నేలతాడి యొక్క వృక్ష శాస్త్రీయ నామం కర్కులిగో ఆర్కి యూయిడిస్ (Curculigo orchioides). ఇది హైపాక్సిడేసి అనే కుటుంబమునకు చెందినది. వేరులో రెసిన్, టానిక్, కాల్షియం ఆక్సలేట్స్ ఉన్నాయి.

నేలతాడి
Curculigo orchioides
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
C. orchioides
Binomial name
Curculigo orchioides
Gaertn., 1788
Synonyms
  • Curculigo ensifolia R. Br.[1]

శాస్త్రీయంగా - కర్కులిగో ఆర్కి యూయిడిస్, సంస్కృతంలో - తాలమూరి లేక ముసాలి. మలయాళంలో నిలప్పన

వ్యాప్తి

మార్చు

అనేక గుణాలున్న ఈ మొక్కను పెరటిలో పెంచవచ్చును. ఇసుక నేలలు ఈ మొక్క పెరుగుదలకు మంచిది. ఈ మొక్కలను అరణ్యాల నుంచి సేకరించాలి.

లైంగిక వృద్ధికి

మార్చు

నేలతాడి వేరును లైంగిక వృద్ధికి వాడే ఔషధాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నేలతాడి వేరు శతావరి, బోడతరం, మోదుగ విత్తులు కలిపి చూర్ణం చేసి తగు మోతాదులో తేనెలో తీసుకుంటే ముసలితనంలో వచ్చే నిస్సత్తువ పోతుందని అంటారు.

తెల్లబట్ట వ్యాధి నివారణకు

మార్చు

తెల్లబట్ట వ్యాధికి ఋతు సంబంధ బాధలకు నేలతాడి వేర్లను, పల్లేరు కాయలు, బూరుగు (జిగురు), దూలగొండి విత్తులు, మాసారి తీగ సమభాగాలుగా కలిపి, ఎండించి చూర్ణం చేసి, పాలతో ఇస్తే తగ్గుతుంది. దీనినే ముసల్యాది చూర్ణం అని అంటారు.

ఆయుర్వేదం

మార్చు

వేరు నూరి పైపూతగా చనుకట్లు గట్టిపడడానికి, పెరగడానికి వాడతారు. ఆయుర్వేద ఔషధమయిన అశ్వగంధారిష్టలో ఈ మొక్కను ఉపయోగిస్తారు. అరటి దుంప రసంలో, నేలతాడి దుంపల చూర్ణం కలిపి, రోజుకు రెండు లేక మూడు సార్లు ఇస్తే, రోజు మార్చి రోజు వచ్చే జ్వరాలు తగ్గుతాయి. ఈ చూర్ణాన్ని పిపళ్ళ చూర్ణములో కలిపి తింటే, జీర్ణ జ్వరాలన్నీ పోతాయి. వన చూర్ణంలో, నేలతాడి దుంపల చూర్ణం కలిపి గుంటగలిజేరు రసంలో తీసుకుంటే, సకలవాత వ్యాధులు హరిస్తాయి. ఈ చూర్ణాన్ని మజ్జిగలో కలుపుకొని ప్రతి నిత్యం తీసుకుంటే, బొల్లి వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. కొంత కాలానికి గుణం కనిపిస్తుంది. నేలతాడి చూర్ణం త్రిఫల కషాయంలో రెండు లేక మూడు పూటలు 40 రోజులు తీసుకుంటే జలధరు వ్యాధి తగ్గుతుంది.

మూలాలు

మార్చు
  1. USDA ARS, National Genetic Resources Program. "Curculigo orchioides Gaertn". Germplasm Resources Information Network - (GRIN). Beltsville, Maryland, USA: National Germplasm Resources Laboratory. Archived from the original on 11 అక్టోబరు 2012. Retrieved 30 May 2011.

మందుమొక్క - ఆదివారం, ఆంధ్రజ్యోతి - డా.వేదవతి

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=నేలతాడి&oldid=4367401" నుండి వెలికితీశారు