నేదునూరి గంగాధరం

నేదునూరి గంగాధరం (జూలై 4, 1904 - మార్చి 11, 1970) జానపద సాహిత్యాన్ని ఉద్యమంగా నడిపిన ప్రముఖులు.

జననంసవరించు

వీరు జూలై 4, 1904 సంవత్సరంలో రాజమండ్రి మండలం కొంతమూరు లో జన్మించారు. చదివిన కొద్దిపాటి చదువుతో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. చిన్ననాటి నుండి జానపద వాజ్మయ సేకరణ ఒక మహత్కార్యంగా భావించారు. దానిని ఎంతో ప్రయాసకోర్చి గ్రామగ్రామాలు తిరిగి జానపద గేయాలు, కథా గేయాలు, వీరగాథలు, జమిలి పదాలు, నోముల కథలు, పండుగ పాటలు, ఆటపాటలు, ప్రార్థన గేయాలు, వినోద గేయాలు, ఎక్కిరింత పాటలు, జంటపదాలు, జాతీయాలు, సామెతలు, కిటుకు మాటలు - లక్షల సంఖ్యలో సేకరించారు. వీనిలో కొన్ని 1953లో సంభవించిన గోదావరి వరదలలో కొట్టుకొనిపోయాయి.

రచనలుసవరించు

వీరు ఈ క్రింది గ్రంథాలను ప్రకటించారు.

 1. మేలుకొలుపులు (1949)
 2. మంగళహారతులు (1951)
 3. సెలయేరు (1955)
 4. వ్యవసాయ సామెతలు (1956)
 5. పసిడి పలుకులు (1960)
 6. స్త్రీల వ్రత కథలు (1960)
 7. జానపద గేయ వాఙ్మయ వ్యాసావళి
 8. ఆట పాటలు(1964)
 9. జవహర్ లాల్ నెహ్రూ సమగ్ర చరిత్ర (1966)[1]
 10. శకునశాస్త్రము[2]
 11. మిన్నేరు (1968)
 12. మున్నీరు (1973) మరణానంతరం ప్రచురింపబడింది.
 13. పండుగలు-పరమార్థములు
 14. వ్యవసాయ ముహూర్తదర్పణం
 15. గృహవాస్తు దర్పణం
 16. పుట్టుమచ్చల శాస్త్రం
 17. కోడిపుంజుల శాస్త్రం

బిరుదులుసవరించు

 • కవి కోకిల
 • వాస్తువిశారద
 • వాఙ్మయోద్ధారక
 • జానపదబ్రహ్మ

మరణంసవరించు

వీరు 1970, మార్చి 11వ తేదీన పరమపదించారు.

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు