జానపద గీతాలు

జానపదులు పాడుకునే పాటలు
(జానపద గేయాలు నుండి దారిమార్పు చెందింది)

జానపదమనగా జనపదానికి సంబంధించింది. జనపదమనగా పల్లెటూరు. జనపదమున నివసించు వారు జానపదులు, వారు పాడుకొను పాటలు జానపదములు. జానపద గీతాలు: జానపదులు పాడుకునే గీతాలను జానపద గీతాలు అంటారు. వీటినే ఆంగ్లములో folk songs అని అంటారు. తెలుగు జానపద గీతాలు చాలా పురాతన కాలమునుండి వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే ఈ జానపదగీతాలలో కొన్నిసార్లు చక్కని ఛందస్సు కూడా ఉంటుంది. పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారు ఆ కాలంలో ప్రసిద్ధములైన జానపద బాణీలలో చాలా పదములు రాసారు.

తిక్కనసోమయాజి చిత్రపటం

తెలుగు సాహిత్యం

దేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యం యుగ విభజన
నన్నయకు ముందు సా.శ. 1000 వరకు
నన్నయ యుగం 1000 - 1100
శివకవి యుగం 1100 - 1225
తిక్కన యుగం 1225 - 1320
ఎఱ్ఱన యుగం 1320 – 1400
శ్రీనాధ యుగం 1400 - 1500
రాయల యుగం 1500 - 1600
దాక్షిణాత్య యుగం 1600 - 1775
క్షీణ యుగం 1775 - 1875
ఆధునిక యుగం 1875 – 2000
21వ శతాబ్ది 2000 తరువాత
తెలుగు భాష
తెలుగు లిపి
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

తెలుగు సాహితీకారుల జాబితాలు
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
తెలుగు వ్యాకరణం
తెలుగు పద్యంతెలుగు నవల
తెలుగు కథతెలుగు సినిమా పాటలు
జానపద సాహిత్యంశతక సాహిత్యం
తెలుగు నాటకంపురాణ సాహిత్యం
తెలుగు పత్రికలుపద కవితా సాహిత్యము
అవధానంతెలుగు వెలుగు
తెలుగు నిఘంటువుతెలుగు బాలసాహిత్యం
తెలుగు సామెతలుతెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగులో విద్యాబోధనఅధికార భాషగా తెలుగు

జానపద జాతరలో పాట పాడుతున్న మహిళ

ఆంధ్రప్రదేశ్ లో జానపద కళలు

మార్చు

కొండవీడు మందేరా - కొండపల్లి మందేరా

కాదనువాడుంటే - కటకం దాకా మందేరా

చూసినారా ఎంత వీర పదమో, ఈ పదము వెనక ఒక చిన్న కథ ఉన్నది, శ్రీ కృష్ణదేవరాయలు కటకంపై యుద్ధానికి వెళ్తూ శకునం చూడగా ఒక రజకుడు ఈ పాట పాడుతూ తన బిడ్డడిని నిద్రపుచ్చుతున్నాడంట.

అలాగే ఈ దిగువ మాయలేడి కోలాటం పాట చుడండి

కోలాటం పాట

మార్చు

రామయ్య గట్టించే కోలు రత్నాల మేడ కోలు

సీతమ్మ గట్టించే కోలు సిరిపరినా సోల కోలు

సిరిపర్నసోలాలా కోలు సిత్తారీ ముగ్గు కోలు

సిత్తారి ముగ్గు పైనా కోలు రత్నాల కమ్మడీ కోలు

రత్నాల కమ్మడీ పైనా కోలు వాలు చిలకాలు కోలు

వాలు చిలుకలపినా కోలు వారిద్దరయ్యా కోలు

రామయ్యా సీతమ్మా కోలు జూదమాడంగా కోలు

ఆడుతాడుత వచ్చే కోలు అది మాయలేడి కోలు

మాయాలేడికైనా కోలు మడిమే లందమ్మూ కోలు

అటుజూడురామయ్య కోలు అటుజూడావయ్యా కోలు

.....ఇలా సాగి పోతుంది

దీనిని శ్రీ బిరుదురాజు రామరాజు గారు 1956లో నల్లగొండ జిల్లా కేతేపల్లి గ్రామంలో కట్టెకోత వృత్తివాల్ల దగ్గర నుండి సేకరించారు.

ఇహ జానపదాలను రకరకాలుగా విభజించ వచ్చు

  1. వివిధ రస పోషణనును బట్టి, అనగా హాస్యాది నవరస పోషణను బట్టి
  2. వివిధ వస్తు నిర్ణయాన్ని బట్టి, అనగా భక్తి, చారిత్రిక, స్త్రీల పాటలు ఇత్యాది
  3. ఇంకా వాటి లోని కవిత్వ నిర్ణయాన్ని బట్టి

కవిత్వాంశాలను బట్టి జానపద విభజనము

మార్చు
 
జానపద గాయకులు
  1. జోల పాటలు
  2. లాలి పాటలు
  3. పిల్లల పాటలు
  4. బతుకమ్మ పాటలు
  5. గొబ్బిళ్ళ పాటలు
  6. సుమ్మీ పాటలు
  7. బొడ్డేమ్మ పాటలు
  8. ఏలెస్సా, ఓలెస్సా పాట
  9. వానదేవుని పాటలు
  10. తుమ్మెద పాటలు
  11. సిరిసిరి మువ్వ పాటలు
  12. గొల్ల పాటలు
  13. జాజఱ పాటలు
  14. కోలాటపు పాటలు
  15. తలుపుదగ్గర పాటలు
  16. ఏల
  17. చిలుక
  18. సువ్వాల
  19. భ్రమర గీతాలు
  20. నాట్ల పాటలు
  21. కలుపు పాటలు
  22. కోతల పాటలు
  23. చెక్కభజన పాటలు
  24. జట్టిజాం పాటలు
  25. వీధిగాయకుల పాటలు
  26. పెళ్ళి పాటలు
  27. గ్రామదేవతల పాటలు
  28. తత్త్వాలు
  29. భిక్షుకుల పదాలు
  30. ఇంకా వర్గీకరింపబడని గీతాలు

ఇవికూడా చూడండి

మార్చు