నోనాడెకేన్
నోనాడెకేన్ నార్మల్(n-)నోనాడెకేన్(n-nanodecane)అనేది 19 కార్బనులు కల్గిన,సరళ(నేరు)శృంఖలం కలిగిన సంతృప్త హైడ్రోకార్బన్ ఆల్కేన్.ఇది ఆర్టెమిసియా అర్మేనియాకా నుండి వేరుచేయబడిన ఆవశ్యక నూనెలలో లభిస్తుంది.ఇది మొక్కల మెటాబోలైట్ భూమికను కల్గి వున్నది మరియు అస్థిర నూనె(volatile oil) వంటి లక్షణాలు కలిగి ఉంది.[2]ఇది పొడవైన హైడ్రోకార్బన్ గొలుసు కల్గిన మైనం వంటి పదార్ధం.[3]నోనాడెకేన్ అనేది కామెల్లియా సినెన్సిస్, వనిల్లా మడగాస్కారియెన్సిస్ మరియు ఇతర జీవులలో లభించే ఒక సహజ ఉత్పత్తి.రసాయన అణు సూత్రంC19H40[4]
పేర్లు | |
---|---|
Preferred IUPAC name
Nonadecane | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [629-92-5] |
పబ్ కెమ్ | 12401 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 211-116-8 |
SMILES | C(CCCCCCCCCCCCCCCCC)C |
ధర్మములు | |
C19H40 | |
మోలార్ ద్రవ్యరాశి | 268.518 |
స్వరూపం | White crystals or powder |
సాంద్రత | 0.786 |
ద్రవీభవన స్థానం | 32 °C (90 °F; 305 K) |
బాష్పీభవన స్థానం | 330 °C (626 °F; 603 K) |
బాష్ప పీడనం | 1 mmHg at 133 °C |
ప్రమాదాలు[1] | |
జ్వలన స్థానం | {{{value}}} |
స్వయం జ్వలన
ఉష్ణోగ్రత |
230 °C (446 °F; 503 K) |
సంబంధిత సమ్మేళనాలు | |
Related {{{label}}} | {{{value}}} |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
Infobox references | |
లభించు వనరులు
మార్చుఇది పోమ్స్, పుచ్చకాయలు,పసుపు, బెల్ పెప్పర్స్, మసాలా దినుసులు మరియు బొప్పాయిలో లభిస్తుంది.నోనాడెకేన్ అనేది ఆర్టెమిసియా ఆర్మేనియాకా నుండి వేరుచేయబడిన ఆవశ్యక నూనెలలో ఒక భాగం మరియు రోసా డమాస్సీన్ నుండి తీసిన రోజ్ ఆవశ్యక నూనెలో భాగం కూడా. [5]బొగ్గు మరియు ఇతర ఫోర్సిల్ ఆర్గానిక్ పదార్థాల నుండి తారులో నోనాడెకేన్ కనుగొనబడింది.[6]
నోనాడెకేన్ నిర్మాణం-సౌష్టవం
మార్చుCH−3[CH2]−17CH3 అని కూడా పిలువబడే నోనాడెకేన్, ఆల్కేనులు అని పిలువబడే కర్బన సమ్మేళనాల తరగతికి చెందినది.ఇవి సాధారణ ఫార్ములా {{chem2|CnH2n+2)ని కలిగి ఉండే సరళ లేదా వలయాకార,శాఖయుత లేదా శాఖ రహిత హైడ్రోకార్బన్‌లు.అందువల్ల నోనాడెకేన్లో పూర్తిగా హైడ్రోజన్ పరమాణువులు మరియు సంతృప్త కార్బన్ పరమాణువులు ఉంటాయి.నోనాడెకేన్ చాలా హైడ్రోఫోబిక్(జల వికర్షక) అణువు, ఆచరణాత్మకంగా నీటిలో కరగదు మరియు సాపేక్షంగా తటస్థంగా ఉంటుంది.అందువలన,నోనాడెకేన్ ఒక హైడ్రోకార్బన్ లిపిడ్ అణువుగా పరిగణించబడుతుంది.[7]
భౌతిక గుణాలు
మార్చునోనాడెకేన్ తెల్లని స్ఫటికాకార ఘన వస్తువు.
