కె.యుగంధర్ బంగారు పతకం అందుకున్నారు. "మనోక్రోం విభాగంలో గిరిజన కళాకారులు" అను ఛాయాచిత్రానికి ఈయన ఈ బహుమతిని, 2-12-2013న ఖమ్మం జిల్లా కలెక్టరుగారి చేతులమీదుగా అందుకున్నారు. ప్రఖ్యాత pictorial photographer రాజన్ బాబు గ్నాపకార్ధం ఈ పోటీ ఏర్పాటు చేశారు.
- ఈ గ్రామానికి చెందిన శ్రీ ఉప్పుగుండూరి శ్రీనివాసరావు, ప్రముఖ రంగస్థల కళాకారుడు. బుర్రకథ, తోలుబొమ్మలాట కళాకారుడిగా ప్రభుత్వ పథకాల ప్రచారకర్తగా 5 దశాబ్దాలపాటు కళారంగానికి సేవలందించారు. ఇటీవల ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన "బంగారుతల్లి" ప్రచారకర్తగా బుర్రకథ రూపంలో ప్రజలలోకి తీసుకొనివెళ్ళారు. వీరు 2014, ఫిబ్రవరి-15న పరమపదించారు.
గణాంకాలు
మార్చు2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9,055. ఇందులో పురుషుల సంఖ్య 4,656, మహిళల సంఖ్య 4,399, గ్రామంలో నివాస గృహాలు 2,221 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,197 హెక్టారులు.
విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మద్దిరాలపాడులోను, ఇంజనీరింగ్ కళాశాల ఒంగోలులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్ ఒంగోలులోను, మేనేజిమెంటు కళాశాల చేకూరుపాడులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలులో ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల -ఈ పాఠశాలలో చదువుచున్న పొట్లూరి సుప్రియ అను విద్యార్థిని, నేషనల్ స్కూల్ గేంస్ లో జాతీయస్థాయికి ఎంపికైనది. ఈమె 2016, జనవరి-4,5 తేదీలలో మహారాష్ట్రలో నిర్వహించే వాలీబాల్, టెన్నిస్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున పాల్గొంటుంది. ఈ పాఠశాల వార్షికోత్సవం 2016, ఫిబ్రవరి-26న ఘనంగా నిర్వహించారు.
- ఆర్.వి.వి.ఉన్నత పాఠశాల
- మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల
- రాఘవేంద్ర కాలనీ.
- రోజ్ రెసిడెన్షియల్
వైద్య సౌకర్యం
మార్చుప్రభుత్వ వైద్య సౌకర్యం
మార్చుఉప్పుగుండూరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.
సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
మార్చుగ్రామంలో10 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు 8 మంది ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
తాగు నీరు
మార్చుగ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
మార్చుమురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
మార్చుఉప్పుగుండూరులో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండిప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
మార్చుగ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
మార్చుగ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
విద్యుత్తు
మార్చుగ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 20 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
మౌలిక సదుపాయాలు
మార్చుబ్యాంకులు
మార్చు- ఆంధ్రా బ్యాంకు.
- ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు.
- ది ప్రకాశం జిల్లా కేంద్ర సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్.
సాగు/త్రాగునీటి సౌకర్యం
మార్చుఎత్తిపోతల పథకం:- ఈ పథకానికి ప్రధాన నీటి వనరు కొమ్మమూరు కాలువ.
భూమి వినియోగం
మార్చుఉప్పుగుండూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 209 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 987 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 971 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 15 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
మార్చుఉప్పుగుండూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- బావులు/బోరు బావులు: 14 హెక్టార్లు
- ఇతర వనరుల ద్వారా: 1 హెక్టార్లు
ఉత్పత్తి
మార్చుఉప్పుగుండూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ Journal of Indian history Dept. of Modern Indian History, 1965 - History
- ↑ An encyclopaedia of Indian archaeology By Amalananda Ghosh
- ↑ South Asian archaeology, 1995