నీలు వాఘేలా

రాజస్థాన్ కు చెందిన సినిమా నటి, నర్తకి

నీలు వాఘేలా, రాజస్థాన్కు చెందిన సినిమా నటి, నర్తకి. రాజస్థానీ సినిమాలలో, టీవి సీరియళ్ళలో నటించింది. దియా ఔర్ బాతీ హమ్, తూ సూరజ్, మెయిన్ సాంజ్ లలో నటించి ప్రసిద్ధి చెందింది. రాజస్థానీ సినిమాలను నిర్మించే అరునీల్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది.[1]

నీలు వాఘేలా
జననం (1970-04-15) 1970 ఏప్రిల్ 15 (వయసు 54)
వృత్తినటి, నర్తకి
క్రియాశీల సంవత్సరాలు1981–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅరవింద్ కుమార్
పిల్లలు2

నీలు వాఘేలా 1970 ఏప్రిల్ 15న రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో జన్మించింది.[2][3]

వ్యక్తిగత జీవితం

మార్చు

నటుడు అరవింద్ కుమార్‌తో నీలు వాఘేలా వివాహం జరిగింది. వారికి ఒక అబ్బాయి (కైజర్), కుమార్తె (వంశిక) ఉన్నారు.[4]

నటనారంగం

మార్చు

నీలూ వాఘేలా నాటకరంగం ద్వారా తన నట జీవితాన్ని ప్రారంభించింది. 1981లో 11 సంవత్సరాల వయస్సులో సుపత్తర్ బినానిలో నటించింది. హిందీలో సాజన్ కా ఘర్ పేరుతో పునర్నిర్మించబడిన బాయి చాలీ ససరియాలో కూడా నటించింది.

రామ్‌గర్ రి రామ్లీ, జై కర్ణి మాత, నైనీ బాయి రో మేరో, లాంచా గుజ్రీ, దేరానీ జేతాని, రామ్‌కుడి ఘమకుడి, బైసా రా జతన్ కరో, దాదోసరి లాడ్లీ, వీర్ తేజాజీ, బాయి చలి ససారియే వంటి చిత్రాలలో కూడా నటించింది.[5]

స్టార్ ప్లస్ లో వచ్చిన దియా ఔర్ బాతీ హమ్‌లో భాభో పాత్రలో నటించిన తర్వాత వాఘేలా ఇంటి పేరుగా మారింది. ఆ తర్వాత ఆమె తన భర్త అరవింద్ కుమార్‌తో కలిసి నాచ్ బలియే 5 అనే డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొంది. 2013 మార్చి 23న, వాఘేలా, ఆమె భర్త నాచ్ బలియే ఐదవ సీజన్‌లో 3వ స్థానంలో నిలిచారు.

టెలివిజన్

మార్చు
సంవత్సరం కార్యక్రమం పాత్ర ఇతర వివరాలు
2011 – 2016 దియా ఔర్ బాతీ హమ్ సంతోష్ అరుణ్ రాఠీ అకా భాభో [6]
2012 – 2013 నాచ్ బలియే 5 పోటీదారు భర్త అరవింద్ కుమార్ తో[7]
2013 మేరీ మా హోస్ట్ స్టార్ ప్లస్ మదర్స్ డే స్పెషల్[8]
2017 – 2018 తు సూరజ్, మెయిన్ సాంజ్ పియాజీ సంతోష్ అరుణ్ రాఠీ అకా భాభో [9][10]
2018–2019 మైన్ మైకే చలి జౌంగీ తుమ్ దేఖ్తే రహియో సత్య దేవి [11][12]
2020 షాదీ ముబారక్ బువా [13]
2020–2021 ఆయ్ మేరే హమ్సఫర్ ప్రతిభా దేవి [14]
2021-2022 పవిత్ర: భరోసే కా సఫర్ ఉమా ఠాకూర్ [15]

సినిమాలు

మార్చు
  • రామ్‌గర్ రి రామ్లీ
  • జై కర్ణి మాత
  • నైనీ బాయి రో మేరో
  • బాబా జీ కా తుల్లు
  • దేరని జేతాని
  • ధరంభాయ్
  • రామకుడి ఘమకుడి
  • బినాని
  • బైసా రా జాతన్ కరో
  • దాదోసరి లాడ్లీ
  • వీర్ తేజాజీ
  • బాయి చలి ససరియే
  • నానాద్ భోజై
  • సుపత్తర్ బినాని
  • లాడో థారో గావ్ బడో ప్యారో[16]
  • బినాని
  • జాత్ని
  • బాబా రామ్‌దేవ్

మూలాలు

మార్చు
  1. Saloni Bhatia, "Raj film queen on telly", Daily Pioneer, 4 February 2012
  2. "SBS Special: Neelu Vaghela celebrates her birthday and spends a day with SBS". Abp Live. 16 April 2019. Archived from the original on 17 ఏప్రిల్ 2019. Retrieved 7 ఫిబ్రవరి 2023.
  3. "Diya Aur Baati Hum's Bhabho Aka Neelu Vaghela's Special Birthday Gift". 16 April 2015.
  4. "Neelu Vaghela: Today's life situations teaches you to go away from your relatives - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-02-07.
  5. "50 फिल्मों से भी नहीं मिली पहचान, यूं मशहूर हुई". www.patrika.com. Archived from the original on 2021-01-08. Retrieved 2023-02-07.
  6. "Is Neelu Vaghela quitting Diya Aur Baati Hum?". Times of India.
  7. "I get all my energy from my kids: Neelu Vaghela". Times of India.
  8. "TV stars to celebrate Mother's Day with real-life moms". India Today.
  9. Razzaq, Sameena (2017-02-22). "Bhabho is back for round two in TV". The Asian Age. Retrieved 2023-02-07.
  10. "A day out with Bhabho aka Neelu Vaghela". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-02-07.
  11. "Bhabho aka Neelu Vaghela to make a comeback in a different avatar". India Today (in ఇంగ్లీష్). August 2, 2018. Retrieved 2023-02-07.
  12. "Ashok Lokhande and Neelu Vaghela to play exes on 'Main Maayke Chali Jaaungi' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-02-07.
  13. "Rajshree Thakur seeks inspiration from veteran actress Neena Gupta for her upcoming role as Preeti Jindal in 'Shaadi Mubarak'". The Times of India.
  14. "Neelu Vaghela: 'Namish Taneja calls me 'maa' on the sets, and is always up for feedbacks'". The Times of India.
  15. Service, Tribune News. "Neelu Vagela, who will be seen in the show Pavitraa Bharose Ka Safar, talks about her journey so far". Tribuneindia News Service.
  16. "Neelu Vaghela In Rajasthani Movie, Lado Tharo Gaon Bado Pyaro - Rajasthani Scene 4/15". YouTube.

బయటి లింకులు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నీలు వాఘేలా పేజీ