నేలటూరు రామదాసు అయ్యంగార్

నేలటూరు రామదాసు అయ్యంగార్ గారు 8-2-1891 వికృతినామ సంవత్సరం పుష్య బహుళ అమావాస్య నాడు నెల్లూరులో జన్మించారు. ఈయన ప్రముఖ అధ్యాపకుడు, పండితుడు,విమర్సకుడు, నటుడు.

నేలటూరు రామదాసు అయ్యంగార్
జననంనేలటూరు రామదాసు అయ్యంగార్
1891, ఫిబ్రవరి 8
నెల్లూరు
మరణం1974, జనవరి 3
వృత్తిరచయిత

రచనలు-జీవిత చరిత్ర

మార్చు

వీరు సంస్కృతంలో ఎం.ఏ.భట్టభద్రులు.ఉపాధ్యాయ శిక్షణ కూడా పొందారు.స్కూళ్ళపై ఇంస్పెక్టరుగా కొంతకాలం పనిచేసి, ఆపని తమకు గిట్టకపోవుటచే నెల్లూరులోని వెంకటగిరి రాజాగారి కళాశాలలో అధ్యాపక వృత్తి చేపట్టారు శ్రీరామదాసుగారు. వీరి సాహిత్య గురువులు శ్రీ వేదము వేంకటరాయశాస్త్రి గారు.శ్రీ శాస్త్రిగారి శిష్యులలో రామదాసు అయ్యంగార్ అగ్రగణ్యుడు.గువురుగారి వద్ద గ్రహించిన విద్యనంతా శిష్యులకు పంచుటయేగాక, కొరకువదని సంస్కృతంలోని కొన్ని నాటకములకు ఉతృష్ణమైన వాఖ్యానములు చేసినారు.

తెలుగుల జుట్టిన తెగులు వీరి తొలి వ్యాసములలో ఒకటి. భారతి లో మేఘసందేశాన్ని గూర్చి వ్యాసరాజముల వ్రాసి లబ్దప్రతిష్ఠులు అయినారు శ్రీ రామదాసు అయ్యంగార్ గారు. వీరి కాళిదాసు శాకుంతల వ్యాఖ్య వేదమువారు ప్రకటించినారు.భవభూతి ఉత్తరరామ చరితము, విశాఖదత్తుని ముద్రారాక్షసము ల వ్యాఖ్యానములను ఆంధ్రప్రదేశ్ సాహిత్యాకాడమీ వారు ప్రచురించినారు.ఈ వ్యాఖ్యానాలు వీరి పాండిత్య ప్రకర్షకు నికషోఫలాలు.

ఈయన వ్యాఖ్యాతయేగాక, గొప్ప నటుడుకూడా. వేదమువారు స్థాపించిన ఆంధ్రాభాషాభిమాని సమాజంలో చేరి, ప్రధాన పాత్రలను ధరిస్తుండేవారు.శాకుంతలంలో కణ్వుడు, బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజు, బుస్సీదొర,ప్రతాపరుద్రీయంలో చెకుముకి శాస్త్రి మొదలైన పాత్రలను ధరించి ప్రేక్షకుల మెప్పుబడసినారు.

నెల్లూరు పత్రికలలో రసలుబ్దుడనే పేరుతో-ఆనాడు ప్రదర్సింపబడే నాటకాలపై చక్కని చిక్కని సమీక్షలు వ్రాస్తుండేవారు.ఈయన విమర్సనాధాటిని మెచ్చుకున్న నటకాగ్రణి-శ్రీ స్థానం నరసింహారావు గారు.

శ్రీ రామదాసు అయ్యంగార్ శ్రీ విక్రాల రామచంద్రాచార్యులతో శాస్త్రచర్చకు దిగి తన వాదోపవాద నైపుణిని చాటి గెలిచినదిట్ట.

శ్రీ రామదాసు అయ్యంగార్ గారు 3-1-1974 నాడు పరమపదించారు.

మూలాలు

మార్చు
  • 1974 భరతి మాస పత్రిక.