నెల్లూరు రైల్వే స్టేషను

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు నగరంలో ఉన్న రైల్వే స్టేషను

నెల్లూరు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్:NLR[1]) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు నగరంలో ఉన్న రైల్వే స్టేషను. విజయవాడ-గూడూరు సెక్షన్‌లోని ఈ రైల్వే స్టేషను, దక్షిణ తీర రైల్వే జోన్ (గతంలో దక్షిణ మధ్య రైల్వే జోన్)లోని విజయవాడ రైల్వే డివిజను పరిధిలో నిర్వహించబడుతుంది.[2]

నెల్లూరు
భారతీయ రైల్వే స్టేషను
నెల్లూరు రైల్వే స్టేషను ప్రధాన ద్వారం
సాధారణ సమాచారం
Locationరైల్వే స్టేషన్ రోడ్, సంతపేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్
భారతదేశం
Coordinates14°27′43″N 79°59′14″E / 14.4618326°N 79.9872789°E / 14.4618326; 79.9872789
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుభారతీయ రైల్వేలు
లైన్లు
ఫ్లాట్ ఫారాలు4
పట్టాలు5 5 ft 6 in (1,676 mm) బ్రాడ్-గేజ్
నిర్మాణం
నిర్మాణ రకంప్రామాణిక (భూమిమీద)
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషను కోడుNLR
జోన్లు SCoR
డివిజన్లు విజయవాడ
Classificationనాన్-సబర్బన్ గ్రేడ్-3 (ఎన్.ఎస్.జి-3)
History
Opened1899 (1899)
విద్యుత్ లైను1980–81
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
Location
నెల్లూరు is located in ఆంధ్రప్రదేశ్
నెల్లూరు
నెల్లూరు
ఆంధ్రప్రదేశ్ లో రైల్వే స్టేషను ప్రాంతం
నెల్లూరు is located in India
నెల్లూరు
నెల్లూరు
భారతదేశంలో రైల్వే స్టేషను ప్రాంతం
పటం
ఇంటరాక్టివ్ మ్యాప్

చరిత్ర

మార్చు

1899లో విజయవాడ-చెన్నై లింక్ ఏర్పాటుచేయబడింది.[3] 1980-81 మధ్యకాలంలో చీరాల-ఎలవూరు సెక్షన్ విద్యుదీకరించబడింది.[4]

వర్గీకరణ

మార్చు

ఆదాయాలు, ప్రయాణీకుల నిర్వహణ పరంగా, ఈ నెల్లూరు రైల్వే స్టేషను నాన్-సబర్బన్ గ్రేడ్-3 (ఎన్.ఎస్.జి-3) రైల్వే స్టేషన్‌గా వర్గీకరించబడింది.[5] 2017–18, 2022–23 కాలానికి భారతీయ రైల్వే స్టేషన్‌ల పునః-వర్గీకరణ ఆధారంగా, ఎన్.ఎస్.జి–3 కేటగిరీ స్టేషన్ ₹20₹100 కోట్ల మధ్య సంపాదిస్తుంది. 5–10 million మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తోంది.[6] భారతీయ రైల్వే స్టేషన్ల అప్‌గ్రేడేషన్ పథకమైన ఆదర్శ్ స్టేషన్ స్కీమ్ కోసం ఎంపిక చేయబడింది.[7][8]

నిర్మాణం, సౌకర్యాలు

మార్చు

నెల్లూరు రైల్వే స్టేషనులో 4 ప్లాట్‌ఫారమ్‌లపై ఎస్కలేటర్లు ఏర్పాటుచేశారు.[9] ఎస్.ఎస్.ఆర్. ఇటీవల నెల్లూరు స్టేషనులో ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్‌లను (ఎటివిఎం) కూడా ఇన్‌స్టాల్ చేసింది. [10] భారతీయ రైల్వే టాప్ వంద బుకింగ్ స్టేషన్లలో ఇదీ ఒకటి.[11] ఈ స్టేషను మీదుగా 132 ఎక్స్‌ప్రెస్ రైళ్ళు, 6 ప్యాసింజర్ రైళ్ళు, 2 ఈఎంయు/డిఎంయు సహా రోజువారీ 140 రైళ్ళు ప్రయాణిస్తున్నాయి.[12] నెల్లూరు రైల్వే స్టేషను దేశంలోనే 28వ పరిశుభ్రమైన రైల్వే స్టేషనుగా నిలిచింది.[13] 100 కోట్లతో "రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి" అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కింద ప్రపంచస్థాయి సౌకర్యాలతో నెల్లూరు రైల్వే స్టేషన్ను సుందరీకరించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.[14]

మూలాలు

మార్చు
 1. "Station Code Index" (PDF). Portal of Indian Railways. 2015. p. 46. Retrieved 2022-10-18.
 2. "Statement showing Category-wise No.of stations" (PDF). Portal of Indian Railways. 28 January 2016. p. 7. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 2022-10-18.
 3. "IR History:Early days II". 1870–1899. IRFCA. Retrieved 2013-01-19.
 4. "History of Electrification". IRFCA. Retrieved 2022-10-18.
 5. "Stations – Category-wise (NEW)". Portal of Indian Railways. Retrieved 2022-10-18.
 6. "Categorization of Railway Stations". Press Information Bureau. 21 March 2018. Retrieved 2022-10-18.
 7. "Adarsh Railway Station Scheme". Press Information Bureau. 5 April 2017. Retrieved 2022-10-18.
 8. "Adarsh Stations" (PDF). Portal of Indian Railways. Retrieved 2022-10-18.
 9. "Escalators, lifts at 14 stations". The New Indian Express. 24 December 2012. Archived from the original on 2014-04-16. Retrieved 2022-10-18.
 10. "SCR introduces mobile paper ticketing facility in 38 stations".
 11. "Indian Railways Passenger Reservation Enquiry". Availability in trains for Top 100 Booking Stations of Indian Railways. IRFCA. Archived from the original on 10 May 2014. Retrieved 2022-10-18.
 12. "Station: Nellore". South Coast Railway – Indian Railways. Retrieved 2022-10-18.
 13. "Cleanliness derails at AP railway stations". The Times of India. 30 July 2016. Retrieved 2022-10-18.
 14. Ujwal, Bommakanti (15 February 2019). "Nellore railway station: Andhra Pradesh: Nellore railway station to be revamped with Rs 100 crore | Vijayawada News". The Times of India. Retrieved 2022-10-18.

బయటి లింకులు

మార్చు

  Nellore travel guide from Wikivoyage