పంకజ్ అద్వాని
పంకజ్ అర్జన్ అద్వాని (సింధీ: पंकज आडवाणी, پنڪج آڏواڻي; కన్నడ: ಪಂಕಜ್ ಅಡ್ವಾಣಿ) (జననం 24 జూలై 1985 పూనేలో) [3] భారతదేశానికి చెందిన స్నూకర్, బిలియర్డ్స్‌ల ప్రపంచ ఛాంపియన్. ఆయనకు 2018లో భారత అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ లభించింది.[4]
జననం | పూణె, మహారాష్ట్ర, భారతదేశం | 1985 జూలై 24
---|---|
క్రీడా దేశం | భారతదేశం |
మారుపేరు | ద ప్రిన్స్ ఆఫ్ ఇండియా ద గోల్డెన్ బోయ్ |
Highest ర్యాంకింగ్ | 56 (2013/2014) |
Career winnings | £59,763[1] |
Highest break | Snooker: 136 (2014 China Open qualifying)[1] Billiards: 876 |
Century breaks | 16[1] |
ఉత్తమ ర్యాంకింగ్ h | Quarter-final (2013 Welsh Open, 2013 Indian Open) |
Tournament wins | |
ప్రపంచ ఛాంపియన్ | Billiards: 10 times (current world number 1 in 6-red snooker and World Team Billiards)[2] |
Medal record | |||
---|---|---|---|
ప్రాతినిధ్యం వహించిన దేశము భారతదేశం | |||
Men's English billiards | |||
Asian Games | |||
స్వర్ణము | 2006 Doha | Singles | |
స్వర్ణము | 2010 Guangzhou | Singles |
వృత్తి జీవితం
మార్చుఅతను తన మొదటి వరల్డ్ ఛాంపియన్‌షిప్ హోదాను 2003లో చైనాలో IBSF వరల్డ్ స్నూకర్ ఛాంపియన్‌షిప్ లో గెలుపొందాడు.
2005లో క్వార, మాల్టాలో తన సహ దేశస్థుడు దేవేంద్ర జోషిని ఓడించి IBSF వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ సాధించిన తరువాత, ఆయన మాల్టాకు చెందిన పాల్ మిఫ్సుద్ తరువాత బిలియర్డ్స్, స్నూకర్ ప్రపంచ హోదాలను పొందిన రెండవ క్యూయిస్ట్‌గా నిలిచాడు.[5] అతను అరవింద్ సవుర్ వద్ద బెంగుళూరులో దాదాపు ఒక దశాబ్దం పాటు శిక్షణ పొందాడు. 2005లో IBSF వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్‌ను పాయింట్లు, కాల పద్ధతులు రెండిటిలో గెలిచి "గ్రాండ్ డబుల్" ను సాధించిన ఏకైక క్రీడాకారునిగా నిలిచిన అద్వాని, 2008లో బెంగుళూరులో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో ఇదే విన్యాసాన్ని పునరావృతం చేసాడు.
హోదాలు
మార్చు- 2010
- ఏషియన్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్
- 2009
- వరల్డ్ ప్రొఫెషనల్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ [6]
- ఏషియన్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్
- 2008
- IBSF వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ (రెండు విధాలుగా- కాలం, పాయింట్లు)
- ఏషియన్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్
- 2006
- ఏషియన్ గేమ్స్ బంగారు పతకం- ఇంగ్లీష్ బిలియర్డ్స్ సింగిల్స్
- 2005
- IBSF వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ (రెండు విధాలుగా- కాలం, పాయింట్లు)
- ఏషియన్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్
- ఇండియా బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్
- ఇండియా జూనియర్ స్నూకర్ ఛాంపియన్‌షిప్
- ఇండియా జూనియర్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్
- WSA ఛాలెంజ్ టూర్
- 2004
- WSA ఛాలెంజ్ టూర్
- 2003
- IBSF వరల్డ్ స్నూకర్ ఛాంపియన్‌షిప్
- ఇండియన్ జూనియర్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్
- ఇండియన్ జూనియర్ స్నూకర్ ఛాంపియన్‌షిప్
- 2001
- ఇండియన్ జూనియర్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్
- 2000
- ఇండియన్ జూనియర్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్
- 1999
- పాట్ షాట్ ఆల్ ఇండియా ట్రయాన్గ్యులర్ ఛాంపియన్‌షిప్
- పాట్ షాట్ నాన్-మెడలిస్ట్ ఛాంపియన్‌షిప్
- 1998
- కర్ణాటక స్టేట్ జూనియర్ స్నూకర్ ఛాంపియన్‌షిప్
- 1997
- 27వ BS సంపత్ మెమోరియల్ హాండీకాప్ స్నూకర్ ఛాంపియన్‌షిప్
- T.A. సెల్వరాజ్ మెమోరియల్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్
- కర్ణాటక స్టేజ్ జూనియర్ స్నూకర్ ఛాంపియన్‌షిప్
పురస్కారాలు, గౌరవాలు
మార్చు- పద్మ శ్రీ, భారతదేశ నాల్గవ అత్యున్నత పౌర సన్మానం, 2009 [7]
- రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, భారతదేశ అత్యున్నత క్రీడా సన్మానం, 2005-06 [8]
- రాజ్యోత్సవ పురస్కారం, కర్ణాటక యొక్క అత్యున్నత పౌర పురస్కారం, 2007.[9]
- 2007లో కర్ణాటక యొక్క'కెంపెగౌడ పురస్కారం".
- 2006లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం.
- 2005లో విజన్ అఫ్ ఇండియా యొక్క "ఇంటర్నేషనల్ ఇండియన్" పురస్కారం.
- 2005 సంవత్సరానికి సీనియర్ స్పోర్ట్స్ పర్సన్ అఫ్ ది ఇయర్
- బెంగుళూరు క్రీడా రచయితల సంఘ పురస్కారం
- 2005 సంవత్సరానికి బెంగుళూరు విశ్వవిద్యాలయం యొక్క స్పోర్ట్స్ పర్సన్ అఫ్ ది ఇయర్ పురస్కారం
- 2004లో ది హీరో ఇండియా స్పోర్ట్స్ అవార్డు (HISA)
- 2004లో రాజీవ్ గాంధీ పురస్కారం
- 2004లో అర్జున అవార్డు
- ది ఇండో-అమెరికన్ యంగ్ అచీవర్'స్ అవార్డు - 2003
- ది స్పోర్ట్స్ స్టార్‌స్పోర్ట్స్ పర్సన్ అఫ్ ది ఇయర్ 2003.
వ్యక్తిగత జీవితం
మార్చుఅద్వాని, ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్, బెంగుళూరులో విద్యాభ్యాసం చేసారు. శ్రీ భగవాన్ మహావీర్ జైన్ కళాశాల, బెంగుళూరు, లో బిజినెస్ కమ్యూనికేషన్స్ అభ్యసించాడు .
సూచనలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-12. Retrieved 2016-02-07.
- ↑ http://timesofindia.indiatimes.com/sports/more-sports/snooker/billiards/Historic-title-win-for-Advani-in-Egypt/articleshow/37466644.cms
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-09-17. Retrieved 2010-10-21.
- ↑ "Republic Day 2018: Full list of Padma Awardees". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-01-25. Retrieved 2018-01-25.
- ↑ http://www.ibsf.info/past-champions.shtml Archived 2013-01-20 at the Wayback Machine IBSF Past Champions
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-01-25. Retrieved 2010-10-21.
- ↑ http://pib.nic.in/release/release.asp?relid=46983
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-04-21. Retrieved 2010-10-21.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-11-19. Retrieved 2010-10-21.