నువ్వలా నేనిలా
త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో 2014లో విడుదలైన తెలుగు చలనచిత్రం
నువ్వలా నేనిలా 2014, ఆగస్టు8న విడుదలైన తెలుగు చలనచిత్రం. అమోగ్ క్రియేషన్స్ పతాకంపై ఇందూరి రాజశేఖర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, పూర్ణ జంటగా నటించగా, సాయికార్తీక్ సంగీతం అందించాడు.[2] త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వరుణ్ సందేశ్ నటించిన రెండవ చిత్రమిది. 2013, ఫిబ్రవరి 13న చిత్రీకరణ ప్రారంభమైంది.[3]
నువ్వలా నేనిలా | |
---|---|
దర్శకత్వం | త్రినాధరావు నక్కిన |
నిర్మాత | ఇందూరి రాజశేఖర్ రెడ్డి |
తారాగణం | వరుణ్ సందేశ్ పూర్ణ |
ఛాయాగ్రహణం | జ్ఞానశేఖర్ వి.ఎస్. |
సంగీతం | సాయికార్తీక్ |
నిర్మాణ సంస్థ | అమోగ్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | ఆగస్టు 8, 2014[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- వరుణ్ సందేశ్ (కృష్ణ మోహన్)
- పూర్ణ (మహాలక్ష్మీ)
- సన
- శ్రీధర్
- ధన్రాజ్
- సోనియా బిర్జి
- ఉత్తేజ్
- వెన్నెల కిషోర్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
- నిర్మాత: ఇందూరి రాజశేఖర్ రెడ్డి
- సంగీతం: సాయికార్తీక్
- ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్ వి.ఎస్.
- నిర్మాణ సంస్థ: అమోగ్ క్రియేషన్స్
పాటలు
మార్చుక్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "మనసే మనసుని పట్టి" | రంజిత్ | 3:55 |
2. | "నీ వల్లే" | టిప్పు, కళ్యాణి | |
3. | "మనసులో మాటని" | సాహితి గాలిదేవర, సాయి కార్తీక్, దినకర్ | |
4. | "నువ్విలా నేనిలా" | సాయి కార్తీక్ | |
5. | "ఏ జిందగీ" | సాయి కార్తీక్, శ్రీ సౌమ్య |
నిర్మాణం
మార్చుఈ చిత్రాన్ని హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభించారు. సంపత్ నంది, మురళీమోహన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఫిబ్రవరి 18న ఈ చిత్ర రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై, మూడు షెడ్యూల్‌లలో పూర్తవుతుందని త్రినాధరావు చెప్పాడు.[4][5]
మూలాలు
మార్చు- ↑ "నువ్వలా నేనిలా: రివ్యూ". APHerald [Andhra Pradesh Herald]. Retrieved 17 August 2020.
- ↑ "Varun Sandesh - Purna to star in Nuvvalaa Nenila". idlebrain.com. Retrieved 17 August 2020.
- ↑ "Varun Sandeh's next is Nuvvala Neenila". 123telugu.com. Retrieved 17 August 2020.
- ↑ "Varun Sandesh's Nuvvala Nenila set to go on floors soon". 123telugu.com. Retrieved 17 August 2020.
- ↑ "Nuvvala Nenila Telugu Movie Photos". www.cinespot.net. Retrieved 17 August 2020.