నైనా పోల్కంపల్లి శాంతాదేవి రచనలో వెలువడిన నవల. 2008 సంవత్సరంకి 'నైనా' రచయిత్రి ఉత్తమ గ్రంధం గా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహితీ పురస్కారం పొందింది.

రచన నేపథ్యం మార్చు

నాలుగు దశాబ్దాలు క్రితం రచనరంగంలో అడుగుపెట్టిన పోల్కంపల్లి శాంతాదేవి కలం నుండి వెలువడిన 60కి పైగా నవలలూ, 70కి పైగా కథలూ వివిధ వార, మాస పత్రికలలో ప్రచురింపబడ్డాయి. 'జీవన సంగీతం' నవలకు తెలుగు సినీ దర్శకులు శ్రీ వి.మధుసూదనరావు గారు నుండి, ప్రేమ బంధం నవలకు ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక నుండి, 'అడవి మంట'నవలకు ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక నుండి బహుమతులు అందుకున్నారు. ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక లో సీరియల్ గా వచ్చిన 'చండీప్రియ' నవల అంజలి పిక్చర్స్ ద్వారా అదే పేరుతో చలన చిత్రంగా రూపుదిద్దుకుంది. ఆంధ్ర భూమి వీక్లీ లోనే సీరియల్ గా వచ్చిన 'పుష్యమి' అనే నవల 'ఆత్మబందువు' పేరుతో టెలీ సీరియల్ గా ప్రసారమైంది. 1991 లో అభినందన అనే సాంస్కృతిక సంస్థ నుండి శ్రీమతి మాదిరెడ్డి సులోచన స్మారక అవార్డు అందుకున్నారు. శ్రీమతి మల్లాది సుబ్బమ్మ గారు ఇచ్చే 'ధర్మనిధి అవార్డు' 1995 లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి అందుకున్నారు. శాంతా దేవి గారి నవలలమీద పరిశోధనా వ్యాసం సమర్పించి చంద్ర రేఖ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ తీస్కున్నారు. ఆమె కదల మీద పరిశోధనా వ్యాసం సమర్పించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఉమ్మేత్తల అనే ఆయన ఎం.ఫిల్ తీసుకున్నారు. నైనా వార్త (పత్రిక) లో డైలీ సీరియల్ గా ప్రచురితమై అశేష ప్రజాభిమానాన్ని చూరగొన్న నవల.

"https://te.wikipedia.org/w/index.php?title=నైనా&oldid=3879072" నుండి వెలికితీశారు