ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక
1967లో ఈ వారపత్రిక ప్రారంభించబడింది. నార్ల వెంకటేశ్వరరావు ఈ పత్రికకు తొలి సంపాదకుడు. కె.ఎల్.ఎన్.ప్రసాద్ ప్రచురణకర్త. విజయవాడ నుండి వెలువడేది. పురాణం సుబ్రహ్మణ్యశర్మ, తోటకూర రఘు మొదలైన వారు ఈ పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. ఫిడేలు రాగాలు, ఇల్లాలి ముచ్చట్లు, జోకాభిరామాయణం మొదలైన శీర్షికలు పాఠకుల అభిమానాన్ని చూరగొన్నాయి.
06 ఏప్రిల్ 1979 సంచిక[1]లో ఈ క్రింది అంశాలు ఉన్నాయి.
- లోకాభిప్రాయం
- లోకానందం
- ఆల్బర్ట్ ఐన్ష్టాయిన్ - డి.వి.ఎన్.శర్మ
- ప్రేమ నక్షత్రం - కొమ్మూరి వేణుగోపాలరావు
- ఇరుకుగది - శ్రీరంగం
- రాగతరంగిణి - పాటిబండ్ల విజయలక్ష్మి
- యువజ్యోతి - ఎమ్వీయల్
- ఆత్మహత్యపై వ్యాసరచన పోటీ - డా.కె.వి.ఆర్.సుబ్బారావు
- మీరజాలగలనా - జి.ఉషావిఠల్
- సినీ జనారణ్యం - ఎన్.ఆర్.నంది
- చెపుతున్నానా - పాలకూర సీతాలత
- గోల్మాల్ - వాణిశ్రీ
- పంచవటి - మాలతీ చందూర్
- ట్వింకిల్ - ఇస్మాయిల్
- చిత్రప్రదేశ్ - మోహన్‌కుమార్
- ప్రేమిస్తాను - కె.శివకుమార్
- దివాంధం - రావి రంగారావు
- భాగ్యజ్యోతి
- గ్రంథావని
మూలాలు
మార్చు- ↑ ఎడిటర్ (1979-04-06). "విషయసూచిక". ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రిక. 13 (5): 5. Retrieved 20 January 2015.[permanent dead link]