లక్షణం/గుణం | మితి/విలువ |
అణు సూత్రం | C19H40[8] |
అణుభారం | 268.5 గ్రా/మోల్[8] |
ద్రవీభవన ఉష్ణోగ్రత | 31.50°C[9][10] |
మరుగు స్థానం | 330°C[11][10] |
ఫ్లాష్ పాయింట్ | 100°C(212°F) [12][10] |
సాంద్రత | 0.786 గ్రా/మి.లీ.25°Cవద్ద.[13] |
వక్రీభవన గుణకం | 1.4410[13] |
వాయు సాంద్రత | 9.27 (గాలి=1)[13] |
బాష్పీభవన గుప్తోష్ణం | 76.2కి.జౌల్స్/మోల్ |
క్లోరోఫామ్, హెక్సేన్లో కరుగుతుంది.[6]
ఉపయోగాలు
మార్చు- కాస్మెటిక్స్ మరియు పెర్ఫ్యూమ్‌లలో నోనాడెకేన్ సువాసన ఏజెంట్‌గా ఉపయోగించబడుతుంది.[13]
- మధుమేహం వంటి జీవక్రియ రుగ్మతలకు ఇది కొన్ని చికిత్సా ప్రయోజనాలను కలిగి ఉన్నట్లు చూపబడింది, అయితే ఇది ఇన్సులిన్ ప్రత్యామ్నాయంగా పని చేయదు.కొన్ని రకాల క్యాన్సర్లకు చికిత్స చేయడంలో నానాడెకేన్ కూడా ప్రభావవంతంగా ఉన్నట్లు చూపబడింది.డ్రగ్ డెలివరీ కోసం ఉపయోగించే మైక్రోక్యాప్సూల్స్‌లో నోనాడెకేన్ సంకలితంగా ఉపయోగించబడుతుంది.[14]
- N-నోనాడెకేన్సాధారణంగా గ్యాస్ క్రోమాటోగ్రఫీలో సూచన సమ్మేళనంగా మరియు వివిధ పరిశ్రమలలో ద్రావకం వలె ఉపయోగించబడుతుంది. ఇది సర్ఫ్యాక్టెంట్లు, కందెనలు మరియు ఇతర రసాయనాల ఉత్పత్తిలో కూడా ఉపయోగించబడుతుంది.[6]
దుష్పలితాలు
మార్చుఅగ్ని ప్రమాదం
మార్చు- మండే / మండే పదార్థం. రాపిడి, వేడి, స్పార్క్స్ లేదా మంటల ద్వారా మండించబడవచ్చు. కొన్ని మంట-దహనం ప్రభావంతో వేగంగా కాలిపోవచ్చు.పౌడర్‌లు, డస్ట్‌లు, షేవింగ్‌లు, బోరింగ్‌లు, టర్నింగ్‌లు లేదా కటింగ్‌లు పేలుడు హింసత్మక్ంగా పేలవచ్చు లేదా కాలిపోవచ్చు.మంటలు ఆరిపోయిన తర్వాత మళ్లీ మండవచ్చు.[15]
- మంటలను ఆర్పేందుకు మీరు పొడి రసాయనం, కార్బన్ డయాక్సైడ్, నురుగు లేదా హాలోన్ ఆర్పే యంత్రాన్ని ఉపయోగించవచ్చు; నీటి స్ప్రేని కూడా ఉపయోగించవచ్చు.
ఆరోగ్య సమస్యలు
మార్చు- కళ్ళలోపడిన,చర్మం మీద పడిన మంటగా అంపిస్తుంది.చికాకు కల్గుతుంది.[16]
- ప్రాధమిక చికిత్స చెసి,తరువాత వైద్యుని వద్దకు తిదుకు వెళ్ళాలి.
ఇవి కూడా చదవండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Hazard Rating Information for NFPA Fire Diamonds". Archived from the original on 2015-02-17. Retrieved 2015-03-13.
- ↑ "Nonadecane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-28.
- ↑ "N-NONADECANE". cameochemicals.noaa.gov. Retrieved 2024-04-28.
- ↑ "Nonadecane". webbook.nist.gov. Retrieved 2024-04-28.
- ↑ "Nonadecane". foodb.ca. Retrieved 2024-04-28.
- ↑ 6.0 6.1 6.2 "N-NONADECANE". guidechem.com. Retrieved 2024-04-28.
- ↑ "Nonadecane". hmdb.ca. Retrieved 2024-04-28.
- ↑ 8.0 8.1 "Nonadecane". chemspider.com. Retrieved 2024-04-28.
- ↑ Haynes, W.M. (ed.). CRC Handbook of Chemistry and Physics. 95th Edition. CRC Press LLC, Boca Raton: FL 2014-2015, p. 3-424
- ↑ 10.0 10.1 10.2 "n-Nonadecane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-28.
- ↑ Larranaga, M.D., Lewis, R.J. Sr., Lewis, R.A.; Hawley's Condensed Chemical Dictionary 16th Edition. John Wiley & Sons, Inc. Hoboken, NJ 2016., p. 986
- ↑ Sigma-Aldrich; Safety Data Sheet for Nonadecane. Product Number: N28906, Version 4.3 (Revision Date 07/01/2014). Available from, as of November 8, 2016:
- ↑ 13.0 13.1 13.2 13.3 "N-NONADECANE". chemicalbook.com. Retrieved 2024-04-28.
- ↑ "Nonadecane". biosynth.com. Retrieved 2024-04-28.
- ↑ "Fire Hazards". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-28.
- ↑ Bingham, E.; Cohrssen, B.; Powell, C.H.; Patty's Toxicology Volumes 1-9 5th ed. John Wiley & Sons. New York, N.Y. (2001)., p. V4 72