నేరము – శిక్ష (1973 సినిమా)

(నేరము శిక్ష నుండి దారిమార్పు చెందింది)

నేరము శిక్ష 1973లో విడుదలైన తెలుగు సినిమా. అమృతా ఫిలింస్ బ్యానర్ పై అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకటరావు లు నిర్మించిన ఈ సినిమాకు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, భారతి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

నేరము – శిక్ష
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.విశ్వనాధ్
తారాగణం కృష్ణ,
భారతి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ అమృతా ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
 • దర్శకత్వం: కె. విశ్వనాథ్
 • స్టూడియో: అమృతా ఫిల్మ్స్
 • నిర్మాత: అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట రావు;
 • ఛాయాగ్రాహకుడు: జి.వి.ఆర్. యోగానంద్, బి. రామచంద్రయ్య;
 • ఎడిటర్: S.P.S. వీరప్ప;
 • స్వరకర్త: సాలూరి రాజేశ్వరరావు;
 • గీత రచయిత: దేవులపల్లి కృష్ణ శాస్త్రి, సి.నారాయణ రెడ్డి, దాశరథి, కొసరాజు రాఘవయ్య చౌదరి, గణపతి శాస్త్రి పిలకా, సముద్రాల జూనియర్
 • విడుదల తేదీ: జూలై 27, 1973
 • సమర్పించినవారు: బాలయ్య మన్నవ;
 • కథ: బాలయ్య మన్నవ;
 • స్క్రీన్ ప్లే: కె. విశ్వనాథ్;
 • సంభాషణ: సముద్రాల జూనియర్, మోదుకురి జాన్సన్
 • గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, జి. ఆనంద్, బి.ఆర్. లతా, భాస్కర్
 • ఆర్ట్ డైరెక్టర్: కుదరవల్లి నాగేశ్వర రావు;
 • డాన్స్ డైరెక్టర్: పసుమర్తి కృష్ణ మూర్తి, వేంపతి సత్యం

అల్లారుముద్దుగా పెంచిన తల్లి వల్ల, భాద్యత, భయం తెలియకుండా పెరిగి, తన ఆకతాయి తనంగా ఒక పోటీలో ఒకరి ప్రాణాలు కోల్పోయి మరొకరు కంటి చూపును కోల్పోయి వేరొకరు తను చేసినా నేరానికి జైలు శిక్ష కి బలయ్యారని తన వల్ల రెండు కుటుంబాలు బలి అయ్యాయని తెలిసి పశ్చత్తపడి ఆ కుటుంబాల పరిస్థితి చక్కదిద్ది చివరకి ఆ కుటుంబాలు, తన తల్లితండ్రులు, ప్రేమించినా ప్రేయసి వారించినా చట్టప్రకారం తాను చేసినా నేరానికి శిక్ష అనుభవించే తీరాలని చట్టానికి లొంగిపోవడానికి బయలు దేరిన వ్యక్తి కథ.

మూలాలు

మార్చు
 1. "Neramu Siksha (1973)". Indiancine.ma. Retrieved 2020-09-25.

బాహ్య లంకెలు

మార్చు