నెల్లికుదురు మండలం

తెలంగాణ, మహబూబాబాదు జిల్లా లోని మండలం

నెల్లికుదురు మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం తొర్రూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  17  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం నెల్లికుదురు.

నెల్లికుదురు
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, నెల్లికుదురు స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, నెల్లికుదురు స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, నెల్లికుదురు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°35′11″N 79°44′58″E / 17.586431°N 79.749527°E / 17.586431; 79.749527
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబాబాదు జిల్లా
మండల కేంద్రం నెల్లికుదురు
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 214 km² (82.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 58,344
 - పురుషులు 29,402
 - స్త్రీలు 28,942
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.98%
 - పురుషులు 55.62%
 - స్త్రీలు 31.84%
పిన్‌కోడ్ 506368

మండల జనాభా

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం
 
మండల వ్యవసాయ కార్యాలయం నెల్లికుదురు
 
మండల ప్రజా పరిషత్ నెల్లికుదురు

2011 భారత జనగణన లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 58,344 - పురుషులు 29,402 - స్త్రీలు 28,942.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 214 చ.కి.మీ. కాగా, జనాభా 56,476. జనాభాలో పురుషులు 28,457 కాగా, స్త్రీల సంఖ్య 28,019. మండలంలో 14,298 గృహాలున్నాయి.[3]

వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు

మార్చు

లోగడ నెల్లికుదుర్ గ్రామం/మండలం వరంగల్ జిల్లా, మహబూబాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా నెల్లికుదుర్ మండలాన్ని (1+16) పదిహేడు గ్రామాలుతో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో,అదే రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

పేరు వెనుక చరిత్ర

మార్చు

నెల్లికుదురు గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది. అతి పురాతనమైన రంగనాయకుల గుడి ఊరికె తలమానికం. గొప్ప కవులకు, కళాకారులకు ఈ ఊరు పుట్టినిల్లు.నెల్లికుదురులో కాకతీయ మహా రాణి రుద్రమదేవి తన చివరి యుద్ధంలో పాల్గొన్టానికి నకిరేకల్ కు వెళ్లే సమయంలో ఈ ప్రాంతంలో ఉండి కొన్ని వ్యూహాలు రచించడం జరిగిందని ఆధారాలు ఉన్నాయి, కాకతీయుల కొన్ని ఆయుధాలు విలువైన బంగారు ఆభరణాలు గుప్తనిధులు ఈ ప్రాంతంలో ఉన్నాయి అని ప్వూరికుల నమ్మకం.

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. మేచరాజుపల్లి
  2. ఎర్రబెల్లిగూడెం
  3. రామానుజాపురం
  4. కాచికల్
  5. చిన్ననాగారం
  6. రాజులకొత్తపల్లి
  7. చిన్నముప్పారం
  8. ఆలేరు
  9. వావిలాల
  10. శ్రీరామగిరి
  11. రావిరాల
  12. నైనాల
  13. నెల్లికుదురు
  14. బ్రాహ్మణకొత్తపల్లి
  15. మదనతుర్తి
  16. మునిగలవీడు
  17. నరసింహులగూడెం

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

మార్చు