నోరి నరసింహశాస్త్రి
నోరి నరసింహశాస్త్రి (1900 - 1978) ప్రముఖ తెలుగు కవి. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, కన్నడ భాషలలో అతివేలమయిన అభినివేశాన్ని సంపాదించుకున్న మనీషులు. సాహిత్య శాస్త్రవలోకనంలో, ప్రాచీనాంధ్ర కవితా పరిశీలనంలో, అధునాతన సాహిత్య నిర్మాణంలో, సాంస్కృతిక అధ్యయనంలో, నవ్య సాహిత్య సమీక్షలో శ్రీ శాస్త్రిగారు గంభీరమయిన పరిశ్రమ చేసినవారు. సాహిత్యోద్యమంలో అగ్రేసరులు.
నోరి నరసింహశాస్త్రి | |
---|---|
![]() | |
జననం | నోరి నరసింహశాస్త్రి 1900 గుంటూరు |
మరణం | 1978 |
వృత్తి | కవి, నాటక, నవలా రచయిత |
తండ్రి | హనుమచ్ఛాస్త్రి |
తల్లి | మహాలక్ష్మి |
జీవిత విశేషాలు సవరించు
నరసింహశాస్త్రిగారు 1900 సంవత్సరంలో జూన్ 2వ తేదీన హనుమచ్చ శాస్త్రి, మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. వీరి పూర్తి పేరు వెంకట లక్ష్మీనరసింహ శాస్త్రి. బి.ఎ. (1919) బి. యల్. (1925) పట్టభద్రులు. వృత్తి రీత్యా న్యాయవాదులైనా ప్రవృత్తి రీత్యా సనాతన ధర్మవాది. శ్రీకల్యాణానంద భారతీస్వామివారివద్ద దీక్ష స్వీకరించి "విజ్ఞానంద" అనే నామాన్ని స్వీకరించారు.
వీరు సాహితీ సమితి కార్యదర్శిగాను, రాష్ట్ర సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగాను పనిచేశారు. వీరు నవ్యసాహిత్యపరిషత్తును స్థాపించినారు.
రచనలు సవరించు
- 1. గీతమాలిక
- 2. భాగవతావరణము (పద్యనాటిక)
- 3. సోమనాథ విజయము (నాటకము)
- 4. ఖేమాభిక్కుని
- 5. వరాగమనము
- 6. ఆత్మమృతి
- 7. తేనెతెట్టె
- 8. పతంగయాత్ర
- 9. స్వయంవరము.
- 10. షణ్ణవతి (ఇత్యాది నాటికలు, కావ్యములు)
- 11. నారాయణభట్టు (నవల)
- 12. రుద్రమదేవి (నవల)
- ఇంకను, అనేక కథలు, వ్యాసములు.
బిరుదములు సవరించు
- కవి సమ్రాట్
మరణము సవరించు
వీరు 1978, జనవరి 4న హైదరాబాదులో తమ 77వ యేట మరణించారు[1].
మూలాలు సవరించు
- ఆంధ్ర రచయితలు, మధునాపంతులసత్యనారాయణ శాస్త్రి, 1950, పేజీలు: 560-3.
- నోరి నరసింహ శాస్త్రి రచనలు తెలుగుపరిశోధనలో
- ↑ సంపాదకులు (5 January 1978). "నోరి నరసింహశాస్త్రి కాలధర్మం". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 64, సంచిక 272. Retrieved 13 December 2017.[permanent dead link]