రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న (Rajiv Gandhi Khel Ratna) పురస్కారం భారత దేశంలో అత్యున్నతమైన క్రీడా పురస్కారం. భారత మాజీ ప్రధాని కీ.శే. రాజీవ్ గాంధీ ఙ్నాపకార్ధం 1991-92 లో ఈ పురస్కారం ప్రారంభింపబడింది. ఒక ప్రశంసాపత్రము, ఒక పతకం, నగదు ఈ పురస్కారం లోని భాగాలు.

Rajiv Gandhi Khel Ratna Award
Rajiv gandhi khel ratna award.png
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం Civilian
విభాగం Sports (Individual / Team)
వ్యవస్థాపిత 1991–1992
మొదటి బహూకరణ 1991–1992
బహూకరించేవారు Government of India
నగదు బహుమతి 750,000
వివరణ Highest sports honour in India
మొదటి గ్రహీత(లు) Viswanathan Anand
క్రితం గ్రహీత(లు) Yogeshwar Dutt, Vijay Kumar
Award Rank
none ← Rajiv Gandhi Khel Ratna AwardArjuna Award

ఒలింపిక్స్, ఆసియాడ్, కామన్‌వెల్త్ క్రీడల్లో గాని, బిలియర్డ్స్, స్నూకర్, క్రికెట్, చదరంగం వంటి క్రీడల్లో గానీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వ్యక్తిగత క్రీడాకారునికి లేక టీంకు ఈ పురస్కారం ఇస్తారు. సాధారణంగా, పురస్కారం ప్రకటించేందుకు, ఒక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మరుసటి సంవత్సరం మార్చి 31 వరకు కనబరచిన ప్రదర్శనలను లెక్కిస్తారు. క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పురస్కార విజేతను నిర్ణయించేందుకు క్రీడలతో సంబంధమున్న వారితో కూడిన ఒక ఎంపిక కమిటీని నియమిస్తుంది. ఏదైనా సంవత్సరం ప్రదర్శనలు ఆశించిన విధముగా లేవని కమిటీ భావిస్తే ఆ ఏటికి పురస్కార ప్రదానం జరగదు.

ఇప్పటివరకు ఈ పురస్కారం వేరు వేరు విభాగాలకు చెందిన ఇద్దరేసి క్రీడాకారులకు సంయుక్తంగా ప్రదానం రెండు సార్లు చేయగా, 1993-94 లో మాత్రం ఎవ్వరికీ ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఒక్క మారు మాత్రమే టీం క్రీడాకారులకు పురస్కారం లభించింది. ఈ పురస్కారంలో నగదు బహుమతి 1991-92 లో లక్ష రూపాయిలు, 2000-01 లో మూడు లక్షల రూపాయిలు, 2004-05 నాటికి అయిదు లక్షల రూపాయిలు ఉంది.

అర్జున అవార్డుకు, ఈ పురస్కారానికి మధ్య ఉన్న ముఖ్య వ్యత్యాసం ఏమనగా - అర్జున అవార్డు ప్రతి క్రీడలోని ఉత్తమ క్రీడాకారునికి ఇస్తారు, కానీ ఈ పురస్కారం మాత్రం క్రీడాకారులందరిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి మాత్రమే ఇస్తారు. ఖేల్ రత్న అను హిందీ పదానికి క్రీడారత్నమని అర్ధం.

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కార విజేతలుసవరించు

క్రమ సంఖ్య సంవత్సరం క్రీడాకారుని (ల) పేరు/పేర్లు క్రీడావిభాగము
01 1991-92 విశ్వనాధన్ ఆనంద్ చదరంగం
02 1992-93 గీత్ సేథి బిలియర్డ్స్
03 1993-94 పురస్కార ప్రదానం జరుగలేదు -
04 1994-95 హోమీ మోతీవాలా, పి. కె. గర్గ్ యాటింగ్ (టీం క్రీడ)
05 1995-96 కరణం మల్లీశ్వరి వెయిట్‌లిఫ్టింగ్
06 1996-97 లియాండర్ పేస్, కుంజరాణి (సహవిజేతలు) టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్
07 1997-98 సచిన్ టెండుల్కర్ క్రికెట్
08 1998-99 జ్యోతిర్మయి సిక్దర్ ఆథ్లెటిక్స్
09 1999-2000 ధన్‌రాజ్ పిళ్ళై హాకీ
10 2000-01 పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్
11 2001-02 అభినవ్ భింద్ర షూటింగ్
12 2002-03 అంజలి వేద్ పాథక్ భగవత్, బీనామోల్ (సహవిజేతలు) షూటింగ్, ఆథ్లెటిక్స్
13 2003-04 అంజు బాబి జార్జ్ ఆథ్లెటిక్స్
14 2004-05 రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ షూటింగ్
15 2005-06 పంకజ్ అద్వానీ బిలియర్డ్స్ & స్నూకర్స్
16 2006-07 మనవ్జీత్ సింగ్ సంధు షూటింగ్
17 2007-08 మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్
18 2011-12 విజయ్ కుమార్ (shooting) yogshwar dutt (wresting)

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు