పంకజ్ రాయ్
దస్త్రం:Vinoo Mankad and Pankaj Roy after record breaking opening stand 1956.jpg
1956 జనవరి 11 న మద్రాసులో 413 పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యం సాధించాక పెవిలియన్‌కు తిరిగి వస్తున్న పంకజ్ రాయ్ (ఎడమ), వినూ మన్కడ్. అప్పటి ఆ రికార్డు 52 ఏళ్ళ పాటు నిలిచి ఉంది.
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1928-05-31)1928 మే 31
ఢాకా, బెంగాల్ ప్రెసిడెన్సీ (ప్రస్తుత బంగ్లాదేశ్)
మరణించిన తేదీ2001 ఫిబ్రవరి 4(2001-02-04) (వయసు 72)
కోల్‌కతా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం మీడియం పేస్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 54)1951 నవంబరు 2 - ఇంగ్లాండు తో
చివరి టెస్టు1960 డిసెంబరు 2 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫక్లా
మ్యాచ్‌లు 43 185
చేసిన పరుగులు 2,442 11,868
బ్యాటింగు సగటు 32.56 42.38
100లు/50లు 5/9 33/50
అత్యధిక స్కోరు 173 202*
వేసిన బంతులు 104 1,146
వికెట్లు 1 21
బౌలింగు సగటు 66.00 30.85
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/6 5/53
క్యాచ్‌లు/స్టంపింగులు 16/– 74/–
మూలం: CricInfo, 2017 మార్చి 5

పంకజ్ రాయ్ (1928 మే 31 - 2001 ఫిబ్రవరి 4) భారతీయ క్రికెటర్, మాజీ జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్.[1][2][3] కుడిచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. 1956 జనవరిలో చెన్నైలో న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో రాయ్, వినూ మన్కడ్‌తో కలిసి 413 పరుగుల ప్రపంచ రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ రికార్డు 2008 వరకు నిలిచి ఉంది. 2000 లో అతను కోల్‌కతా షెరీఫ్‌గా నియమితుడయ్యాడు. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.[4][5] అతని మేనల్లుడు అంబర్ రాయ్, కుమారుడు ప్రణబ్ రాయ్ కూడా భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడారు. అతను విద్యాసాగర్ కళాశాల విద్యార్థి.[6] 2016లో, అతనికి మరణానంతరం C. K. నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది.[7] ఇది మాజీ ఆటగాడికి BCCI అందించే అత్యున్నత గౌరవం.

ఫస్ట్ క్లాస్ కెరీర్ మార్చు

రాయ్ బెంగాల్ క్రికెట్ జట్టు తరఫున భారతదేశంలో దేశీయ క్రికెట్ ఆడాడు. 1946-47లో తన తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచిలో శతకం సాధించాడు. 42.38 సగటుతో, మొత్తం 33 సెంచరీలతో, 11,868 ఫస్ట్ క్లాస్ పరుగులు సాధించాడు.

టెస్ట్ కెరీర్ మార్చు

1951లో ఇంగ్లండ్‌ భారత్‌లో పర్యటించినప్పుడు రాయ్‌ భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఢిల్లీలో తొలి టెస్టు ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగులే చేసినప్పటికీ, ఆ సిరీస్‌లో 2 శతకాలు సాధించాడు. తరువాతి వేసవిలో ఇంగ్లండ్‌లో పర్యటించినపుడు, 7 ఇన్నింగ్స్‌లలో 5 సార్లు డకౌటయ్యాడు. ఫ్రాంక్ టైసన్ తొలి ఫస్ట్ క్లాస్ వికెట్‌ అతనిదే. ఈ 5 లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్సులోనూ అయిన రెండు డకౌట్లు ఉన్నాయి. 1952 హెడింగ్లీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఫ్రెడ్ ట్రూమాన్ విధ్వంసకర బౌలింగు వలన భారత స్థితి 0-4 అయినపుడు ఔటైన నలుగురిలో అతనొకడు (మిగతా ముగ్గురు - దత్తా గైక్వాడ్, విజయ్ మంజ్రేకర్, మాధవ్ మంత్రి).

భారతదేశం తరపున రాయ్, మొత్తం ఐదు టెస్ట్ శతకాలు సాధించాడు. 173 పరుగులు అతని అత్యధిక స్కోరు.

1959లో ఇంగ్లండ్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రాయ్, భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది.

మూలాలు మార్చు

  1. দাশ, কৌশিক. "Cricket Celebs | বাংলার প্রথম ক্রিকেট যোদ্ধা". www.anandabazar.com (in Bengali). Retrieved 2022-10-14.
  2. "South Africa set new opening mark" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2008-03-01. Retrieved 2022-10-14.
  3. "OUR SPORTSMEN". 123india.com. Archived from the original on 27 September 2007. Retrieved 27 September 2007.
  4. "Wayback Machine" (PDF). web.archive.org. 2016-11-15. Archived from the original (PDF) on 2016-11-15. Retrieved 2022-10-14.
  5. "Pankaj Roy". www.cricketcountry.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-10-14. Retrieved 2022-10-14.
  6. Basu, Prabhash (6 September 2021). Peekay theWayfarer Tea Planter. p. 16.
  7. "BCCI honours Indian legends Anshuman Gaekwad and Pankaj Roy". International Cricket Council (in ఇంగ్లీష్). 29 April 2018. Retrieved 2023-04-25.