నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం

కోలకతా లోని ఒక విమానాశ్రయం

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్నది కోల్‌కాతాకీ, కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతాలకు సేవలు అందించే అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది తూర్పు భారతదేశానికి, ఈశాన్య భారతదేశానికి ప్రాథమిక విమానయాన కేంద్రంగా ఉంది. ఇది కోల్‌కాతా నగర కేంద్రం నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1995లో భారత స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన ప్రముఖ నాయకులలో ఒకరైన బెంగాలీ నేత సుభాష్ చంద్రబోస్ పేరు మీదుగా దీనికి పేరు మార్చారు. దానికి ముందు ఈ విమానాశ్రయాన్ని స్థానికంగా కోల్కతా విమానాశ్రయం అనీ, డమ్ డమ్ విమానాశ్రయం అనీ పిలిచేవారు. విమానాశ్రయపు IATA కోడ్ CCU (సీసీయూ) కోల్‌కాతాకు పూర్వం చట్టపరమైన పేరు అయిన "కలకత్తా" ఆంగ్ల స్పెల్లింగ్ ఆధారంగా వచ్చింది. 1924లో ప్రారంభమైన ఈ విమానాశ్రయం భారతదేశంలోని అత్యంత ప్రాచీన విమానాశ్రయాలలో ఒకటి.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం
సంగ్రహం
విమానాశ్రయ రకంPublic
యజమాని/కార్యనిర్వాహకుడుభారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ
సేవలుకోల్‌కతా మెట్రోపాలిటన్ ప్రాంతం
ప్రదేశంకోల్‌కతా, పశ్చిమ బెంగాల్
ప్రారంభం1924; 100 సంవత్సరాల క్రితం (1924)
ఎయిర్ హబ్
కేంద్రీకృత నగరం
నిర్మాణంకలకత్తా ఎయిరోడ్రోమ్‌గా 1900లు మొదట్లో
ఎత్తు AMSL5 m / 16 ft
అక్షాంశరేఖాంశాలు22°39′17″N 088°26′48″E / 22.65472°N 88.44667°E / 22.65472; 88.44667
పటం
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
మీటర్లు అడుగులు
01L/19R 3,190 10,470 అస్ఫాల్ట్
గణాంకాలు (2023 ఏప్రిల్ - 2024 మార్చి)
Passengers19,784,417 (Increase 11.3%)

6.64 కిలోమీటర్ల (2.5 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో విస్తరించి ఉన్న కోల్‌కాతా విమానాశ్రయం భారతదేశపు తూర్పు ప్రాంతపు విమాన రవాణాకు అతిపెద్ద కేంద్రంగా ఉంది. అలాగే, పశ్చిమ బెంగాల్లో పనిచేస్తున్న రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఒకటి, మరొకటి సిలిగురి లోని బాగ్డోగ్రా విమానాశ్రయం. ఈ విమానాశ్రయాన్ని 2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారు 2 కోట్ల మంది ప్రయాణికులు ఉపయోగించారు. భారతదేశంలో అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయాల్లో ఆరవస్థానంలో, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై విమానాశ్రయాల తరువాత, నిలిచింది. ఈశాన్య భారతదేశం, బంగ్లాదేశ్, భూటాన్, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య నగరాలైన దుబాయ్, దోహా, అబుదాబి విమానాలకు ఈ విమానాశ్రయం ప్రధాన కేంద్రంగా ఉంది. ఇది డమ్ డమ్ ప్రాంతంలో జెస్సోర్ రహదారికి పక్కన ఉంది.

మూలాలు

మార్చు
  1. "Annexure III – Passenger Data" (PDF). aai.aero. Retrieved 19 April 2024.
  2. "Annexure II – Aircraft Movement Data" (PDF). aai.aero. Retrieved 19 April 2024.
  3. "Annexure IV – Freight Movement Data" (PDF). aai.aero. Retrieved 19 April 2024.

బయటి లింకులు

మార్చు

  Media related to Netaji Subhas Chandra Bose International Airport at Wikimedia Commons