మన్నవ బాలయ్య
మన్నవ బాలయ్య తెలుగు సినిమా నటుడు, నిర్మాత. ఎక్కువ సహాయ పాత్రలు పోషించాడు. కొన్ని సినిమాలకు కథ, పాటలు కూడా అందించాడు.
మన్నవ బాలయ్య | |
---|---|
![]() | |
జననం | చావపాడు గ్రామం, గుంటూరు జిల్లా | ఏప్రిల్ 9, 1930
విద్య | బి. ఇ, మెకానికల్ ఇంజనీరింగ్ (1952) |
వృత్తి | అధ్యాపకుడు, నటుడు, నిర్మాత, రచయిత |
తల్లిదండ్రులు |
|
జీవిత విషయాలుసవరించు
గుంటూరు జిల్లా వైకుంఠపురం (అమరావతి) శివారు గ్రామం చావపాడు లో గురవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు ఏప్రిల్ 9, 1930లో జన్మించాడు[1].[2] బాలయ్య మెకానికల్ ఇంజినీరింగులో బి.ఇ 1952లో పూర్తి చేశాడు. 1957 వరకు మద్రాసు, కాకినాడ పాలిటెక్నిక్‌లలో లెక్చరర్‌గా పనిచేశాడు.
చిత్రరంగంసవరించు
మద్రాసు గిండీ కళాశాలలో చదువుకునే రోజుల్లో నాటకాల్లో నటించాడు. మిత్రుల ప్రోద్బలముతో చిత్రాల్లో నటించాలనే కోరిక గలిగి తాపీ చాణక్య సహకారముతో చిత్రసీమలో అడుగు పెట్టాడు. 1958లో ఎత్తుకు పై ఎత్తు సినిమాలో నాయక పాత్ర వేశాడు. తరువాత భాగ్యదేవత, కుంకుమరేఖ చిత్రాల్లో నటించాడు. భూకైలాస్ చిత్రంలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో శివునిగా నటించే అవకాశం వచ్చింది. అటు తరువాత చెంచులక్ష్మి, పార్వతీకల్యాణం నుండి నేటి వరకు 350 పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించాడు. 1970లో అమృతా ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించి నేరము-శిక్ష, అన్నదమ్ముల కథ, ఈనాటి బంధం ఏనాటిదో (1977) లాంటి మంచి చిత్రాలు నిర్మించాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము చెల్లెలి కాపురం చిత్రాన్ని ఉత్తమ చిత్రముగా ఎంపిక చేసి బంగారు నంది పురస్కారము బహూకరించింది. స్వీయ దర్శకత్వంలో పోలీస్ అల్లుడు (1994), ఊరికిచ్చిన మాట (1981) నిర్మించాడు. 1991లో మద్రాసు నుండి హైదరాబాదు వచ్చాడు. చిత్రాల్లో, టి.వి. సీరియల్స్ లోనూ నటిస్తున్నాడు. 2000 సంవత్సరములో తీసిన "పల్లెవాసం-పట్నవాసం"కు ప్రభుత్వ ఉత్తమ సీరియల్ అవార్డ్ లభించింది. అంకురం చిత్రంలో నటనకు వంశీ-బర్కిలీ వారి ఉత్తమ క్యారెక్టర్ అవార్డ్ లభించింది. ఈనాటి బంధం ఏనాటిదో సినిమాకు కథ, చిత్రానువాదం, పాటలు అందించాడు.[3]
నటించిన చిత్రాలుసవరించు
ఇతడు నటించిన సినిమాల పాక్షిక జాబితా
1950లుసవరించు
- 1958 ఎత్తుకు పైఎత్తు
- 1958 పార్వతీ కళ్యాణం
- 1959 భాగ్యదేవత
- 1959 మనోరమ
1960లుసవరించు
- 1960 కుంకుమరేఖ
- 1960 చివరకు మిగిలేది - ప్రకాశరావు
- 1961 కృష్ణ ప్రేమ
- 1962 మోహినీ రుక్మాంగద
- 1963 ఇరుగు పొరుగు
- 1963 తల్లి బిడ్డ
- 1964 బభ్రువాహన
- 1964 బొబ్బిలి యుద్ధం
- 1964 వివాహబంధం
- 1965 పాండవ వనవాసం - అర్జునుడు
- 1966 మొనగాళ్ళకు మొనగాడు
- 1966 శ్రీకృష్ణ పాండవీయం - ధర్మరాజు
- 1967 అగ్గిదొర
- 1967 రక్తసింధూరం
- 1968 వీరపూజ
- 1968 సర్కార్ ఎక్స్‌ప్రెస్
1970లుసవరించు
- 1970 లక్ష్మీ కటాక్షం - వినయదండుడు
- 1971 విక్రమార్క విజయం
- 1971 నిండు దంపతులు
- 1973 నేరము - శిక్ష
- 1974 అల్లూరి సీతారామరాజు - అగ్గిరాజు
- 1974 కృష్ణవేణి
- 1977 ఒకే రక్తం
- 1977 ఈనాటి బంధం ఏనాటిదో
- 1977 కురుక్షేత్రం - ధర్మరాజు
- 1978 చిరంజీవి రాంబాబు - 1978
- 1978 ప్రేమ-పగ
- 1978 రాజపుత్ర రహస్యం
- 1979 గంగా భవానీ
- 1979 నామాల తాతయ్య
- 1979 ముత్తయిదువ
1980లుసవరించు
- 1987 జగన్మాత
- 1988 పృథ్వీరాజ్
- 1988 ప్రాణ స్నేహితులు
- 1988 మహారాజశ్రీ మాయగాడు
1990లుసవరించు
- 1992 అంకురం -
- 1992 పెద్దరికం - సాంబశివుడు
- 1993 గాయం
- 1994 యమలీల - బ్రహ్మ
- 1996 పెళ్ళి సందడి
- 1996 జాబిలమ్మ పెళ్ళి
- 1997 అన్నమయ్య
- 1997 దేవుడు
- 1997 మా ఆయన బంగారం
2000లుసవరించు
- 2002 ధనలక్ష్మీ ఐ లవ్ యూ
- 2002 మన్మథుడు
- 2003 ఒకరికి ఒకరు
- 2004 మల్లీశ్వరి - రామ్మోహనరావు
- 2004 విజయేంద్ర వర్మ
- 2005 ధన 51
- 2006 సామాన్యుడు
- 2007 గజి బిజి
- 2007 యమగోల మళ్ళీ మొదలైంది
- 2009 మిత్రుడు
2010లుసవరించు
- 2011 శ్రీరామరాజ్యం - వశిష్ఠుడు
- 2012 నందీశ్వరుడు
- 2012 దేవరాయ
నిర్మించిన చిత్రాలుసవరించు
- 1971 చెల్లెలి కాపురం
- 1973 నేరము - శిక్ష
- 1978 ప్రేమ-పగ
- 1980 చుట్టాలున్నారు జాగ్రత్త
- 1981 ఊరికిచ్చిన మాట
- 1983 నిజం చెబితే నేరమా
మూలాలుసవరించు
- ↑ గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట. 50
- ↑ "హ్యాపీ బర్త్ డేస్ - ఆల్ రౌండర్ బాలయ్య ఆంధ్రప్రభ 2011 ఏప్రిల్ 8". Archived from the original on 2011-09-23. Retrieved 2011-07-16.
- ↑ Indiancinema, Movies. "Eenaati Bandam Yenaatido (1977)". www.indiancine.ma. Retrieved 12 August 2020.