నెమలికంటి తారకరామారావు
నెమలికంటి తారకరామారావు (మార్చి 5, 1937) కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, నటుడు. దాదాపు 40కి పైగా నాటకాలు, నాటక పరిశోధన గ్రంథాలు, నవలలు, కథలు రచించారు.
నెమలికంటి తారకరామారావు | |
---|---|
జననం | నెమలికంటి తారకరామారావు మార్చి 5, 1937 నెమలికల్లు, అమరావతి, గుంటూరు జిల్లా |
ప్రసిద్ధి | కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, నటుడు. |
మతం | హిందూ మతము |
తండ్రి | మృత్యుంజయశర్మ |
తల్లి | సీతారామమ్మ |
జననం - విద్యాభ్యాసం
మార్చుగుంటూరు జిల్లా, అమరావతి సమీపంలోని నెమలికల్లు లో 1937, మార్చి 5 న జన్మించాడు. తల్లిదండ్రులు సీతారామమ్మ, మృత్యుంజయశర్మ. మృత్యుంజయశర్మ స్వాతంత్ర్య సమరయోధుడు. తారకరామారావు విద్యాభ్యాసం అమరావతి, గుంటూరు, హైదరాబాద్ లలో జరిగింది.
ఉద్యోగం
మార్చుఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో వివిధ హోదాల్లో పనిచేసి, ఇంటర్మీడియట్ విద్యాశాఖలో సహాయ సంచాలకులుగా 1995లో పదవీ విరమణ చేశారు.
నట ప్రస్థానం
మార్చుతారకరామారావు మొట్టమొదట గనిపిశెట్టి వేంకటేశ్వరరావు భలేపెళ్లి నాటకంలో, ఆ తరువాత లింగమూర్తి రచించిన వెంకన్న కాపురంలో వేంకటేశ్వర్లు పాత్రలో నటించాడు. రంగస్థల, ఆఖాశవాణి, దూరదర్శలలో 1959 నుండి 1982 వరకు నటుడిగా కొనసాగారు.
రచనలు
మార్చునాటకాలు
మార్చు- ఆత్మసాక్షి (1969)
- మహాప్రస్థానం (1971)
- శరణం గచ్చామి (1973)
- నాతి చరామి (1974)
- బకాసుర (1990) (బొంబాయి, అహ్మదాబాద్, సూరత్ లలో ప్రదర్శించబడింది)
- జనమేజయం (1997) (ఈ నాటకం భారత రంగఉత్సవ్ (2001)లో రసరంజని వారిచే ప్రదర్శించబడింది)
- యజ్క్షసేని ఆత్మకథ (కాంచిపురంలో ప్రదర్శించబడింది)
నాటికలు
మార్చు- వరుడు కావాలి (1980)
- షరా మామూలే (1981)
- వీధి నాటకం (1983)
- మేలు కొలుపు (1985)
మహాప్రస్థానం నాటకం అనేకసార్లు ప్రదర్శించబడింది. శరణం గచ్చామి నాటకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రదర్శించింది. శ్రీకళానికేతన్ సంస్థను స్థాపించి, ఆ సంస్థ తరపున 30 నాటక, నాటికలను హైదరాబాదు లోనూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోనూ ప్రదర్శింపజేశారు.
పురస్కారాలు
మార్చు- చరమాంకం (నాటకం)- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచన పురస్కారం (1982), రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం (1987)
- నాతి చరామి (నాటకం)- తృతీయ బహుమతి, ఆంధ్రజ్యోతి నాటక పోటీలు.
- తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం.
- ఆజోవిజో కందాళం వారి రంగస్థల పురస్కారం.
- యువకళావాహిని రంగస్థల పురస్కారం.
- రసమయి రంగస్థల పురస్కారం.
- రసరంజని రంగస్థల పురస్కారం. (జూలై 1, 2015 గరిమెళ్ళ రామమూర్తి గారి 79వ జయంతి సందర్భంగా)
మూలాలు
మార్చు- నెమలికంటి తారకరామారావు, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 330.