పూర్ణ (అసలు పేరు షామ్నా కాసిం) ఒక భారతీయ సినీ నటి, మోడల్. ఆమె శాస్త్రీయ నృత్య కళాకారిణికి తన కెరీర్ ను ప్రారంభించి తరువాత సినీ రంగంలోకి ప్రవేశించింది. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ సినిమాలు అవును, అవును 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

పూర్ణ
జననం
షమ్నా ఖాసీమ్‌

(1989-05-23) 1989 మే 23 (వయసు 35)[1]
ఇతర పేర్లుచిన్నాటీ
వృత్తినటి, నర్తకి
క్రియాశీల సంవత్సరాలు2004–ప్రస్తుతం
జీవిత భాగస్వామిషానిద్‌ అసిఫ్‌ అలీ
పిల్లలుకుమారుడు
తల్లిదండ్రులుకాసిం, రమ్లా బీవీ

వ్యక్తిగత జీవితం

మార్చు

పూర్ణ కేరళ లోని కానూరు లో కాసిం, రమ్లా బీవీ అనే ముస్లిం దంపతులకు జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఐదు మంది సంతానం. అందరిలోకి ఈమె చిన్నది. ఆమె అసలు పేరు షామ్నా. సినీ రంగంలోకి ప్రవేశించిన తర్వాత ఆమెను పూర్ణ అని పిలవడం ప్రారంభించారు. కానూరులోని ఉర్సులీన్ సీనియర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యనభ్యసించింది. నృత్యంలో శిక్షణ కోసం సెయింట్ థెరీసా పాఠశాలలో తీసుకున్నది. తర్వాత కరెస్పాండెంస్ ద్వారా ఆంగ్లంలో బి.ఏ కూడా చేసింది.[2] ప్రస్తుతం ఆమె కేరళలోని కోచిలో నివసిస్తున్నది.

జె బి ఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్ షనీద్‌ అసిఫ్‌ ఆలీతో తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని, త్వరలోనే పెళ్ళిచేసుకోబోతున్నాని అధికారికంగా 2022 జూన్ 1న వెల్లడించింది.[3] పూర్ణ దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త షనీద్‌ అసిఫ్‌ ఆలీని 2022 అక్టోబర్ 25న వివాహం చేసుకుంది.[4]

కెరీర్

మార్చు

ఆమె ఒక శాస్త్రీయ నర్తకి. అమృత టివిలో ప్రసారమైన సూపర్ డ్యాన్సర్ అనే నృత్య పోటీల్లో పాల్గొనడం ద్వారా మాధ్యమాల దృష్టిని ఆకర్షించింది.[5] 2004 లో మలయాళ చిత్రం మంజు పొలోరు పెంకుట్టి ద్వారా తన ప్రస్థానం ఆరంభించింది. తరువాత రెండు మూడు సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించింది. కానీ అవి పెద్దగా ఆడలేదు. తెలుగులో ఆమె మొదటి సినిమా శ్రీ మహాలక్ష్మి. తర్వాత తమిళంలో కూడా ఓ సినిమాలో కథానాయికగా నటించింది.[6]

2010లో ఆమె వరుసగా కొన్ని దయ్యం సినిమాల్లో నటించింది. ది హిందూ పత్రిక ఆమెను ది ఘోస్ట్ క్వీన్ ఆఫ్ తెలుగు ఫిలింస్ అని ఉటంకించింది. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అవును (2012) సినిమాలో, 2014 లో వచ్చిన అవును 2 లో ఆమె నటనకు గాను విమర్శకుల ప్రశంసలందుకుంది.[7] తర్వాత ఆమెకు నిర్మాతలు అలాంటి పాత్రల్లోనే నటించమని అడిగారు కానీ ఆమె వాటిలో చాలా వాటిని తిరస్కరించింది. కానీ 2015 లో వచ్చిన రాజు గారి గది సినిమాలో కూడా ఆమెకు దయ్యం పాత్ర పోషించింది. ఆ పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది.[7]

సినిమాలు

మార్చు
 
సినిమా ముహూర్త కార్యక్రమంలో క్లాప్ ఇస్తున్న సినీ దర్శకుడు దాసరి నారాయణరావు
 
సినీ దర్శకుడు దాసరి నారాయణరావుతో అవంతిక చిత్ర బృందం

మూలాలు

మార్చు
  1. Reel moves - Thiruvananthapuram. The Hindu (21 April 2012). Retrieved on 30 December 2015.
  2. തെന്നിന്ത്യയുടെ പൂർണയായി മലയാളത്തിന്റെ സ്വന്തം ഷംന കാസിം | മലയാളം ഇ മാഗസിൻ.കോം Archived 2015-01-03 at the Wayback Machine. Malayalam Online magazine (12 January 2013).
  3. "షానిద్ అసిఫ్ ఆలీతో - న‌టి పూర్ణ ఎంగేజ్మెంట్ | Prabha News". web.archive.org. 2022-06-01. Archived from the original on 2022-06-01. Retrieved 2022-06-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "దుబాయ్‌లో ఘనంగా నటి పూర్ణ వివాహం.. ఫొటోలు వైరల్‌..!". 25 October 2022. Archived from the original on 25 October 2022. Retrieved 25 October 2022.
  5. "ചട്ടക്കാരി മനസ്സുതുറക്കുന്നു". mathrubhumi.com. 28 September 2012. Archived from the original on 15 డిసెంబరు 2013. Retrieved 15 నవంబరు 2016.
  6. "Gopika doesn't want to get old". 17 May 2008. Archived from the original on 20 October 2012. Retrieved 17 September 2008.
  7. 7.0 7.1 Search for variety: Poorna. The Hindu (21 November 2015). Retrieved on 30 December 2015.
  8. సాక్షి, సినిమా (7 September 2018). "'సిల్లీ ఫెలోస్‌‌' మూవీ రివ్యూ". Archived from the original on 7 September 2018. Retrieved 6 June 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=పూర్ణ&oldid=4150205" నుండి వెలికితీశారు