నెక్నాంపూర్ చెరువు
ఇబ్రహీం బాగ్ చెరువు అని కూడా పిలువబడే నెక్నాంపూర్ చెరువు భారతదేశంలోని హైదరాబాదులో ఉన్న ఒక చెరువు. ఇది ఒకప్పుడు నీటి రిజర్వాయర్ నెట్వర్క్ లో భాగంగా ఉండేది, దీనిని నీటిపారుదల కోసం, చుట్టుపక్కల ప్రాంతాలలో తాగునీటిని అందించడానికి ఉపయోగించేవారు. హైదరాబాదు నగర శివారులోని గండిపేట మండలం నెక్నాంపూర్ గ్రామంలో సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో ఉంది
చరిత్ర
మార్చుఈ చెరువును మొదట 16వ శతాబ్దం చివరలో గోల్కొండ నాల్గవ పాలకుడు ఇబ్రహీం కుతుబ్ షా తవ్వారు, ఆ తరువాత అతని మనవడు అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో నిండుకుండను తలపింపచేసాడు. ఈ నిర్మాణాన్ని షా సభికులలో ఒకరైన నెక్నామ్ ఖాన్ కు అప్పగించారు. ప్రక్కనే ఉన్న మూసీ నుండి నీటిని ఉపయోగించే బదులు, గోల్కొండ కోట వెనుక ఉన్న నీటి వనరుల నుండి చెరువును నింపడానికి నెక్నామ్ ఖాన్ కాలువలను తవ్వించాడు.[1][2] ఇబ్రహీంపట్నం చెరువు, హుస్సేన్సాగర్ లతో పాటు కులీ కుతుబ్ షా పాలనలో సృష్టించబడిన మూడు ప్రధాన చెరువులలో నెక్నాంపూర్ చెరువు ఒకటి.[3] చుట్టుపక్కల గృహ కాలనీల నుండి మురుగునీటిని పారవేయడానికి ఈ చెరువును ఉపయోగించాలని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రతిపాదన చేసింది. ఈ చెరువును నేడు రెండు భాగాలు చిన్న చెరువు, పెద్ద చెరువుగా విభజించబడింది. చిన్న చెరువు పాక్షికంగా పునరుద్ధరించబడింది, సుందరమైన ప్రదేశంగా మార్చబడింది, అయితే పెద్ద చెరువు కాలుష్యంతో పోరాడుతూనే ఉంది.[4] ఈ చెరువులో వివిధ రసాయనాలు కలుస్తున్నాయి, దాని చుట్టూ ఉన్న వివిధ నివాస కాలనీలు చెత్తను పారవేసేందుకు కూడా ఉపయోగిస్తారు.[2] చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను ప్రభుత్వ అధికారులు కూల్చివేశారు. అయితే ఈ నిర్మాణాలను ఆక్రమణదారులు చట్టవిరుద్ధంగా పునర్నిర్మిస్తున్నారు. [5]
పునరుద్ధరణ ప్రయత్నాలు
మార్చుఈ చెరువును క్రమంగా భూ కబ్జాదారులు ఆక్రమించి, నిర్మాణ శిధిలాలు, చెత్త, మురుగునీటితో డంప్ యార్డ్ గా మార్చారు. ఒక దశలో, చెరువు ఉపరితల వైశాల్యం 25 ఎకరాల కంటే తక్కువగా ఉండేది. హైదరాబాదు కేంద్రంగా ఉన్న ఎన్జీఓల సహాయంతో 2016లో ఈ చెరువును పునరుద్ధరించే ప్రయత్నాలు జరిగాయి. చెరువు పునరుద్ధరణలో భాగంగా చెరువును శుభ్రపరచడం కోసం మొక్కల ద్వారా, సూక్ష్మజీవుల ద్వారా కలుషితాలను తొలగించారు. నీతి ఆయోగ్ ఈ ప్రయత్నాలను గుర్తించింది. "ఇది దేశంలో 'ఉత్తమ పునరుద్ధరణ పద్ధతులకు' రోల్ మోడల్గా గుర్తించబడింది". నెక్నాంపూర్ చెరువు పునరుద్ధరణ "భారతదేశంలో నాలుగు ఇతర ప్రాజెక్టులతో పాటు 'పరీవాహక అభివృద్ధి' విభాగంలో రోల్ మోడల్గా గుర్తింపు పొందింది".[6] నీతి ఆయోగ్ ప్రకారం, చెరువు బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD)లో 90% తగ్గింపు ఉంది.[7] సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సిఎస్ఇ) కూడా నెక్నాంపూర్ చెరువును "భారతదేశంలో చెరువు పునరుద్ధరణకు ఉత్తమ నమూనా" గా గుర్తించింది.[8][9]
నెక్నాంపూర్ చెరువు నీటిలో ఆక్సిజన్ పరిమాణం పెరగడంతో 2వేలకు పైగా తాబేళ్లు, 25 వేలకు పైగా చేపలు, 150 రకాల పక్షులు ఇక్కడ జీవిస్తున్నాయి.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ K. V., Moulika (2019-01-09). "Heritage in peril: Neknampur lake turns a floating dump". The Times of India. Retrieved 2024-10-09.
- ↑ 2.0 2.1 K.V., Moulika (2018-12-26). "400-year old lake choking choking on toxic froth, GHMC eyes wide shut". Times of India. Retrieved 2024-10-05.
- ↑ Akbar, Syed (2018-03-26). "Historic Neknampur lake turns civic sewage dump". Times of India. Retrieved 2024-10-05.
- ↑ Sharma, Chetan; Shukla, Anoop Kumar Shukla, eds. (2014-11-01). Sustainable Development and Geospatial Technology. Springer Nature Switzerland. p. 263. ISBN 978-3-031-6568-3-5. Retrieved 2024-10-05.
- ↑ "Encroachers defy govt, return to Nekhnampur lake". Times of India. 2024-04-30. Retrieved 2024-10-05.
- ↑ Kashyap, Aarti (2023-08-19). "Neknampur Lake Restoration Gets NITI Aayog Recognition". Deccan Chronicle. Retrieved 2024-10-05.
- ↑ Kashyap, Aarti (2023-08-19). "Telangana: Top drawer state on environmental performance". The New Indian Express. Retrieved 2024-10-05.
- ↑ "నెక్నాంపూర్ చెరువు.. పునరుద్ధరణ భేష్ | general". web.archive.org. 2024-11-20. Archived from the original on 2024-11-20. Retrieved 2024-11-20.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Parvathy, Navya (2024-06-06). "Neknampur Lake garners accolades for restoration". The Hans India. Retrieved 2024-10-07.