నేరేళ్ళంక
నేరుళ్ళంక కాకినాడ జిల్లా, పామఱ్ఱు మండలానికి చెందిన గ్రామం.[1][2] ఈ గ్రామం మరో 3 గ్రామాల సమూహము, సుమారుగా ఏడువందల కుటుంబాలు ఉన్నాయి.
నేరుళ్ళంక | |
— రెవిన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°48′N 82°14′E / 16.8°N 82.23°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కాకినాడ |
మండలం | తాళ్ళరేవు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 533263 |
ఎస్.టి.డి కోడ్ |
ఈ గ్రామంలో పోతురాజు దేవత జాతర ప్రతియేటా జరుగుతుంది, ఈ గ్రామంలో కేవలం దళిత, సెట్టిబలిజ కులాలకు సంబంధించిన వారు మాత్రమే ఉన్నారు.ఈ గ్రామానికి సరైన ప్రయాణ వసతులు లేవు, గ్రామానికి ఎటువైపు నుండి చేరుకోవాలన్న కాలినడకన వెళ్ళవలసి ఉంటుంది. కాలినడకన చేరుకోవాలంటే కనీసం మూడు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆసుపత్రి, పాఠశాల లాంటి కనీస సదుపాయాలూ లేని ఈ గ్రామానికి యానాం పట్టణం నుండి రామచంద్రాపురం వెళ్ళే బస్సులలో ప్రయాణించి, కోలంక గ్రామంలో దిగి నడచి వెళ్ళాల్సి ఉంటుంది . కవి సంగమంలో రాస్తూ అందరి మన్ననలూ పొందుతున్నయువతరం కవి కాశిరాజు ఈ నేరుడులంక గ్రామానికి చెందినవారే.
గ్రామ ప్రముఖులు
మార్చు- కాశి రాజు - వర్థమాన కవులలో కాశి రాజు ఒకరు. ఇతని పూర్తిపేరు వీర వెంకట సత్య గోవింద రాజు. కవి సంగమంలో గ్రూప్ కవితలు రాస్తున్నారు.కాశి రాజు 1988, అక్టోబర్ 3 న సత్యనారాయణ, శాంతమ్మ దంపతులకు నేరేళ్ళంకలో జన్మించారు.
మూలాలు
మార్చు- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.
- ↑ నేరుళ్ళంక ఉనికి