మధ్యప్రాచ్యం
మధ్య ప్రాచ్యం, ఆఫ్రో-యురేషియాలోని ఒక ఖండాంతర ప్రాంతం. పశ్చిమ ఆసియా (ట్రాన్స్‌కాకేసియా మినహా), ఈజిప్టు మొత్తం (ఎక్కువ భాగం ఉత్తర ఆఫ్రికాలో ఉంది), టర్కీ (కొంత భాగం ఆగ్నేయ ఐరోపాలో ఉంది) ఇందులో భాగం. ఈ పదం 20 వ శతాబ్దం ప్రారంభంలో సమీప ప్రాచ్యం (నియర్ ఈస్ట్) అనే పదానికి బదులుగా విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. "గ్రేటర్ మిడిల్ ఈస్ట్" (మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లను కలుపుకుని. దీన్నే "మెనాప్" అంటారు) అనే మరింత విస్తృతమైన భౌగోళిక భావనలో మాగ్రెబ్, సుడాన్, జిబౌటి, సోమాలియా, కొమొరోస్ (ఇవన్నీ ఉత్తర ఆఫ్రికా దేశాలు), ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లు కలిసి ఉంటాయి. కొన్నిసార్లు ట్రాన్స్‌కాకాసియా, మధ్య ఆసియాలు కూడా వీటిలో కలిపి చెబుతారు. వివిధ నిర్వచనాల కారణంగా "మధ్య ప్రాచ్యం" అనే పదం కొంత గందరగోళానికి దారితీసింది.
వైశాల్యం | 7,207,575 కి.మీ2 (2,782,860 చ. మై.) |
---|---|
జనాభా | 371 million (2010)[1] |
దేశాలు | UN member states (16) |
ఆధారపడేవారు |
Internal (3) |
పెద్ద నగరాలు | Largest cities: |
చాలా మధ్యప్రాచ్య దేశాలు (మొత్తం 18 లో 13 దేశాలు) అరబ్బు ప్రపంచంలో భాగం. ఈజిప్టు, ఇరాన్, టర్కీలు ఈ ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు. సౌదీ అరేబియా, విస్తీర్ణంలో ఈ ప్రాంతం లోని అతిపెద్ద దేశం. మధ్యప్రాచ్య చరిత్ర పురాతన కాలం నాటిది. ఈ ప్రాంతం యొక్క భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యత సహస్రాబ్దాలుగా గుర్తించబడింది. [2][3][4] ఊదుమతం, క్రైస్తవం, ఇస్లాంతో వంటి అనేక ప్రధాన మతాలకు మూలం మధ్యప్రాచ్యమే. ఈ ప్రాంతంలో అరబ్బులు మెజారిటీ జాతి సమూహంగా ఉన్నారు. [5] తరువాత టర్కులు, పర్షియన్లు, కుర్దులు, అజెరిస్, కోప్ట్స్, యూదులు, అస్సిరియన్లు, ఇరాకీ తుర్క్మెన్‌లు, గ్రీక్ సైప్రియాట్లు ఉన్నారు.
మధ్య ప్రాచ్యంలో సాధారణంగా వేడి, శుష్క శీతోష్ణస్థితి ఉంటుంది. ఈజిప్టులోని నైలు డెల్టా, మెసొపొటేమియా (ఇరాక్, కువైట్, తూర్పు సిరియా) లోని టైగ్రిస్, యూఫ్రటీస్ వాటర్‌షెడ్ల వంటి పరిమిత ప్రాంతాలలో వ్యవసాయానికి తోడ్పడటానికి అనేక ప్రధాన నదులు నీటిసౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈ ప్రాంతాలను సారవంతమైన నెలవంక అని పిలుస్తారు. పర్షియన్ సింధుశాఖ సరిహద్దులో ఉన్న చాలా దేశాలలో ముడి చమురు నిల్వలు ఉన్నాయి. అరేబియా ద్వీపకల్పంలోని రాజులు పెట్రోలియం ఎగుమతుల ద్వారా ఆర్ధికంగా లాభపడుతున్నారు. శుష్క వాతావరణం వలన, శిలాజ ఇంధన పరిశ్రమపై అధికంగా ఆధారపడటం వలన, మధ్యప్రాచ్యం వాతావరణ మార్పులకు భారీగా కారణమౌతోంది. దాని ప్రతికూల ప్రభావం కూడా ఈ ప్రాంతంపై తీవ్రంగా పడనుందని భావిస్తున్నారు.
మూలాలు
మార్చు- ↑ Population 1971–2010 (pdf Archived 2012-01-06 at the Wayback Machine p. 89) IEA (OECD/ World Bank) (original population ref OECD/ World Bank e.g. in IEA Key World Energy Statistics 2010 p. 57)
- ↑ Cairo, Michael F. The Gulf: The Bush Presidencies and the Middle East Archived 2015-12-22 at the Wayback Machine University Press of Kentucky, 2012 ISBN 978-0-8131-3672-1 p xi.
- ↑ Government Printing Office. History of the Office of the Secretary of Defense: The formative years, 1947–1950 Archived 2015-12-22 at the Wayback Machine ISBN 978-0-16-087640-0 p 177
- ↑ Kahana, Ephraim. Suwaed, Muhammad. Historical Dictionary of Middle Eastern Intelligence Archived 2015-12-23 at the Wayback Machine Scarecrow Press, 13 apr. 2009 ISBN 978-0-8108-6302-6 p. xxxi.
- ↑ Shoup, John A. (2011-10-31). Ethnic Groups of Africa and the Middle East: An Encyclopedia. ISBN 978-1-59884-362-0. Archived from the original on 24 April 2016. Retrieved 26 May 2014.